
విశాఖపట్నం (వన్‌టౌన్): విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. టీచర్ దెబ్బలు తాళలేక ఓ ఆరేళ్ల విద్యార్థి మృతిచెందాడు. నగరంలోని వన్‌టౌన్ పరిధి లిటిల్ గార్డెన్ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం ఉదయం స్కూల్‌కి వచ్చిన విద్యార్థి ప్రణయ్ తేజ (6)ను హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయురాలు మందలించారు. ఈ క్రమంలో ఆమె చేయిచేసుకున్నారు. టీచర్ కొట్టిన దెబ్బలకు తాళలేక క్లాస్‌రూమ్‌లోనే విద్యార్థి స్పృహ తప్పిపడిపోయాడు. అనంతరం ఆస్పత్రికి తరలించగా.. మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. తేజ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. టీచర్ నిర్వాకంతోనే తమ కుమారుడు మృతిచెందాడని తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ విచారణ చేపట్టింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





