
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
YS Jagan AP Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సమావేశాల వ్యూహం, పార్టీ ఎమ్మెల్యేల హాజరు, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నియామకంపై జగన్ పార్టీ నేతలతో ప్రత్యేకంగా చర్చించి స్పష్టతనిచ్చారు.
అసెంబ్లీ సమావేశాలు - జగన్ వ్యూహం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వల్ల తమ గొంతు నొక్కుతున్నారని, సభలో మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశాలకు వెళ్లాలనుకునే ఎమ్మెల్యేలు హాజరుకావచ్చని ఆయన సూచించారు.
ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసే క్రమంలో.. శాసనమండలిలో డీఎస్పీ (DSC) నియామకాలు, రాష్ట్రంలో శాంతిభద్రతల (Law & Order) తీరుపై తీవ్రంగా చర్చించాలని ఎమ్మెల్సీలను జగన్ ఆదేశించారు.
అయితే సభకు హాజరు కాని ఎమ్మెల్యేలపై ప్రభుత్వం వేటు వేస్తుందనే ప్రచారంపై స్పందిస్తూ.. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం.
శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా తూమాటి మాధవరావు శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన జకియా ఖానం పదవీకాలం ముగియడంతో, ఆ స్థానానికి కొత్త అభ్యర్థి ఎంపిక అనివార్యమైంది. సీనియారిటీ, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకున్న వైఎస్ జగన్.. ఈ పదవికి తూమాటి మాధవరావు పేరును ఖరారు చేశారు. శాసనమండలిలో వైఎస్సార్సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో తూమాటి మాధవరావు ఎన్నిక ఏకగ్రీవంగా లాంఛనప్రాయం కానుంది.
మండలిలో పార్టీ తరఫున గట్టిగా గళం వినిపించే నేతగా గుర్తింపు ఉండటంతో ఆయనకు ఈ అవకాశం లభించింది. మరోవైపు, బీసీ వర్గానికి చెందిన మహిళా నేత వరుదు కల్యాణి పేరు కూడా పరిశీలనకు వచ్చినప్పటికీ, ఆమెను పార్టీ బాధ్యతల్లోనే కొనసాగించడం మంచిదని జగన్ భావించినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





