బిగ్ బాస్ స్టేజ్ మీద ఎవరు ఎంత వర్త్.. ఎవరికి ఎంత స్పేస్ ఉంటుంది.. అని చెప్పాలి.. 15, 30, 45, 60 సెకన్లు అంటూ విభజించిన ఈ నాలుగు కేటగిరీల్లోంచి ఏదో ఒక బ్యాడ్జ్ మెడలో వేయాలని టాస్క్ ఇచ్చారు. ఈ క్రమంలో షాలిని, రామకృష్ణ, అపూర్వ, రాజ కుమారి, ఝాన్సీ ఇలా చాలా మంది మధ్య గొడవలు జరిగాయి. ఇక రామకృష్ణ, షాలినీ అయితే ఒకరి మీదకు ఒకరు వెళ్లారు. నీకు మాట్లాడటమే రాదు అని షాలినీపై అపూర్వ ఫైర్ అయింది. ఇక అప్పుడు కూడా షాలిని మీద మీదకు వెళ్లడంతో.. అసలు ఆమెకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వొచ్చు కదా అని షాలినీకి శ్రీముఖి కౌంటర్ వేస్తుంది.అలా ఈ టాస్క్‌లో చివరగా రోహిత్ వస్తాడు. అప్పుడు 60 సెకన్ల బ్యాడ్జ్ మాత్రమే ఉంటుంది. కావాలంటే దీన్ని స్వాప్ చేసుకోవచ్చు అనే పవర్ ఇస్తాడు. దీంతో దీపక్ వద్ద ఉన్న 45 నిమిషాల బ్యాడ్జ్ తీసుకుని వన్ మినిట్ బ్యాడ్జ్ వేస్తాడు. మరి ప్రియాంకకి 45 సెకన్ల బ్యాడ్జ్ ఇస్తావా? అని అడిగితే. కాదు.. ఆమె 30 సెకన్స్ వర్త్ అని అంటాడు రోహిత్. మరి అలాంటప్పుడు 30 సెకన్స్ వర్త్ ఉన్న బ్యాడ్జ్‌తో స్వాప్ చేసుకోవచ్చు కదా అని జ్యూరీ అడుగుతుంది. వాళ్లకి వన్ మినిట్ బ్యాడ్జ్ వర్త్ కాదు కదా అని తన సమయస్పూర్తితో సమాధానం ఇస్తాడు. ఆ ఆన్సర్‌కి జ్యూరీ ఫిదా అవుతుంది.15 సెకన్స్ బ్యాడ్జ్ వచ్చిన ఐదుగురికి లీడర్ అయ్యే అవకాశం ఉంటుందని ట్విస్ట్ ఇస్తారు. భాగి, రామకృష్ణ, హేమంత్, అపూర్వ, అమన్‌లకు ఓ టాస్క్ ఇస్తారు. 70ఎంఎం దోశను ఇచ్చి.. ఎవరైతే ముందుగా ఫినిష్ చేస్తారో.. వాళ్లే ముందుగా టీంలను ఫాం చేస్తారని చెబుతారు. దీంతో దోశను ముందుగా భాగీ ఆ తర్వాత హేమంత్, ఆపై అమన్ చివరగా రామకృష్ణ, అపూర్వలు ఫినిష్ చేస్తారు. టాస్క్ టైం 15 నిమిషాలు.. కానీ మీ మెడలో ఉన్న బ్యాడ్జ్‌పై ఉన్న సెకన్స్ మైనస్ అవుతాయి. ముగ్గురు టైమింగ్స్ మైనస్ అయిన తర్వాత మిగిలిన మీ సమయంలోనే టాస్క్ పూర్తి చేయాల్సి ఉంటుందని చెబుతారు.దీంతో ముందుగా దోశను ఫినిష్ చేసిన భాగి.. తన వద్ద ఉన్న 15 సెకన్స్తో పాటుగా.. 60 సెకన్స్ బ్యాడ్జ్‌లు ఉన్న దీపక్, రోహిత్‌లను తీసుకుంటుంది. దీంతో భాగీ 12 నిమిషాల 45 సెకన్స్‌లో టాస్క్ ఫినిష్ చేయాల్సి ఉంటుంది. చివరకు అపూర్వకి రాజ కుమారి మాత్రమే మిగులుతుంది. అపూర్వ 15, రాజ కుమారి 30 సెకన్స్ కావడంతో.. ఈ టీం 14.15 సెకన్ల టైం లభిస్తుంది. దీంతో అందరి కంటే ఎక్కువ టైం ఈ టీంకే దొరుకుతుంది. అయితే దీపక్ తన ఫైర్ కార్డ్ వాడి.. స్ట్రాంగ్ టీం అని చెప్పి హేమంత్, మిథిలేష్, చరణ్‌లను తీసేస్తారు. ఇది నా స్వార్థమే అనుకోండి.. ఏమైనా అనుకోండి.. భాగీ అక్క కోసం, నా టీం కోసం చేస్తున్నా.. మేం ఈ టాస్క్ ఎలాగైనా సరే గెలవాల్సిందే అని దీపక్ అంటాడు.కానీ దీపక్ వల్లే ఆ టీం ఈ టాస్కులో ఓడిపోతుంది. అటు అపూర్వ, రాజ కుమారి మెరుపు వేగంతో టాస్క్ ఫినిష్ చేస్తారు. దీపక్ మాత్రం ఫజిల్ పూర్తి చేయలేక అక్కడే ఆగిపోతాడు. దీపక్ వల్ల భాగీ టీం బొక్క బోర్లా పడిపోయింది. చివరకు అపూర్వ, రాజ కుమారి గెలిచి అద్భుతం సృష్టించారు. జ్యూరీ సైతం లేచి నిలబడి క్లాప్స్ కొట్టింది. అపూర్వకు ఓట్ అప్పీల్ రాగా.. రాజ కుమారికి మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్‌గా స్టార్ ఇచ్చి ఓట్ అప్పీల్‌కి పంపించారు. ఇక దారుణంగా ఓడిపోయిన టీం లీడర్ భాగికి ఎల్లో కార్డ్ ఇచ్చి డేంజర్ జోన్లో వేశారు. నా వల్లే జరిగింది.. ఆ కార్డ్ నాకు ఇవ్వండని దీపక్ కన్నీరు పెట్టుకుంటాడు. అది కుదరదు.. అని భాగికి ఎల్లో కార్డ్ ఇస్తుంది జ్యూరీ. దీంతో ఎపిసోడ్ పూర్తవుతుంది.




