
ఆ జంటలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటై ఏళ్లు గడిచాయి. అందరికీ పిల్లలున్నారు. అయినా కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయంలో తమ జీవిత భాగస్వాములనే మళ్లీ వివాహం చేసుకున్నారు. మొత్తం తొమ్మిది జంటలు ముచ్చటగా చేసుకున్న ఈ వేడుక అందరికీ ఆసక్తి కలిగించింది. తమది విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం కొండకర్ల, ఆనందపురం ప్రాంతాలని వారు తెలిపారు. పలు విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఓ సిద్ధాంతి సూచనతో మళ్లీ వివాహం చేసుకున్నామన్నారు. ఈ వార్త చదివారా: గోమాతకు గాయం.. చివుక్కుమంది ప్రాణం
S
Written by Skyc Media Editorial
checkSenior Editorial Lead • Skyc Media
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Skyc Media.




