
Ycp Chief Jagan Mohan Reddy Sensational Comments Regarding Ap Government Ppp Model Sn 1121443
'ఏపీ ఫర్ సేల్’ జగన్. అక్రమ కేసులపై కోర్టుకు వెళ్తాం. ఆర్టీసీ ప్రైవేటీకరణపై తీవ్ర ఆందోళన. Jagan Mohan Reddy: కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పీపీపీ (PPP) పాలసీపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్...
'ఏపీ ఫర్ సేల్’ జగన్. అక్రమ కేసులపై కోర్టుకు వెళ్తాం. ఆర్టీసీ ప్రైవేటీకరణపై తీవ్ర ఆందోళన. Jagan Mohan Reddy: కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పీపీపీ (PPP) పాలసీపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రజా రవాణా, తాగునీరు, ఆస్పత్రులు, బడుల వంటి నిత్యావసర ప్రజా సేవలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేలా ఈ విధానం ఉందంటూ ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’ అనే రీతిలో పరిపాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ప్రైవేట్ కంపెనీలకు వడ్డీలు, వియాబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరిట ప్రభుత్వ ధనాన్ని కట్టబెడుతూ, ప్రజలపై యూజర్ ఛార్జీల భారం మోపడం దారుణమని ఆక్షేపించారు. Narendra Modi: జెన్‌జీకి మోదీ సీరియస్ మెసేజ్.. అడ్డదారులు వద్దు.. బలైపోతారు.. కేసుల అణచివేతపై కోర్టుకు వెళ్తాం: రాష్ట్రంలో శాంతియుతంగా నిరసనలు తెలిపే ప్రజాస్వామ్య హక్కును సైతం కాలరాస్తున్నారని, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని జగన్ (Jagan Mohan Reddy)ఆరోపించారు. ముఖ్యంగా బీసీ నేతలను లక్ష్యంగా చేసుకుని ముస్తఫా, విరూపాక్షి, దొంగ సాక్ష్యాలతో చింతాడ రవిలను అరెస్టు చేశారని మండిపడ్డారు. ఈ అణచివేత ధోరణిపై కచ్చితంగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. మరోవైపు మండలి డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు పేరును ప్రకటించిన ఆయన, చంద్రబాబు విడుదల చేస్తున్న వైట్‌పేపర్లు అబద్ధాల 'ఎల్లో పేపర్లు' అని ఎద్దేవా చేశారు. రోడ్డుపైకి ఆర్టీసీ ప్రైవేటీకరణ ముప్పు: ఉద్యోగులు, రైతులు, మహిళలు, విద్యార్థులు ఇలా ఏ వర్గమూ ఈ పాలనతో సంతోషంగా లేరని, సున్నా వడ్డీ రద్దుతో మహిళలు తీవ్రంగా నష్టపోయారని జగన్ పేర్కొన్నారు. సర్కారీ బడులు మూతపడుతున్నాయని, ఇప్పుడు ఏకంగా ఆర్టీసీని కూడా ప్రైవేటీకరించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ప్రతి అంశాన్ని పక్కా ఆధారాలు, సాక్ష్యాలతో ప్రజల్లోకి తీసుకెళ్లి కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో పోరాడతారని స్పష్టం చేశారు.

