
17 Year Old Student Dies After Collapsing During Dj Dance At Wedding In Narayanpet 328526
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Narayanpet Dj Death: స్నేహితుడు పెళ్లి వేడుకల్లో ఆ యువకుడు అందరిలాగే ఉత్సాహంగా డాన్స్ చేస్తూ ఉన్నాడు.. చెవులు చిల్లుపడే డిజె సౌండ్స్ మధ్య స్నేహితులతో కలిసి సందడి చేస్తున్నాడు.. కానీ కాసేపట్లోనే ఆ ఆనందం ఆవిరి అయిపోయింది. డిజె సౌండ్ ల తీవ్రతకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర కలకలం రేపింది.
పోతిరెడ్డిపల్లి కి చెందిన దస్తయ్య, లక్ష్మీ దంపతుల కుమారుడు రవితేజ (17) అక్కడే ఉన్న ఓ కాలేజీలో ఇంటర్ చేస్తున్నాడు.. అయితే తనకు ఎంతో ఇష్టమైన స్నేహితుడు ఇంట్లో పెళ్లి వేడుక ఉండడంతో రాత్రి సమయంలో ఎంతో ఉత్సాహంగా అక్కడికి వెళ్లాడు.. వివాహ సంబరాల్లో భాగంగా భారీ శబ్దాలతో డీజేలను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అయితే స్నేహితులందరూ కలిసి ఆ డిజె సౌండ్స్ మధ్య అందరూ కలిసి బాగా డాన్స్ చేస్తున్నారు..
అయితే ఇంతలోనే.. డిజె సౌండ్స్ తాకిడికి ఆ యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు గమనించిన స్నేహితులు తీవ్రభయాందోళనకు గురయ్యారు.. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అయితే ఆస్పత్రిలో పరీక్షించిన వైద్యులు.. రవితేజ అప్పటికే తీవ్ర గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారణ చేశారు..
చేతికి అందించిన కొడుకు అకాల మరణంతో కానరాని లోకంలోకి వెళ్లడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతాడు అనుకున్న కొడుకు ఇలా విగత జీవిగా మారడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు.. వివాహ వేడుకలు ఒక్కసారిగా ఊహించని ఘటన చోటు చేసుకోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి..
మితిమీరిన శబ్దాలతో వచ్చే డీజేల కారణంగానే ఇప్పటివరకు ఎంతోమంది అస్వస్థకు గురవ్వడమే కాకుండా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ప్రభుత్వ ఆంక్షలు ఎన్ని ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో డీజేల వినియోగం ఏమాత్రం ఆగడం లేదు.. చిన్న పెద్ద తేడా లేకుండా ఎలాంటి వేడుకలైనా డీజేలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా మారి అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటుంది. నిబంధనలను ఉల్లంఘించి విపరీతమైన శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న డీజే ఆపరేటర్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు నిపుణులు కోరుతున్నారు..
Read more: Jagtial: వామ్మో.. హోటల్లో ఇలా కూడా బిల్ వసూలు చేస్తారా..?.. జగిత్యాలలో షాకింగ్ ఘటన..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.






