
తిరుపతి (తితిదే): తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద ఎస్ఎస్డీ టోకెన్ల జారీని బుధవారం నిలిపేయనున్నట్లు తితిదే మంగళవారం ప్రకటించింది. గురువారం దర్శనానికి సంబంధించి బుధవారం జారీ చేయనున్న టోకెన్లు ఇవ్వరని.. భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుని సర్వదర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. శుక్రవారం దర్శనానికి సంబంధించి గురువారం మధ్యాహ్నం టోకెన్లు జారీ చేస్తారని తెలిపింది. భక్తులు గమనించి సహకరించాలని కోరారు.
అయితే టోకెన్ల జారీ నిలిపివేతపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా వచ్చిన వారికి వచ్చినట్లు సర్వదర్శనం చేయించే ఆలోచనతో తితిదే ఈ విధానాన్ని గత ఆరు నెలల్లో 7 వారాల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. టోకెన్ల జారీ చేయకపోవడంతో దూర ప్రాంత భక్తులకు అవస్థలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి మంగళవారం ఉదయం ఆరు గంటలకే పది వేల ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేశారు. వీరికి బుధవారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం కానుంది. అదేవిధంగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు 2 వేల టోకెన్లు జారీ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
చచ్చిపోయిన కోళ్ల కోసం జనం ఎగబడిన ఘటన తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలంలో చోటుచేసుకుంది.
ఎప్పుడూ నీలిరంగులో కళకళలాడే కృష్ణమ్మ ప్రస్తుతం గోదావరి జలాలతో ఎరుపెక్కింది.