
Zinc Deficiency: చాలా మందిలో జింక్ (Zinc) లోపం కారణంగా జుట్టు విపరీతంగా రాలుతోంది. అయితే, ఈ సమస్య ఉన్నవారిలో కొన్ని లక్షణాలు ఏర్పడతాయి. వీటిని గుర్తు పెట్టుకుని.. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Zinc Deficiency: ప్రస్తుత చాలా మందిలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న అతిపెద్ద సమస్య జుట్టు రాలడం (Hair Loss).. మానసిక ఒత్తిడితో పాటు ఆధునిక జీవనశైలి, కాలుష్యం, హార్మోన్ల సమస్యల కారణంగా ఈ సమస్య చాలా మంది వస్తోంది. అయితే, పోషకాలు లేని జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా చాలా మంది ఈ జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి.
అయితే, మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఖరీదైన హెయిర్ ఆయిల్స్, షాంపూలు వాడినా జుట్టు రాలడం తగ్గడం లేదా? అయితే, మీ శరీరంలో ఒక ముఖ్యమైన పోషకం లోపించిందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.. జింక్ (Zinc) లోపం కారణంగా కూడా ఇలా తరచుగా జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ లోపం నుంచి విముక్తి పొందడానికి జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
జింక్ మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతగానో సహాయపడుతుంది. జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి, దెబ్బతిన్న జుట్టు కణాల రిపేర్ చేసేందుకు కూడా జింక్ ఎంతగానో కృషి చేస్తుంది.. ముఖ్యంగా జుట్టు ఆరోగ్యానికి, దృఢత్వానికి అవసరమైన కెరాటిన్ (Keratin) అనే ప్రోటీన్ ఉత్పత్తికి జింకే సహాయపడుతుంది.
మన శరీరం ఎల్లప్పుడు, సొంతంగా జింక్‌ను ఉత్పత్తి చేసుకోలేదు.. కాబట్టి మనం తీసుకునే ఆహారం వల్లే దీనిని పొందవచ్చు.. ఈ లోపం ఏర్పడినప్పుడు జుట్టు కుదుళ్లు బలహీనపడి.. జుట్టు వేగంగా రాలిపోవడం మొదలవుతుంది. కాబట్టి ఇలా మీకు కూడా జరిగితే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది..
శరీరంలో జింక్ తగ్గితే కేవలం జుట్టు రాలడం మాత్రమే కాదు.. మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.. జుట్టు చాలా పలచబడటంతో పాటు నిర్జీవంగా మారడం, చివర్లు చిట్లిపోవడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే రోగనిరోధక శక్తి తగ్గిపోయి తరచుగా జలుబు, జ్వరాల బారిన పడటం వంటి సమస్యలు కనిపిస్తాయి.. దీంతో పాటు గాయాలు త్వరగా మానకపోవడం, చర్మంపై దద్దుర్లు రావడం వంటి సమస్యలు కూడా వస్తాయి.
కాబట్టి జింక్ లోపంతో బాధపడేవారు తప్పకుండా గుమ్మడి గింజలు (Pumpkin seeds), బాదం, జీడిపప్పు ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వాల్ నట్స్ లో జింక్ పుష్కలంగా ఉంటుంది. వీటిని ప్రతిరోజూ కొద్దికొద్దిగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. అలాగే శనగలు, రాజ్మా, పెసలలో కందులు వంటి వాటిలో జింక్ అధిక మోతాదులో లభిస్తుంది.