
మాచవరం : వైకాపా నేత బొంత గురవయ్యతోపాటు మరో నలుగురిపై ఈ నెల 6వ తేదీన స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. దర్యాప్తులో భాగంగా వారందరిని శుక్రవారం స్టేషన్కు పిలిపించి 41 నోటీసు అందజేసి, ఇంటికి పంపించారు. స్థానిక పోలీసులు వారిని ఎటువంటి వేధింపులకు గురి చేయలేదని గురజాల డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. వచ్చే నెల 9న లోక్ అదాలత్ ఉండటంతో గతంలో నమోదైన ఒక కేసుకు సంబంధించి రాజీ చేసుకోవాలని సలహా ఇచ్చారన్నారు. అంతేగాని ఎలాంటి ఒత్తిళ్లు, ఇబ్బందులకు గురి చేయలేదని చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే వారు స్థానిక ఎస్సై, పోలీసులపై ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




