
ముమ్మిడివరం: మండలంలోని అనాథవరం గ్రామ సెంటర్లోని వాటర్ ప్లాంట్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పీజీ వైద్య విద్యార్థి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరుకు చెందిన అల్లం జయసూర్య (30) అమలాపురం కిమ్స్ మెడికల్ కాలేజీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున ఆయన కారులో అమలాపురం నుంచి కాకినాడ వైపు బయలుదేరాడు. ఈ క్రమంలో అనాతవరం గ్రామ సెంటర్ వద్దకు వచ్చేసరికి కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన జయసూర్యను స్థానికులు వెంటనే అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. ఘటనపై ముమ్మిడివరం ఎస్సై శివకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





