
Bengaluru College Student Works As Rapido Driver For 3 Months Shares Earnings And Lessons
బెంగళూరుకు చెందిన ఓ బీబీఏ రెండో సంవత్సరం విద్యార్థి 3 నెలల పాటు ర్యాపిడో కెప్టెన్‌గా పనిచేసి తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం ఇప్పుడు వైరల్‌గా మారింది.
బెంగళూరుకు చెందిన ఓ బీబీఏ రెండో సంవత్సరం విద్యార్థి 3 నెలల పాటు ర్యాపిడో కెప్టెన్‌గా పనిచేసి తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం ఇప్పుడు వైరల్‌గా మారింది. కాలేజీ సెలవుల్లో పార్ట్‌టైమ్‌గా ఈ ర్యాపిడో డ్రైవర్ పని ప్రారంభించిన అతడు.. గిగ్ ఎకానమీ, రైడ్ యాప్ అల్గారిథమ్ ఎలా పనిచేస్తాయో స్వయంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో చేసినట్లు తెలిపాడు. మొదట ప్లాట్‌ఫామ్ పనితీరుపై పెద్దగా అవగాహన లేకపోయినా.. కొద్ది రోజుల్లోనే ఎక్కువ డిమాండ్ ఉండే ప్రాంతాలను గుర్తించి ఆదాయాన్ని పెంచుకున్నట్లు వివరించాడు.ఆ స్టూడెంట్ సాధారణంగా ఉదయం 8 గంటలకు పని ప్రారంభించి.. సాయంత్రం 4.30 గంటల వరకు రైడ్లు చేసేవాడిని అని పేర్కొన్నాడు. బాగా ఆర్డర్లు వచ్చిన రోజు పెట్రోల్ ఖర్చులు, ఇతర వ్యయాలు తొలగించిన తర్వాత సుమారు రూ.1,200 వరకు సంపాదించేవాడని చెప్పాడు. మధ్యాహ్నం సమయంలో రైడ్లు తగ్గినప్పుడు అదనపు ఆదాయం కోసం ఫుడ్ డెలివరీలు కూడా చేసేవాడిని అని తెలిపాడు.My 3-month experience doing Rapido as a side hustle in Bangalore — ₹1.2k/day, algorithm, restaurants & what I learnedఫుడ్ డెలివరీ సమయంలో కూడా తనకు ఆసక్తికరమైన అనుభవాలు ఎదురయ్యాయని అతడు చెప్పుకొచ్చాడు. కొన్ని రెస్టారెంట్లలో ఆర్డర్ వెంటనే రెడీ అయ్యేదని.. మరికొన్ని చోట్ల మాత్రం 20 నుంచి 25 నిమిషాల వరకు వేచి ఉండాల్సి వచ్చేదని వివరించాడు. మూడు నెలల పాటు బెంగళూరులోని మెజెస్టిక్, రైల్వే స్టేషన్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ఎక్కువగా రైడ్లు చేశానని.. ఆటో డ్రైవర్లు తనను గమనించినప్పటికీ, ఎవరూ బెదిరించలేదని చెప్పాడు.ఇక తనకు వచ్చిన ఆదాయాన్ని చూపించేందుకు ర్యాపిడో ఎర్నింగ్స్ డ్యాష్‌బోర్డ్ స్క్రీన్షాట్లను కూడా ఆ విద్యార్థి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మే నెలలో 96 ఆర్డర్లు పూర్తి చేసి రూ.5,650 సంపాదించగా.. జూన్‌లో ఆదాయం గణనీయంగా పెరిగి రూ.16,660కు చేరింది. జూలైలో 3 నెలల ప్రయాణాన్ని ముగించే సమయానికి 233 ఆర్డర్లు పూర్తి చేసి రూ.14,222 సంపాదించినట్లు వెల్లడించాడు.అయితే ఈ అనుభవం తనకు కేవలం డబ్బు సంపాదించడానికే పరిమితం కాలేదని అతడు పేర్కొన్నాడు. గిగ్ వర్కర్ల జీవితాన్ని దగ్గరగా చూసి అర్థం చేసుకునే అవకాశం లభించిందని చెప్పాడు. వెయిటింగ్, పెట్రోల్ ఖర్చులు, స్థిరమైన ఆదాయం లేకపోవడం, ప్లాట్‌ఫామ్ నిబంధనలు, కస్టమర్ల సమస్యలు, రెస్టారెంట్లలో ఎదురయ్యే ఇబ్బందులు, నిరంతరం పని చేయాల్సిన ఒత్తిడి వంటి అంశాలను ప్రత్యక్షంగా అనుభవించానని వివరించాడు. అతడి పోస్ట్‌పై నెటిజన్ల నుంచి ప్రశంసల జల్లు కురిసింది.






