
Aug 18 2026 12:56 PM | Updated on Aug 18 2026 1:04 PM
సాక్షి, బెంగళూరు: దుర్మార్గురాలైన ఒక భార్య చేతిలో భర్త, ఒక చిన్నారి బలైపోయిన ఘటన సంచలనం రేపుతోంది. ప్రియుడితో కలిసి భర్తను, నాలుగేళ్ల కుమారుడి దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోని ఉత్తర బెంగళూరులోని చిక్కబానావర ప్రాంతంలో చోటుచేసుకుంది ఈ ఘటన. తండ్రీ కొడుకుల మరణంపై అనుమానం పోలీసులు ఆరా తీయగా హత్య కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం హరిణి అనే మహిళ ఈ ఘాతుకానికి పాల్పడింది. తన భర్త, కుమారుడు స్పందించడం లేదంటూ హరిణే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. అయితే ప్రేమికుడు వినయ్‌తో కలిసి భర్త అభినందన్‌ను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
స్వల్ప విషయంలో దంపతుల మధ్య గొడవ జరగగా, హరిణి గరిటెతో అభినందన్‌పై దాడి చేసింది. ఆ తర్వాత ఎవరి గదుల్లో వాళ్లు నిద్రపోయారు. ఇదే అదనుగా భావించిన ఆమె వినయ్‌ను ఇంటికి పిలిపించి, ఇద్దరూ కలసి అభినందన్‌పై దాడి చేసి ఊపిరి ఆడకుండా చేసి చంసేశాడు. ఈ దాడి సమయంలో నిద్రలేచిన వారి కుమారుడు యదువీర్ను కూడా దిండుతో ఊపిరి ఆడకుండా చేసి మట్టుబెట్టారు. హరిణిని అదుపులోకి తీసుకుని విచారించగా మరిన్ని షాకింగ్ వివరాలు వెలుగుచూశాయి. అనుమానం రాకుండా ఉండేందుకు ఇంట్లోని రక్తం మరకలను శుభ్రం చేశారని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా, వినయ్ ఇంటికి వచ్చిన సమయంలో సీసీటీవీ కెమెరాలను ఆపివేసి ఉంటారని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదీ చదవండి: ‘‘మా శవాలను తీసుకెళ్లండి’’ : భార్యాబిడ్డల్ని హతమార్చి, నావికుడు సూసైడ్
కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్న పోలీసులు పరారీలో ఉన్న ప్రియుడు వినయ్ కోసం కనకపుర సమీపంలోని హీరోహళ్లి ప్రాంతాల్లో గాలిస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వగ్రామానికి తరలించారు. వినయ్ ఆచూకీ లభ్యమైన తరువాత అతని విచారించిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయం ఇదీ చదవండి: 14 మిలియన్ల ఫాలోవర్లు : కానీ యష్ ఫాలో అయ్యేది ఆమె ఒక్కర్నే!
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు)
18 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లి (ఫొటోలు)
న్యూయార్క్ : 'ఇండియా డే పరేడ్ 2026'లో పూజా హెగ్డే సందడి (ఫొటోలు)
కందుకూరులో వైభవంగా తేళ్ల పంచమి... పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)
హైదరాబాద్ : కన్నుల పండువగా ఇస్కాన్ దేవాలయ స్వర్ణోత్సవాలు (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తనూజ రాణి
మంత్రి చేసిన తప్పు.. సభలో సారీ చెప్పిన సీఎం విజయ్
ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. PF ఖాతా మెర్జ్ చేయకపోతే భారీ నష్టం
రూ.300తో జియో మెంబర్షిప్.. ఇక రీఛార్జ్ టెన్షన్ లేదు





