
ఇండోనేషియాలోని బోర్నియో ద్వీపం సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌక మునిగిపోయింది. ఆ నౌకలో సుమారు 240 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈస్ట్ జావా నుంచి దక్షిణ కాలిమంటన్ వైపు వెళ్తున్న సమయంలో జావా సముద్రంలో ఆ నౌకతో అకస్మాత్తుగా సంబంధాలు తెగిపోయాయి. సముద్రంలో వాతావరణం ప్రతికూలంగా ఉండటంతోనే నౌక గల్లంతయ్యిందని తెలుస్తోంది. ప్రస్తుతం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.






