
TukaramMunde కల్తీ కబంధ హస్తాల్లో ఆరోగ్యం. తుకారాం ముండే లాంటి అధికారులు అవసరం.
“ఆరోగ్యమే మహాభాగ్యం” అనే మాట భారతీయ సంస్కృతిలో శాశ్వత సత్యం. మనిషి సంపాదించే ధనం, కూడబెట్టే ఆస్తులు, సంపాదించే హోదా, పేరు ప్రతిష్ఠలు అన్నీ ఆరోగ్యం ఉన్నప్పుడే విలువైనవిగా నిలుస్తాయి. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఆహారమే అనారోగ్యానికి కారణమవుతోంది. మనం డబ్బు పెట్టి కొనుగోలు చేస్తున్న ఆహారం, మనమే అలవాటు చేసుకున్న జీవనశైలి, నిర్లక్ష్యపు ఆహారపు అలవాట్లు, కల్తీ పదార్థాలు, నకిలీ మందులు కలిసి నెమ్మదిగా రోగాల బారిన పడేస్తున్నాయి.
అధిక లాభాల కోసం కొందరు వ్యాపారులు ఆహార పదార్థాల్లో కల్తీ చేయడం సమాజానికి తీవ్రమైన ముప్పుగా మారింది. పాలు, నెయ్యి, వంటనూనెలు, మిరపపొడి, పసుపు, మసాలాలు, తేనె, స్వీట్లు, శీతల పానీయాలు, పండ్లు, కూరగాయలు, పిల్లలు తినే చిరుతిళ్లు వరకు కల్తీ కోరల్లో చిక్కుకుంటున్నాయి.ముంబైలో తుకారాం ముండే ఐపీఎస్ లాంటి నిఖార్సయిన అధికారి కల్తీ ఆహార పదార్థాల విక్రయం పై కొరడా ఝలిపిస్తున్నారు. తనదైన ముద్ర వేశారు. హోటల్ వంటగదుల్లో వొణుకు పుట్టిస్తున్నారు. కల్తీ వ్యాపారానికి చెక్ పెట్టిన ముండే .దేశం మొత్తం ఇలాంటి అధికారుల అవసరం ఉంది.
ప్రజల ప్లేటులో పడేది ఆహారమా లేక విషమా?ఒక హోటల్ వంటగదిలో బొద్దింకలు తిరుగుతున్నా, గడువు ముగిసిన పదార్థాలు వాడుతున్నా ,కల్తీ పాలు మార్కెట్లోకి వస్తున్నా , నూనెలో నాణ్యత లేకపోయినాప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వ్యాపారం సాగుతున్నా అధికారుల కళ్లకు మాత్రం ఇవి ఎందుకు కనిపించవు?కానీ ముంబైలో ఓ అధికారి వచ్చాడు. ఫైళ్లలో దాక్కుని ఆదేశాలు ఇచ్చే అధికారి కాదు. ఏసీ కార్యాలయంలో కూర్చుని నివేదికలు చదివే అధికారి కాదు. వంటగదుల్లోకి వెళ్లాడు. దుకాణాల్లోకి వెళ్లాడు. ఆహార తయారీ కేంద్రాల్లోకి వెళ్లాడు. నిబంధనలు ఉల్లంఘించిన చోట కొరడా ఝళిపించాడు. భయం పుట్టించాడు. ఆ అధికారే తుకారాం ముండే ఐఏయస్. ఈయన ఏ శాఖలో ఉంటే ఆ శాఖ ప్రక్షాళన కావాల్సిందే.
మూడు నెలల్లో వేలాది తనిఖీలు. చిన్న హోటల్ అయినా, పెద్ద బ్రాండ్ అయినా ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం అయితే చర్య తప్పదనే సందేశం. ఇదే ఇప్పుడు దేశం మొత్తం ఆలోచించాల్సిన విషయం.తుకారాం ముండే ఒక్కరే ఎందుకు కనిపించాలి? దేశంలో మిగిలిన ప్రాంతాల్లో ఇలాంటి అధికారులు లేరా లేక పని చేయలేదా?ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి చట్టాలు ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు. తనిఖీ బృందాలు ఉన్నాయి. లైసెన్సింగ్ వ్యవస్థ ఉంది. ల్యాబొరేటరీలు ఉన్నాయి.అధికార యంత్రాంగం ఉంది. అయితే కల్తీ ఎందుకు ఉంది? ఇదే అసలు ప్రశ్న.
నిబంధనలు పుస్తకాలలో పుట్టి ఫైళ్లలో పెరిగి చివరకు చెత్తబుట్టలో పడిపోతే ప్రయోజనం ఏమిటి? తనిఖీలు కాగితాల మీద జరిగితే ప్రజల ఆరోగ్యానికి రక్షణ ఎక్కడ? ప్రభుత్వం ఇచ్చిన లైసెన్సు వ్యాపారం చేసుకోవడానికి హక్కు మాత్రమే ప్రజల ప్రాణాలతో ఆడుకోవడానికి లైసెన్సు కాదు. ఈ చిన్న నిజాన్ని అధికార యంత్రాంగం మరచిపోయినప్పుడు ముండే లాంటి అధికారులు అవసరం అవుతారు.ప్లేటులో విషం పెట్టేవాడికంటే చూసీ చూడనట్టు ఉండే అధికారులే ప్రమాదకరం!కల్తీ చేసే వ్యాపారి తన లాభం కోసం నేరం చేస్తాడు. కానీ ఆ కల్తీని గుర్తించాల్సిన అధికారి తన బాధ్యతను విస్మరిస్తే?అది ఒక్కరి తప్పు కాదు.వ్యవస్థ వైఫల్యం. ఒక హోటల్లో అపరిశుభ్రత ఉంది. అక్కడకు వెళ్లి తనిఖీ చేయాల్సిన అధికారి వెళ్లలేదు.వెళ్లినా చర్య తీసుకోలేదు.చర్య తీసుకున్నా నామమాత్రపు కేసు .కేసుకు శిక్ష పడలేదు.శిక్ష పడినా అమలు కాలేదు. ఇలా ప్రతి మెట్టుపై నిర్లక్ష్యం పెరిగితే కల్తీ వ్యాపారి ధైర్యం పెరుగుతుంది.ప్రజల భయం పెరుగుతుంది.
ప్రభుత్వంపై నమ్మకం తగ్గుతుంది. ఇది కేవలం ఆహార సమస్య కాదు. ఇది పాలనా నైతికతకు పరీక్ష.
పెద్ద బ్రాండ్కైనా చిన్న బండి వాడికైనా ఒకే చట్టం.
ముండే చర్యల్లో మరో ముఖ్యమైన సందేశం ఉంది. పెద్ద బ్రాండ్ పేరు చూసి వెనక్కి తగ్గకూడదు.చిన్న వ్యాపారి అని అతనిపై మాత్రమే పడి పోకూడదు. చట్టం ముందు బ్రాండ్ కాదు ఉల్లంఘన ముఖ్యం.ప్రజలకు అమ్మే ఆహారం సురక్షితమా కాదా అనేదే ప్రమాణం. కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న సంస్థ అయినా రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించే చిరు వ్యాపారి అయినా ప్రజల ఆరోగ్యంతో రాజీ పడితే చర్య తప్పకూడదు. అదే సమాన న్యాయం. అదే ప్రజా పరిపాలన. ముండే చేసినది , చేస్తున్నది అదే.మరి మిగిలిన రాష్ట్రాల్లో? ఏందుకు చురుగ్గా చేయడం లేదు? ఇదే ప్రశ్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు కర్ణాటక నుంచి తమిళనాడు వరకుదేశంలోని ప్రతి రాష్ట్రం తనను తాను అడగాల్సిన సమయం.
ముండే ముంబైలో ఉన్నాడని అక్కడి ప్రజలకే సురక్షితమైన ఆహారం దొరకాలా? దేశంలోని మిగిలిన ప్రజలకు?వారికి ఎవరు రక్షణ?ఒక నగరంలో అధికారి దూకుడుగా పనిచేస్తేనే హోటళ్లలో పరిశుభ్రత రావాలా? ఒక అధికారి సోషల్ మీడియాలో వైరల్ అ


