
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Bigg Boss Agnipariksha Season 2: బిగ్‌బాస్ పదో సీజన్ అతి త్వరలో ప్రారంభం కానుండగా.. ఈ హౌస్‌లోకి సాధారణ వ్యక్తులకు అవకాశం కల్పిస్తోంది. గత సీజన్లో కామనర్ ట్రోఫీ ఎత్తుకెళ్లడంతో ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. దీంతో మరోసారి సాధారణ ప్రజలకు అవకాశం కల్పించడంలో భాగంగా అగ్నిపరీక్ష రెండో సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే కామనర్ల కేటగిరిలో కొందరిని ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది. ఆగస్ట్ 15వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న అగ్నిపరీక్షకు సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు.
అగ్నిపరీక్షకు సంబంధించిన వీడియో విడుదల అవడంతో ప్రేక్షకులు ఆసక్తిగా గమనించారు. మొత్తం 70 మంది అగ్నిపరీక్షకు ఎంపికయ్యారు. వారిలో నుంచి పది నుంచి 15 మంది వరకు ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వారి ఎంపిక పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా విడుదల చేసిన ప్రొమోలో గత సీజన్ మాదిరి ప్రశ్నలతోపాటు టాస్క్‌లు ఇచ్చి అగ్నిపరీక్షలో కామనర్లను ఎంపిక చేయనున్నారు. విడుదల చేసిన ప్రొమో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
అగ్ని పరీక్షకు లక్షల్లో దరఖాస్తులు రాగా.. వాటిలో నిర్వాహకులు వడపోసి ప్రతిభ కలిగిన వారిని ఎంపిక చేయడానికి తీవ్రంగా శ్రమించారు. చివరికి 70 మందిని ఎంపిక చేశారని సమాచారం. ఎంపికైన వారిలో చివరకు 15మందిని ఎంపిక చేయనున్నారు. గత సీజన్‌కు వచ్చిన స్పందనతో ఈసారి కామనర్లను హౌస్‌లోకి ఐదు లేదా ఆరుగురికి అవకాశం ఇచ్చేలా కనిపిస్తోంది. 2024 సీజన్లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ట్రోఫీ గెలుచుకోగా.. ఈసారి కూడా రైతు బిడ్డ కేటగిరీలో ఓ అమ్మాయికి అవకాశం ఇచ్చేలా కనిపిస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించి కంటెంట్ చేస్తూ ఆ యువతి ఇప్పటికే ఇన్ఫ్లుయెన్సర్గా గుర్తింపు పొందారు. ఆమె అగ్ని పరీక్షలోకి ఎంట్రీ ఇచ్చిన అనంతరం జడ్జ్‌లు అభిజిత్ , బిందు మాధవి, నవదీప్ ప్రశ్నలు వేశారు. వాటికి అత్యంత తెలివిగా సమాధానం చెప్పడంతో ఆమెకు అగ్నిపరీక్ష తదుపరి పోటీలకు ఎంపిక చేసినట్లు ప్రొమోను చూస్తే అర్థమవుతోంది.
కామనర్లతో సరదాగా మాట్లాడుతూనే జడ్జిలు టాస్క్‌లు.. పంచ్‌లు వేశారు. శ్రీముఖి మరోసారి అగ్నిపరీక్షకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. వ్యూయర్షిప్ పెంచుకునేందుకు.. ప్రేక్షకులకు ఉత్కంఠ రేపేలా నిర్వాహకులు అగ్నిపరీక్షను సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. అగ్నిపరీక్ష ద్వారా బిగ్‌బాస్‌కు క్రేజ్ తీసుకురావాలనే ప్రణాళికతో నిర్వాహకులు ఉన్నారు. మరి అగ్నిపరీక్షకు ఎలాంటి స్పందన లభిస్తుంది? 70 మందిలో ఎవరు హౌస్‌లోకి అడుగుపెడతారనేది ఉత్కంఠ నెలకొంది. కాగా బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్‌కు హోస్ట్‌గా అక్కినేని నాగార్జున మరోసారి వ్యవహరిస్తున్నారు.




