
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Telangana Autos Bandh: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో మరో వర్గం కూడా భారీ ఆందోళనకు సిద్ధమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం.. తమ జీవనాధారంపై పొట్టకొట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుండడంతో ఆటో కార్మికులకు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగనున్నారు. గతంలో పలమార్లు హెచ్చరించినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈసారి సమ్మె చేపట్టనున్నారు. దీంతో రేపు అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు బంద్ కానున్నాయి. హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లాల్లో ఆటోలు నిలిచిపోనున్నాయి.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న ఈ బంద్‌లో ఏడున్నర లక్షల ఆటోలు పాల్గొనున్నాయి. రోడ్డుపై ఒక్క ఆటో కూడా కనిపించదు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి నేరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఆటో కార్మికులు ఈ బంద్ చేపడుతున్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు పైన స్పష్టత ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీటర్ ఛార్జీలు పెంచాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఆర్ధిక సహాయం అందించకపోవడంతో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆటో కార్మికులు ఆందోళన చేపడుతున్నారు. వీరి ఆందోళనలకు స్కూల్ వాహనాల కార్మికులు కూడా తోడయ్యారు. ఆటో కార్మికులతోపాటు తాము బంద్‌లో పాల్గొంటామని స్కూల్ వ్యాన్ల యజమానులు ప్రకటించారు.
ఈసీఐఎల్‌లో ర్యాలీ తెలంగాణలో ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి నుంచి నిర్వహించనున్న ఆటో, స్కూల్ వ్యాన్ల బంద్ సందర్భంగా బీఆర్టియూ రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ కేబుల్ బ్రిడ్జి నుంచి మల్లాపూర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో దాదాపు 300 ఆటోలలో 500 మంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారయ్య మాట్లాడుతూ.. ఆటో మోటారు రవాణా కార్మికుల న్యాయమైన డిమాండ్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈవీ వాహనాలను ఆర్టీసీకి అనుసంధానం చేసి తమ పొట్ట కొడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు లేదని విమర్శించారు. అన్ని కులాలకు చెందినవారు నేడు ఆటో రవాణా రంగం మీద ఆధారపడి బతుకుతున్నారని తెలిపారు. రేపటి నుంచి చేపట్టనున్న సమ్మెకు ప్రభుత్వం దిగిరాక తప్పదని హెచ్చరించారు.
ఆటో డ్రైవర్ల బంద్‌కు కవిత మద్దతు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు ఈనెల 24వ తేదీ నుంచి చేపట్టిన బంద్‌కు మాజీ ఎమ్మెల్సీ కవిత సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆటో కార్మికుల బంద్‌కు తాము మద్దతునిస్తున్నట్ఉల తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ (టీఆర్టీయూ) సహా పలు ఆటో యూనియన్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ఆమెతో కలిసి ఆటో కార్మికులు బంద్ పోస్టర్ ఆవిష్కరించారు.





