
Rio De Janeiro Helicopter Crash In Dense Forest Kills Four People
బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. శనివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11:11 గంటలకు ఆల్టో డా బోవా విస్టాలోని విస్టా చినేసా ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. శనివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11:11 గంటలకు ఆల్టో డా బోవా విస్టాలోని విస్టా చినేసా ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్‌తో పాటు నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించినట్లు అగ్నిమాపక సిబ్బంది ధ్రువీకరించారు.ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయిన హెలికాప్టర్ శిథిలాలను గుర్తించారు. హెలికాప్టర్ కిందపడగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో, ప్రత్యేక బృందాలు వాటిని అదుపులోకి తెచ్చాయి. మృతుల్లో పైలట్‌తో పాటు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కొలంబియన్ మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.ఈ ఘటనపై రియో మేయర్ ఎడ్వర్డో కావలియర్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. నగరంలో హెలికాప్టర్ల రాకపోకలు విపరీతంగా పెరిగాయని, వాటి భద్రతను పర్యవేక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని బ్రెజిల్ నేషనల్ సివిల్ ఏవియేషన్ ఏజెన్సీ (ఏఎన్ఏసీ)ని కోరినట్లు వెల్లడించారు. ఈ విషయంలో ఏఎన్ఏసీకి తమ పూర్తి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.కాగా, రియోలో ఇటీవల కాలంలో ఇలాంటి ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌లో రెండు హెలికాప్టర్లు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మరణించారు. అలాగే గతేడాది సావో పాలో రాష్ట్రంలోని ఉబటుబాలో ఓ చిన్న విమానం కూలి పైలట్ మృతిచెందిన విషయం తెలిసిందే.





