
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Petrol Diesel Price Today: అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొంతమేర శాంతించడం, హార్ముజ్ జలసంధి తెరుచుకుంటుందనే ఆశలు బలపడటంతో చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. అయితే అంతర్జాతీయంగా ధరలు తగ్గుతున్నప్పటికీ, దేశీయంగా మాత్రం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పతనం.. గత కొన్ని వారాలుగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర సుమారు 13 శాతానికి పైగా పడిపోయింది. ఆగస్టు 7 నాటికి ముగిసిన వారంలో ఇది బ్యారెల్‌కు 83.55 డాలర్ల వద్ద సెటిల్ అయింది. డబ్ల్యూటీఐ క్రూడ్ కూడా 78.18 డాలర్ల వద్ద ముగిసింది. వారమంతా చూస్తే ఇది సుమారు 7.7 శాతం వరకు క్షీణించింది.
ఇరాన్-ఒమన్ మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉండటం, హార్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు సజావుగా సాగుతాయనే అంచనాలే ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
భారత్‌లో పెట్రోల్, డీజిల్ ప్రస్తుత ధరలు.. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ.. దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) గత కొన్ని నెలలుగా ధరలను సవరించలేదు. మే 25 తర్వాత దేశంలో ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో తాజా ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర రూ.115.69 ఉండగా, డీజిల్ ధర రూ. 103.82గా ఉంది. (XP95 పెట్రోల్ రూ. 125.17)
విజయవాడ: లీటర్ పెట్రోల్ ధర రూ. 117.25 కాగా, డీజిల్ ధర రూ. 104.96 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నం: లీటర్ పెట్రోల్ ధర రూ. 116.39, డీజిల్ ధర రూ. 104.11గా ఉంది.
భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు దేశంగా ఉంది. అంతర్జాతీయంగా ధరలు తగ్గుతున్న తరుణంలో దేశీయంగానూ ఇంధన ధరలను తగ్గించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నప్పటికీ, ఆయిల్ కంపెనీలు ప్రస్తుతానికి ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. భవిష్యత్తులోనూ పశ్చిమాసియా పరిణామాలు, యుద్ధ ఉద్రిక్తతలపైనే చమురు ధరల మనుగడ ఆధారపడి ఉంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.