పల్లవి ఇచ్చిన స్ట్రోక్‌కి పార్వతికి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. దెబ్బకి వెళ్లి హాస్పిటల్ బెడ్‌పై పడుతుంది. దారుణం ఏమంటే.. హాస్పిటల్లో ఆమె దగ్గర సహాయకురాలిగా పల్లవే ఉంటుంది. ఎప్పుడెప్పుడు కళ్లు తెరుస్తుందా? ఎప్పుడెప్పుడు పీక పిసికిచంపేద్దామ్మా అన్నంత కసిగా ఎదురుచూస్తుంటుంది పల్లవి. ఇక ఈరోజు (సెప్టెంబర్ 01) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. చావు నుంచి తప్పించుకుని పార్వతి కళ్లు తెరుస్తుంది. ఎదురుగా పల్లవి ఉండేసరికి.. ఆమె గుండె గుప్పెట్లోకి వచ్చేసినంత పని అవుతుంది. ‘ఏంటి అత్తయ్యా అలా చూస్తున్నావ్.. ఇప్పుడు ఎలా ఉంది’ అని చాలా కూల్‌గా అడుగుతుంది పల్లవి. ప.. ప.. ప అని బిత్తరచూపులు చూస్తుంటుంది పార్వతి. దాంతో పల్లవి.. ‘మీకు హార్ట్ ఎటాక్ వచ్చింది నా గురించేనని నాకు అర్థమైంది.. అందుకే ఇంత టెన్షన్ పడుతున్నావ్ అని నాకు తెలుసు. నా గురించి నిజం తెలిసిన వెంటనే.. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అవనికి చెప్పేద్దాం అని అనుకున్నావ్ కదా.. మీరు అవనికి చెప్పేసి ఉంటే.. నన్ను ఫుట్‌బాల్ ఆడుకునేది. నా జీవితం రోడ్డున పడేది. మీ కొడుకు కమల్ నన్ను చంపేసి ఉండేవాడు.కాళ్లు పట్టుకోను.. పీక పట్టుకుంటా.. నేను అదృష్టవంతురాల్ని కాబట్టి అలా జరగలేదు. మీరు దురదృష్టవంతురాలు కాబట్టి హార్ట్ ఎటాక్ వచ్చింది. మీది విశాల హృదయం కాబట్టి.. ఇన్నాళ్లూ క్షమిస్తూ వచ్చారు. నేను మామయ్యని చంపాలనుకున్నది మొదలు.. చంటి బిడ్డని కిడ్నాప్ చేయించడం వరకూ.. అన్నీ మీకు తెలిసిపోయాయి కాబట్టి.. మీరు నన్ను క్షమించరని నాకు తెలుసు. క్షమించరు కాబట్టి.. మీ కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడలేను. కాబట్టి పీక పట్టుకుంటున్నా అంటూ టకీ మని పార్వతి పీకపట్టేస్తుంది పల్లవి. నా గురించి మీకు తెలిసిన నిజాలను ఎవరికీ చెప్పకుండా ఉంటే.. మీరు హ్యాపీగా ఉంటారు.. మీ ఫ్యామిలీ కూడా సేఫ్‌గా ఉంటుంది.. లేదంటే ఎవ్వర్నీ వదిలను చంపేస్తా. తేడా వచ్చిందో ఫొటోకి దండపడిపోద్ది జాగ్రత్త.. మళ్లీ కోమా అన్నింటికీ తెగించిన నాలాంటి దాన్ని కెలికితే.. స్కూల్‌కి వెళ్లే ఆరాధ్య మళ్లీ ఇంటికి తిరిగి రాదు. శ్రియ కొడుకు మట్టిలో కలిసిపోతాడు. అవని గ్యాస్ స్టౌవ్ పేలి చావచ్చు. ఆఫీస్ నుంచి వస్తున్న మీ పెద్ద కొడుకు యాక్సిడెంట్లో పోవచ్చు. నాకు తిక్కరేగితే ఎవరి ఫొటోకైనా దండపడిపోవచ్చు. ఇప్పటికే నేను ఎలాంటి దాన్నో నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇప్పుడు కూడా నిజం చెప్పాలనుకుంటున్నారా అత్తయ్యా.. చెప్తే ఏమౌతుందో నీకు బాగా తెలుసుగా’ అని భయపెట్టేస్తుంది పల్లవి. దాంతో మళ్లీ బీపీ రేస్ అయ్యి.. మళ్లీ కోమాలోకి పోయినంత పని చేస్తుంది పార్వతి. నీకు నీ వాళ్లతోనే సరిపోతుందిగా.. ఇక ఓ పక్క పార్వతి చావు బతుకుల మధ్య ఉంటే.. అత్తయ్యని పుణ్యక్షేత్రాలకు తీసుకుని వెళ్దాం అంటూ అక్షయ్ దగ్గర కూర్చుని అవని ముచ్చట్లు పెడుతుంది. మనోడికి మండిపోతుంటుంది ఆమె మాటలు చూసి. మీకు రావడం కుదరకపోతే.. అత్తయ్య, బామ్మని నేను తీసుకుని వెళ్తా.. అని అంటుంది అవని. అయితే అక్షయ్ మాత్రం ఏం మాట్లాడడు.. అలిగి కూర్చొంటాడు. అత్తయ్యని నేను జాగ్రత్తగా చూసుకుంటున్నా.. ఆమె బయటకు వెళ్తున్నట్టు కూడా నాకు చెప్పలేదు. ఇలా ఎందుకు అయ్యిందో అర్థం కావడం లేదు అని అంటుంది అవని. దాంతో అక్షయ్.. ‘ఇంతకు ముందు నువ్వు అందరి గురించి పట్టించుకునేదానివి.. ఇప్పుడు కొందరిపై శ్రద్ధ చూపిస్తున్నావ్.. నీ ప్రయారిటీ మారిపోయాయిలే’ అని అంటాడు అక్షయ్. నీ చెల్లెలు పల్లవి గురించే కదా ఇదంతా చేస్తున్నావ్.. ఆ మాటతో అవని.. ‘నాకు అందరూ సమానమే.. నాకు ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అని ఉండదు అని అంటుంది. ఆ మాటతో అక్షయ్.. ‘నీ టైమ్ అంతా.. నీ చెల్లెలు పల్లవి గురించి.. ఆమె కష్టాలను తీర్చడానికే సరిపోతుంది.. ఇంక కుటుంబాన్ని ఏం పట్టించుకుంటావ్’ అని మనసులో అనుకుంటాడు. చూడు పల్లవీ.. అమ్మ అంతలా టెన్షన్ పడటానికి కారణం ఏంటో కనుక్కో’ అని చెప్పేసి వెళ్లిపోతాడు అక్షయ్. ఇక అవని.. రంగంలోకి దిగుతుంది. అత్తయ్య గారు టెన్షన్ పడటానికి కారణం బయటకు వెళ్లినప్పుడే జరిగింది.. అదేంటో అర్జెంట్‌గా తెలుసుకోవాలి’ అని అంటుంది అవని. ఆ కారణం ఏమై ఉంటుందంటే.. ఇక అవని, శ్రీకర్, అక్షయ్, కమల్‌లు కారులో హాస్పిటల్‌కి వెళ్తూ.. పార్వతికి అలా అవ్వడానికి కారణం ఏమై ఉంటుంది అన్నదానిపై చర్చ మొదలుపెడతారు. నిన్నటి వరకూ బాగానే ఉన్న అత్తయ్య సడెన్‌గా అలా అయ్యిందంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. మనకెవ్వరికీ తెలియని కారణం అత్తయ్యకి తెలిసి ఉంటుందని నాకు అనుమానంగా ఉంది.. ముందు అత్తయ్య కోలుకుని బయటకు వస్తే.. తరువాత కారణం ఏంటో కనుక్కోవచ్చు’ అని అంటుంది అవని. ఇక హాస్పిటల్లో పల్లవి.. పార్వతికి సేవలు చేస్తున్నట్టుగా తెగ నటించేస్తుంది. అది చూసి కమల్.. నా పెళ్లం ఎంత మారిపోయిందో అని అనుకుంటాడు. ఇంటికి వెళ్లు అని కమల్ చెప్పినా కూడా.. అత్తయ్య తరువాతే నాకు ఏదైనా నేను ఇక్కడే ఉంటానని తెగ నటించేస్తుంది పల్లవి. ఇక ఇంటికి వచ్చిన తరువాత కూడా పార్వతికి రక్త కన్నీరు చూపిస్తుంది పల్లవి. అదేంటో తరువాతి ఎపిసోడ్లో చూద్దాం.




