
పెద్దాపురం: భగవంతుడు కేవలం మనుషులకే కాదు.. కీటకాలకు కూడా ఆరాధ్యుడే అని చాటి చెప్పేలా పెద్దాపురానికి చెందిన గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ గ్రహీత డా. తాళాబత్తుల సాయి ఓ అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించారు. చిన్న వాహనంపై వినాయకుడు ఊరేగుతున్నట్లుగా తీర్చిదిద్దారు. వాహనం పొడవుతో పాటు గణపతి విగ్రహం ఎత్తు ఒక సెంటీమీటర్ మాత్రమే. అనంతరం ఈ బుల్లి వాహనాన్ని ఓ చీమ లాక్కెళ్తుండగా వీడియో చిత్రీకరించారు. చెక్క, బంగారం, స్టీల్‌ బేరింగులను ఉపయోగించి దీన్ని తయారు చేశారు. దీన్ని రూపొందించడానికి రోజుకు గంట చొప్పున 8 గంటలు, ఎనిమిది రోజుల పాటు చేసినట్లు సాయి పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





