
Rare Banded Krait Snake Spotted In Telanganas Warangal District 1549243
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో ఓ అరుదైన పాము కనిపించింది. బాండెడ్ క్రెయిట్గా గుర్తించిన అటవీ అధికారులు ఖానాపురం(వరంగల్): వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో ఓ అరుదైన పాము కనిపించింది.
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో ఓ అరుదైన పాము కనిపించింది.
బాండెడ్ క్రెయిట్గా గుర్తించిన అటవీ అధికారులు
ఖానాపురం(వరంగల్): వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో ఓ అరుదైన పాము కనిపించింది. స్థానికులు వెంటనే అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు దాన్ని చూసి బాండెడ్ క్రెయిట్ అనే పాముగా గుర్తించారు. పసుపు, నల్లని చారికలతో పొడవుగా ఉండే ఈ విషసర్పాలు చైనా, నేపాల్, థాయిలాండ్, కంబోడియా, వియత్నాం దేశాలతో పాటు భారతదేశంలో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఎక్కువగా ఉంటాయన్నారు.
తెలంగాణలో కనిపించడం చాలా అరుదని, ఇక్కడికి ఎలా వచ్చిందో తెలియడం లేదని అన్నారు. ఇవి ప్రధానంగా నీటి లభ్యత ఉండే ప్రాంతాల్లో ఉంటాయని, చీమల పుట్టలు, పొదల్లో నివసిస్తాయని తెలిపారు. అనంతరం దాన్ని తీసుకెళ్లి పాకాల అడవుల్లో వదిలేశారు.
మెట్రో ఫేజ్-1 రుణసేకరణ బాధ్యత ఎస్బీఐ క్యాప్స్‌దే
Read Latest AP News And Telangana News And International News And Telugu News





