ELSS Funds: పన్ను ఆదా కోసం పెట్టుబడి పెట్టే వారు చాలా మంది ఉంటారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పాత పన్ను విధానం ఎంచుకున్న వారు ప్రతి సంవత్సరం రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు క్లేయిమ్ చేసుకునేందుకు పెట్టుబడులు పెట్టవచ్చు. ఇలా పన్ను ఆదాతో పాటు ఈక్విటీ మార్కెట్లతో దీర్ఘకాలంలో భారీగా లాభాలు ఆర్జించేందుకు ఈఎల్ఎస్ఎస్ (Equity Linked Savings Scheme) మ్యూచువల్ ఫండ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఎకనామిక్ టైమ్స్ విశ్లేషణ ప్రకారం ఆగస్టు 2026లో ఇన్వెస్ట్ చేసేందుకు అత్యుత్తమ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ల వివరాలు తెలుసుకుందాం. క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ (Quant ELSS Tax Saver Fund) అగ్రస్థానంలో ఉంది. అధిక రిస్క్- అధిక రాబడి ఇచ్చే వ్యూహంతో పని చేస్తూ గత 3 నుంచి 5 సంవత్సరాల కాలంలో మార్కెట్ సగటు కంటే అత్యధిక రిటర్న్స్ నమోదు చేసిన ఫండ్‌గా నిలిచింది. మిరే అసెట్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ (Mirae Asset ELSS Tax Saver Fund) స్థిరమైన రాబడులు అందించడంలో ప్రసిద్ధి చెందింది. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ విభాగాలలో విస్తృతమైన కేటాయింపులతో ఇన్వెస్టర్లకు సురక్షితమైన వృద్ధిని ఇస్తుంది. పరాగ్ పారిఖ్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ (Parag Parikh ELSS Tax Saver Fund) వాల్యూ ఇన్వెస్టింగ్ పద్ధతిని పాటిస్తూ, తక్కువ రిస్క్‌తో దీర్ఘకాలికంగా నాణ్యమైన రాబడులు అందించే ఇన్వెస్టర్లకు ఇది అనువైన ఎంపికగా చెప్పవచ్చు. ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ (SBI Long Term Equity Fund). భారతదేశంలో అత్యంత పురాతనమైన, నమ్మకమైన టాక్స్ సేవర్ ఫండ్లలో ఒకటి. విభిన్న రంగాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా స్థిరమైన ప్రదర్శన కనబరుస్తోంది. డీఎస్పీ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ (DSP ELSS Tax Saver Fund). గత కొన్ని త్రైమాసికాలుగా మంచి రికవరీ సాధిస్తూ ఇన్వెస్టర్లకు అత్యుత్తమ రాబడులను అందిస్తోంది.ఈఎల్ఎస్ఎస్ ఫండ్లలో పెట్టుబడికి కారణాలుసెక్షన్ 80సీ కింద లభించే ఇతర ఆప్షన్లతో పోలిస్తే ఈఎల్ఎస్ఎస్ ఫండ్లకు కేవలం 3 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు దక్కడమే కాకుండా, మీ డబ్బు ఈక్వీటీ షేర్లలో ఇన్వెస్ట్ అవ్వడం వల్ల ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులు లభిస్తాయి.Disclaimer: ఈ కథనం కేవలం సమాచారం అందించేందుకే. ఎలాంటి పెట్టుబడులు పెట్టాలని ప్రోత్సహించడం లేదు. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల్లోనూ హైరిస్క్ ఉంటుంది. ఎంచుకునే స్కీమ్ గురించి అన్ని వివరాలు ముందే తెలుసుకోవాలి. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.


