
Mark Zuckerberg Says Ai Will Create More Jobs In The Future Sgr 1549584
కృత్రిమ మేధస్సు కారణంగా భారీగా ఉద్యోగాలు కనుమరుగవుతాయన్న ఆందోళనల మధ్య మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ కారణంగా కంపెనీల పరిమాణం తగ్గినప్పటికీ, మొత్తంగా ఉద్యోగాల సంఖ్య తగ్గదని అన్నారు.
కృత్రిమ మేధస్సు కారణంగా భారీగా ఉద్యోగాలు కనుమరుగవుతాయన్న ఆందోళనల మధ్య మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ కారణంగా కంపెనీల పరిమాణం తగ్గినప్పటికీ, మొత్తంగా ఉద్యోగాల సంఖ్య తగ్గదని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కృత్రిమ మేధస్సు (AI) కారణంగా భారీగా ఉద్యోగాలు కనుమరుగవుతాయన్న ఆందోళనల మధ్య మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ కారణంగా కంపెనీల పరిమాణం తగ్గినప్పటికీ, మొత్తంగా ఉద్యోగాల సంఖ్య తగ్గదని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. జుకర్‌బర్గ్ ఆగస్టు 10న మెటా వెబ్సైట్లో ఒక వ్యాసాన్ని పోస్ట్ చేశారు (Mark Zuckerberg AI Jobs).
ఆ వ్యాసంలో ఏఐ భవిష్యత్తు, ఉద్యోగాలు, వ్యాపారాలపై జుకర్‌బర్గ్ తన అభిప్రాయాలను వెల్లడించారు. ఏఐ మానవుల ప్రాధాన్యతను పూర్తిగా తొలగిస్తుందని భావించడం సరైనది కాదని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో కంపెనీల పరిమాణం తగ్గే అవకాశం ఉందని జుకర్‌బర్గ్ అన్నారు. అయితే దాని అర్థం ఉద్యోగాలు తగ్గిపోవడం కాదని స్పష్టం చేశారు. తక్కువ మంది ఉద్యోగులతో పనిచేసే మరిన్ని చిన్న కంపెనీలు ఏర్పడొచ్చన్నారు. అవి ఏఐ సహాయంతో పెద్ద సంస్థల స్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించారు.
చిన్న వ్యాపారాల అభివృద్ధికి ఏఐ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. చిన్న వ్యాపారాలు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా కొనసాగుతాయని, ఏఐ కారణంగా ఒక్కో చిన్న సంస్థ ప్రభావం మరింత పెరుగుతుందని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ప్రతిసారీ కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయని జుకర్‌బర్గ్ గుర్తుచేశారు. ఒక తరం క్రితం యాప్ డెవలపర్లు, సామాజిక మాధ్యమ కంటెంట్ సృష్టికర్తలు, విద్యుత్ వాహన సాంకేతిక నిపుణులు, డేటా సెంటర్ ఉద్యోగాలు ఇంతగా ఉండేవి కావని పేర్కొన్నారు (AI Future Jobs).
ఏఐ విస్తరణతో ప్రస్తుతం ఊహించలేని కొత్త రకాల ఉద్యోగాలు కూడా పుట్టుకొస్తాయని ఆయన అన్నారు (AI and Employment). ఏఐ ప్రధానంగా ఆటోమేషన్ సాధనంగా కాకుండా కొత్త ఆవిష్కరణలకు ఉపయోగపడే సాధనంగా మారొచ్చని జుకర్‌బర్గ్ అభిప్రాయపడ్డారు. ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాల స్వరూపం తప్పకుండా మారుతుందని, అయితే ఆ మార్పు మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగాల కొరతకు దారితీయకపోవచ్చని పేర్కొన్నారు.
మావోయిస్టు క్యాంప్ నుంచి మోడలింగ్ ర్యాంప్ వరకు.. మారిన మాజీ మహిళా నక్సల్స్ జీవితాలు..
మీరు చేయలేకపోతే మేమే చేస్తాం.. లేబుల్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు హెచ్చరిక..
Found this helpful?
Share this story with your network







