బిగ్ బాస్ సీజన్-10 లో వీకెండ్ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా.. నాగార్జున ఎవరెవరికి కోటింగ్ ఇస్తారా అని ఆడియన్స్ మొత్తం ఎదురుచూశారు. కానీ ఎపిసోడ్ లో జరిగింది మొత్తం రివర్స్. నాగార్జున కోటింగ్ ఇచ్చారు కానీ అది త్రిగుణ్ కి కాదు.. అతనితో మాటలు పడ్డ రోహిత్ కి. ఏ పని చిన్నది కాదు.. ఏ పని తక్కువది కాదు.. అలాంటి ఆలోచనలు ఉంటే హౌస్ లో ఉండొద్దంటూ రోహిత్ కి నాగార్జున వార్నింగ్ ఇచ్చాడు. నా హ్యాండ్స్ కి క్రీమ్ లేదు, మీ ఎంగిలి నేను కడగాలా అనే ఆలోచనలు కరెక్ట్ కాదంటూ క్లాస్ పీకారు. ఎంగిలి అంటే నా ఉద్దేశం అది కాదు సర్ అని చెప్పినా.. అతని నోటితోనే తప్పు ఒప్పుకునేలా చేశారు నాగార్జున. త్రిగుణ్ వాగిన వాగుడికి వెయ్యేనుగుల బలాన్ని ఇచ్చారు.
ఇక రోహిత్ పై ఓ రేంజ్ లో సీరియస్ అయిన నాగార్జున.. త్రిగుణ్ విషయంలో మాత్రం చాలా సాఫ్ట్ గా వెళ్లారు. రోహిత్ ని .. పిల్ల బచ్చా, డొల్ల రాజా, స్టెరాయిడ్ డొల్లా అని త్రిగుణ్ అన్న మాటలను గుర్తు చేసి .. సారీ సర్ అని అనిపించారు. నువ్వు ఈ మూడు మాటలు మాట్లాడటం వల్ల త్రిగుణ్ అనేటోడికి అసలు గుణమే లేదని కన్ఫమ్ అవుతుంది అంటూ స్విమ్మింగ్ పూల్ పక్కన ఉన్న పెద్ద టైర్ ని ఎత్తుకుని తిరగమని శిక్ష వేశారు. ఆ టైర్ ని పట్టుకుని త్రిగుణ్ హ్యాపీగా నవ్వుతూ తిరిగాడు. అతను మాట్లాడిన దారుణమైన మాటలకు, పడిన శిక్షకు అసలు సంబంధమే లేదని.. ఈ వారం మొత్తం కంటెంట్ ఇచ్చింది త్రిగుణ్ కాబట్టే బిగ్ బాస్ అతన్ని ఎంకరేజ్ చేస్తున్నారని ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు.
[Bigg Boss 10 Weekend Episode Nagarjuna coating, Trigun punishment tyre task, Rohith scolded by Nagarjuna, Bigg Boss Telugu 10 weekend, Gunam leni Trigun controversy]
Bigg Boss 10 : నాగార్జునతో కప్పులు కడిగించిన రోహిత్.. తొమ్మిది సీజన్లలో ఇదే తొలిసారి!
Bigg Boss 10 : నాగార్జునతో కప్పులు కడిగించిన రోహిత్.. తొమ్మిది సీజన్లలో ఇదే తొలిసారి!
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com
Disclaimer : All content on this website, including text, images, videos, graphics, and audio, is the intellectual property of ObjectOne Information Systems Ltd. and/or its affiliates. Any unauthorized reproduction, distribution, modification, or publication of this material, in whole or in part, is strictly prohibited without prior written consent from ObjectOne Information Systems Ltd.






