
Police Rude Behaviour With Students During Polytechnic Protest In Mahabubabad Video Viral Pa 326542
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Police rude behaviour with Polytechnic students in mahabubabad: తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల స్కిల్ వర్సిటిలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనంకు సీఎం రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి స్కీమ్ , జీవో 97 తీసుకొచ్చారు.దీనిపై పెద్ద దుమారం రాజుకుంది. తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు నిరసనలకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఎక్కడి కక్కడ రోడ్లను బ్లాక్ చేశారు. ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేసి, జీవో ను ఉపసంహరించుకొవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ లో పాలిటెక్నిక్ విద్యార్థులు చేపట్టిన నిరసనలు కాస్త పీక్స్ కు చేరాయి.
ఈ క్రమంలో మహాబూబాబాద్ లో జిల్లా కలెక్టర్ కార్యాలయం పాలిటెక్నిక్ విద్యార్థులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రభుత్వంకు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థుల్ని చెదరగొట్టే ప్రయత్నాలు చేశారు.
ఈ నేపథ్యంలో సీఐ రఘుపతి రెడ్డి ఇద్దరు విద్యార్థుల పీకను పట్టుకుని దూరంగా తోసేయడం రచ్చగా మారింది. దీంతో అక్కడున్న స్టూడెంట్స్ మరింత రెచ్చిపోయారు. విద్యార్థుల పట్ల సీఐ దురుసుగా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేస్తున్న స్థానికులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read more: Konda Susmita Patel: సీఎం అవ్వగానే కళ్లు నెత్తికెక్కాయా..?.. రేవంత్ రెడ్డిపై కొండా సుష్మిత సెన్సెషనల్ కామెంట్స్..
అసలు.. మీరు పోలీసులా? లేక గూండాలా?.. అంటూ ఫైర్ అయ్యారు.ఈ ఘటనకు చెందిన వీడియో నెట్టింట వైరల్ గామారింది. దీనిపై నెటిజన్లు.. విద్యార్థుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది?.. అంటూ సదరు సీఐ తీరుపై నెట్టింట్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.




