
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Bihar Stampede Today: భారీగా తరలివచ్చిన భక్తుల రద్దీతో బీహార్‌లోని ప్రసిద్ధ లఖిసరాయ్ అశోక్‌ధామ్ ఆలయం వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పవిత్ర శ్రావణ మాసోత్సవాల సందర్భంగా ఆలయంలో పూజలు చేసేందుకు వచ్చిన భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాటలో కనీసం ఏడుగురు మహిళలు దుర్మరణం చెందినట్లు సమాచారం అందుతోంది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఘటనకు అసలు కారణం ఇదే.. శ్రావణ మాసం కావడంతో సోమవారం తెల్లవారుజామున అశోక్‌ధామ్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అదే సమయంలో రెండు రైళ్లు లఖిసరాయ్ స్టేషన్‌కు చేరుకోవడంతో ప్రయాణికులు, భక్తుల రద్దీ ఒక్కసారిగా విపరీతంగా పెరిగింది. అశోక్‌ధామ్ స్టేషన్ నుంచి ఆలయానికి వెళ్లే మార్గంలో జనసమూహం నియంత్రణ దాటింది. అధిక ఒత్తిడి కారణంగా ఒక వైపు ఉన్న బారికేడింగ్ తెగిపోవడంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారు.
మరోవైపు, క్యూలైన్లలో వేలాది మంది నిలబడి ఉన్న సమయంలో అక్కడే ఉన్న ఒక విద్యుత్ స్తంభం కూలిపోయి దాని నుంచి విద్యుత్ ప్రవహించిందనే వదంతులు ఒక్కసారిగా వ్యాపించాయి. ఈ రూమర్ భక్తులలో తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ప్రాణభయంతో భక్తులు ఒక్కసారిగా పరుగులు తీయడంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది.
అధికారుల స్పందన.. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను తక్షణమే సమీప ఆస్పత్రులకు తరలించారు.
ఈ ఘటనపై లఖిసరాయ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (DM) శైలేంద్ర కుమార్ మాట్లాడుతూ.. "ఉదయం సమయంలో రెండు రైళ్లు రావడంతో జనసమూహం అసాధారణ రీతిలో పెరిగింది. బారికేడింగ్ తెగిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది" అని తెలిపారు.
అలాగే ఎస్డిపిఓ శివం కుమార్ మాట్లాడుతూ.. విద్యుదాఘాత వదంతుల వల్ల తొక్కిసలాట జరిగిందా అనే కోణంతో పాటు అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతున్నామని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని స్పష్టం చేశారు. పవిత్ర శ్రావణ వేళ జరిగిన ఈ పెను ప్రమాదం స్థానికంగా తీవ్ర విషదాన్ని నింపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.




