
పొదలకూరు: పొదలకూరు గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవానికి మంగళవారం శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో మూడు రోజులపాటు జాతర నిర్వహించనున్నారు. కార్యక్రమంలో భాగంగా మంగళవారం గ్రామ పెద్దలు, ఆలయ నిర్వాహకులు, భక్తులు సంప్రదాయబద్ధంగా తొలి చద్ది కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా పోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి పట్టు వస్త్రాలు, పూలు, పండ్లు సమర్పించారు. అనంతరం నైవేద్యాలు సమర్పించి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. తొలి చద్ది కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





