
Cricketer Abishek Porel Arrested Over Assault Allegations In Bengal Sh 1120959
Abishek Porel Arrest : లైంగి వేధింపుల కేసులో ఢిల్లీ క్యాపిటల్స్ యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ అభిషేక్ పోరెల్ అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటన కోల్‌కతాలో సంచలనం రేపుతోంది.
Abishek Porel Arrest : లైంగి వేధింపుల కేసులో ఢిల్లీ క్యాపిటల్స్ యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ అభిషేక్ పోరెల్ అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటన కోల్‌కతాలో సంచలనం రేపుతోంది. ఓ మెడికల్ విద్యార్థిని ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోరెల్‌ను అదుపులోకి తీసుకున్నారు. లైంగిక వేధింపులు, మోసం, దాడి సహా పలు తీవ్రమైన ఆరోపణలు అతడిపై నమోదయ్యాయి.
బాధితురాలి ఆరోపణల ప్రకారం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అభిషేక్ పోరెల్ తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, అనంతరం తనపై భౌతికంగా దాడి చేశాడని పేర్కొంది. అంతేకాదు.. తన వ్యక్తిగత చిత్రాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించి, అలాగే మానసికంగా వేధించాడని కూడా ఆరోపించింది.
Read Also : Apply Pay UPI : అక్టోబర్‌లో భారత్‌కు ఆపిల్ పే సర్వీసు.. నో UPI సపోర్ట్.. ఐఫోన్ యూజర్లకు బెనిఫిట్ ఏంటి?
ఈ వ్యవహారంపై ఆమె మొదట పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత తనకు న్యాయం జరగలేదని భావించి ఉన్నతాధికారులు, ఆపై కలకత్తా హైకోర్టును కూడా ఆశ్రయించింది.
బాధితురాలి పిటిషన్‌పై విచారణ జరిపిన కలకత్తా హైకోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు అభిషేక్ పోరెల్‌పై 19 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో పలు తీవ్రమైన, నాన్-బెయిలబుల్ సెక్షన్లు ఉన్నట్లు సమాచారం. కోర్టు ఆదేశాల నేపథ్యంలో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు.
అయితే, తనపై వచ్చిన ఆరోపణలను అభిషేక్ పోరెల్ పూర్తిగా ఖండించాడు. అతడి తరఫు న్యాయవాది కూడా తమ క్లయింట్ నిర్దోషి అని, కావాలనే ఒత్తిడి తెచ్చేందుకు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. మైదానంలో ప్రతిభతో గుర్తింపు తెచ్చుకున్న యువ క్రికెటర్ పేరు ఇలాంటి వివాదంలో వినిపించడం క్రీడాభిమానుల్లో చర్చకు దారితీసింది.






