
తుని: కాకినాడ జిల్లా తునిలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తునిలోని డీమార్ట్ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన తుని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రైవేటు బస్సు ఒడిశా నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

