
పూతలపట్టు: ఆన్లైన్ గేమ్స్ ఆడుతుండడంతో అడ్డుచెప్పినందుకు ఆగ్రహంతో ఓ వ్యక్తి మామను కొట్టి చంపాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పేట అగ్రహారంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని ఓ కాలనీకి చెందిన అశోక్ (35) ఆన్లైన్లో తరచూ వీడియో గేమ్‌లు ఆడేవాడు. దీంతో మామ సుబ్రహ్మణ్యం (65) మందలించారు. ఆగ్రహానికి గురైన అశోక్.. ఒక్కసారిగా మామపై పిడిగుద్దులతో దాడి చేశాడు. ఆ దెబ్బలకు తాళలేక సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలింపు చేపట్టినట్లు సీఐ తిమ్మయ్య తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





