
సీతానగరం: పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం బూర్జ గ్రామ పరిసరాల్లో అడవి ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత కొద్ది రోజులుగా బొబ్బిలి పరిసరాల్లో సంచరించిన ఏనుగులు సోమవారం బూర్జ గ్రామ పరిసరాలకు చేరుకున్నాయి. కుంకీలు సహాయంతో గుచ్చిమి రిజర్వ్ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఏనుగుల సంరక్షణ కేంద్రానికి తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రెండు రోజుల క్రితం కుంకీలను అడవి ఏనుగుల గుంపు సంచరించే ప్రాంతానికి తరలించారు. వాటి సహాయంతో కేంద్రానికి సమీప ప్రాంతానికి తీసుకువచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



