
iPhone 18 Pro Series Launch: త్వరలోనే ఐఫోన్ 18 ప్రో సిరీస్ విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంగా కెమెరాల్లో అనేక మార్పులు చేర్పులు చేసిన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
iPhone 18 Pro Series Launch: యాపిల్ లవర్స్ ఐఫోన్ 18 ప్రో సిరీస్ ఎప్పుడు విడుదలవుతుందని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ఆ మ్యాజికల్ మూమెంట్ రానే వచ్చింది.. యాపిల్ తమ కొత్త సిరీస్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది దిమ్మతిరిగే డిజైన్‌తో లాంచ్ కానుండడం విశేషం.. ఇది 3 మైండ్ బ్లోయింగ్ కెమెరా అప్‌గ్రేడ్స్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, దానికి సంబంధించిన ఫీచర్స్, ఇతర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro) సిరీస్ గ్రాండ్‌గా త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ దీనిని సెప్టెంబర్ రెండవ వారంలో విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు బ్లూమ్‌బెర్గ్ వర్గాలు తెలిపాయి.. ఇందులో కంపెనీ ప్రొఫెషనల్ కెమెరాలకే సవాల్ విసిరేలా ఊహించని కెమెరా ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది.
ఇందులో కంపెనీ చాలా అద్భుతమైన వేరియబుల్ అపెర్చర్ (Variable Aperture) ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు ప్రొఫెషనల్ DSLR కెమెరాలకే పరిమితమైన వేరియబుల్ అపెర్చర్ ఫీచర్ ఇప్పుడు తొలిసారిగా ఐఫోన్ 18 ప్రో మెయిన్ కెమెరాలో అందుబాటులోకి రావడం విశేషం.. ఇది చీకటిలో (Low-Light) కూడా అద్భుతమైన ఫోటోలను అందిస్తుంది.
ఇక టెలిఫోటో కెమెరాలో కూడా ఊహించని మార్పులు తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. కేవలం మెయిన్ కెమెరా మాత్రమే కాదు.. టెలిఫోటో కెమెరాను సైతం యాపిల్ ఊహించని రీతిలో అప్‌గ్రేడ్ చేసిన్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. Wide Aperture వాడటం వల్ల లెన్స్ లోపలికి అత్యధిక వెలుతురు వెళ్లి, నైట్ మోడ్ షాట్స్, జూమింగ్ ఫొటోలు చాలా బాగా వస్తాయి.
హార్డ్‌వేర్‌లోనే కాకుండా సాఫ్ట్‌వేర్‌లో కూడా యాపిల్ అనేక మార్పులు చేర్పులు చేసిన్నట్లు తెలుస్తోంది.. యూజర్లకు కెమెరాపై పూర్తి కస్టమ్ కంట్రోల్స్ ఇచ్చేలా ప్రత్యేకమైన ప్రో యాప్స్, అడ్వాన్స్డ్ మ్యాన్యువల్ కంట్రోల్స్, AI ఫీచర్స్‌ను కూడా ఇందులో అందుబాటులోకి తీసుకు రావడం విశేషం..
ఈ పవర్ఫుల్ కెమెరా సెన్సార్ల కారణంగా ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్ల వెనుక ఉండే కెమెరా బంప్ విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. అంటే కెమెరా చూడటానికి మరింత రాయల్‌గా, పవర్‌ఫుల్‌గా కనిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..



