
Chikmagalur Budget Trip Bengaluru To Chikmagalur Here Are 20 Places You Must Visit This Season 502521
ప్రస్తుతం మాన్సూన్ సీజన్ కొనసాగుతోంది. ఈ కాలంలో ఏదైనా టూర్ కు వెళ్లాలని అనిపిస్తుంది. వర్షాకాలంలో రద్దీగా ఉండే ప్రాంతాలు కాకుండా ప్రశాంతంగా ఉండే ప్రకృతి రమణీయమైన ప్రాంతాలకు వెళ్లాలని చాలామంది కోరుకుంటారు. అయితే చాలా మంది
ప్రస్తుతం మాన్సూన్ సీజన్ కొనసాగుతోంది. ఈ కాలంలో ఏదైనా టూర్ కు వెళ్లాలని అనిపిస్తుంది. వర్షాకాలంలో రద్దీగా ఉండే ప్రాంతాలు కాకుండా ప్రశాంతంగా ఉండే ప్రకృతి రమణీయమైన ప్రాంతాలకు వెళ్లాలని చాలామంది కోరుకుంటారు. అయితే చాలా మందికి బెస్ట్ ఛాయిస్ గా బెంగళూరు టూ చిగ్ మగళూరు ఉంది. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం సుమారు 250 కిలోమీటర్లు ఉంటుంది. వర్షాకాలం సీజన్ లో అంటే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఈ ప్రాంతంలో ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. పచ్చని కాఫీ తోటలు, జలపాతాలు చూసేందుకు ఇదే సరైన సమయం. అందుకే ఇటీవలి కాలంలో చాలామంది చిక్ మగళూరు ట్రిప్ కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎన్ హెచ్ 75 గుండా హాసన్, బేలూర్ మీదుగా చిక్ మగళూరుకు చేరుకోవచ్చు. ఇక్కడకు ప్రయాణ సమయం సుమారు 5.5 గంటల నుంచి 6.5 గంటలుగా ఉంది.ఇక బెంగళూరు సిటీ నుంచి KSRTC అలాగే ప్రైవేట్ ట్రావెల్ బస్సులు నిత్యం అందుబాటులో ఉంటాయి. అయితే చిక్ మగళూరు నగరానికి నేరుగా రైలు మార్గం లేదు. కదూర్ వరకు రైలు ప్రయాణం చేయాలి. అక్కడి నుంచి ట్యాక్సీ లేదా బస్సు ద్వారా 40 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇక వర్షాకాలంలో ఇక్కడ చూడదగిన ప్రదేశాల వివరాలు చూస్తే.. హెబ్బే వాటర్ ఫాల్స్, దేవరమనే, ఝారీ ఫాల్స్, రాణి ఝారీ వ్యూ పాయింట్, క్యాతనమక్కి వ్యూ పాయింట్, కెలగూర్ టీ ఎస్టేట్స్, మైదాడి హిల్స్, కల్లతిగిరి ఫాల్స్, బాబా బుడాంగిరి హిల్స్ ఉన్నాయి.అలాగే ఈ పర్యాటక ప్రాంతాలతో పాటు హిరెకోలలే లేక్, ముల్లాయనగిరి పర్వతం, సామ్ సే టీ ఎస్టేట్, హొన్నమహల్లా హిల్స్, దేవిరమ్మ ఆలయం, హొరనాడు శ్రీ అన్నపూర్ణేశ్వరీ ఆలయం, కలాస కాలేశ్వర- కాలభైరవేశ్వరాలయం, బేలూర్ చెన్నకేశవ స్వామి ఆలయం, హలేబిడూ హోయసలేశ్వరా ఆలయం, వీరనారాయణ స్వామి దేవస్థానం, కెమ్మనగుండి జెడ్ పాయింట్, సూర్ మన్నే ఫాల్స్, కుద్రేముఖ్ నేషనల్ పార్క్ తదితర ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. ఈ సీజన్ లో ఈ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తే మరచిపోలేని అనుభూతి కలుగుతుంది. తెలుగు రాష్ట్రాల టూరిస్టులు ముందుగా బెంగళూరుకు చేరుకుని అక్కడి నుంచి చిక్ మగళూరు టూర్ కు వెళ్లవచ్చు.






