
కాటేదాన్: రౌడీషీటర్ దారుణ హత్యకు గురైన ఘటన మైలార్ దేవుపల్లి ఠాణా పరిధిలో బుధవారం జరిగింది. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కథనం ప్రకారం... పాతబస్తీ అలినగర్కి చెందిన ఖాజీ సోహెల్(28) ఓ రౌడీ షీటర్. బుధవారం తెల్లవారుజామున పాత కర్నూలు రహదారి మైలార్ దేవులపల్లి పల్లె చెరువు వ్యాపార కూడలి వద్ద గుర్తుతెలియని ముగ్గురు దుండగులు అతడ్ని ద్విచక్రవాహనంపై తీసుకొచ్చారు. మద్యం మత్తులో ఉన్న సోహెల్పై 17 సార్లు కత్తితో పొడిచి దాడి చేశారు. దీంతో సోహెల్ అక్కడిక్కడే మృతి చెందాడు. నిందితులు ఎవరా ఆన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


