
ఏపీ, తెలంగాణా రాష్ట్రాలలో ఈసారి వర్షాలు చాలా తక్కువగా నమోదు అవుతున్నాయి. అడపా దడపా వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. అయితే తాజాగా మళ్ళీ ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది .ఏపీలో ఉపరితల ఆవర్తన ప్రభావం వర్షాలకు ఛాన్స్వాయువ్య బంగాళాఖతంపై సముద్రమట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీంతో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాదు 22 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి మధ్య, ఆనుకుని ఉన్న ఉత్తర భారత ద్వీపకల్ప ప్రాంతాలలో 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల షియర్ జోన్ విస్తరించి ఉందని, దీనివలన కూడా వాతావరణంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది.ఈ వారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుఆదివారం, సోమవారం, మంగళవారం తేదీల్లో ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు కూడా సంభవించవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.మూడు రోజులు రాయలసీమలో వర్షాలకు అవకాశం రానున్న మూడు రోజుల పాటు రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ ప్రాంతంలోనూ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.వర్షాలు, ఉరుములు, మెరుపులు, బలమైన గాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఏపీ, తెలంగాణాలకు రైళ్ల పండుగ.. మళ్లీ కొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్ళు వర్షాలు పడే ప్రాంతాల ప్రజలకు అలెర్ట్ ముఖ్యంగా వర్షాలు ఎల్ నినో ప్రభావంతో పడినప్పుడు కుండపోతగా కూడా పడే అవకాశం లేకపోలేదు. కనుక రైతులు, చేపల వేటగాళ్లు, సముద్ర తీర ప్రాంతాల్లో నివసించేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు. పిల్లలు, వృద్ధులు ఇళ్లలోనే ఉండాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని సలహా ఇచ్చారు. వచ్చే మూడు రోజులు వర్షాలు పడే క్రమంలో వర్షాలు పడే ప్రాంతాల ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖాధికారులు.





