
Key Decisions From The First Meeting Of The Ytd Governing Council 2483405
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 14 : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పాలక మండలి తొలి సమావేశం శుక్రవారం నిర్వహించారు.
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 14 : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పాలక మండలి తొలి సమావేశం శుక్రవారం నిర్వహించారు. చైర్మన్ సత్యనారాయణతో పాటు పాలక మండలి సభ్యులు తొలి సమావేశంలో పలు అంశాలకు ఆమోదం తెలుపుతూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివరాలను ఆలయ పాలక మండలి చైర్మన్ సత్యనారాయణ మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు.
– రూ.43.12 కోట్లతో కొండపైన దీక్షపరుల మండప నిర్మాణం – రూ.9.87 కోట్లతో కొండపైన బాలాలయ ప్రదేశంలో నిత్య కళ్యాణ మండపం నిర్మాణం – రాయగిరి వద్ద పాలక మండలి చైర్మన్ సత్యనారాయణ దాతగా స్వామి వారి ఆర్చి నిర్మాణం – నూతనంగా ఆధునికరణతో వేద పాఠశాల నిర్మాణం – నూతనంగా దీక్ష పరుల మండపం, నిత్య కల్యాణ మండపం, రాయిగిరి దగ్గర ఆర్చి (Sponcered by MSN ), వేద పాఠశాల నిర్మాణం – కొండ క్రింద అన్న ప్రసాదం శాలలో భక్తులు భోజనం చేసే సంఖ్యను 1,500 నుండి 2 వేలకు పెంపు – లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో టీసీఎస్ కంపెనీ సహకారంతో దేవాలయంలో సాంకేతిక విధానం అన్ని రకాల సేవలకు అనుసంధానం చేయడం – యాదగిరిగుట్ట దేవస్థానం ప్రత్యేక కమిటీలు.. కమిటీల్లో ఒక్కొక్క పాలక సభ్యుడి నియమించడం – కొండ క్రింద దేవస్థానం గదుల విచారణ వద్ద భక్తుల కోసం మరొక కల్యాణకట్ట ఏర్పాటు – రూ.84 లక్షలతో కొణిదల సురేఖ చిరంజీవి దాతగా నిర్మించనున్న ఎలక్ట్రిక్ శంకు చక్ర నామాలు బోర్డు ఏర్పాటు – కొండ కింద గిరి ప్రదక్షణ దారి ప్రక్కన ఖాళీ ప్రదేశంలో సోలార్ సిస్టమ్ యోచన – రూ.1.4 కోట్లతో మెట్ల మార్గంలో పై కప్పు నిర్మాణం – స్వామివారికి దాతలు ఇచ్చే విరాళాల కోసం ప్రత్యేక గది నిర్మాణం కోసం కొండపైన స్థలం పరిశీలన






