
AP Local Body Elections నిర్వహణకు ఏపీలో కీలక ముందడుగు పడింది. వార్డులు, డివిజన్ల పునర్విభజన, డీలిమిటేషన్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. డీలిమిటేషన్‌పై దాఖలైన సుమారు 50 పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగినట్లైంది.
హైకోర్టు తీర్పుతో మున్సిపల్, పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వంటి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. ముఖ్యంగా వార్డుల పునర్విభజన విషయంలో కోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
వార్డుల పునర్విభజన ప్రక్రియతో భౌగోళిక సరిహద్దుల్లో తప్పనిసరిగా మార్పులు జరుగుతాయని భావించాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసినట్లు సమాచారం. డీలిమిటేషన్ ప్రక్రియలో ప్రజా ప్రతినిధ్యానికి సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లవచ్చని కోర్టు తీర్పు ఎన్నికల ప్రక్రియకు ఊతమిచ్చింది.
ఈ తీర్పుతో ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లైంది. న్యాయపరమైన అంశాల కారణంగా నిలిచిపోయిన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసేందుకు చర్యలు ప్రారంభించింది.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీ పురపాలక శాఖ కీలక చర్యలు చేపట్టింది. మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు షెడ్యూల్ విడుదల చేసింది. పురపాలక శాఖ డైరెక్టర్ ఈ మేరకు సంబంధిత కార్పొరేషన్లకు ఆదేశాలు జారీ చేశారు.
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC), విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, కడప, ఏలూరు, అనంతపురం, ఒంగోలు, చిత్తూరు, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టనున్నారు.
తాజా ఆదేశాల ప్రకారం సంబంధిత కార్పొరేషన్లు వెంటనే వార్డుల పునర్విభజనకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి పంపాల్సి ఉంటుంది.
వార్డుల పునర్విభజనకు సంబంధించిన ప్రతిపాదనలపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించేందుకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. షెడ్యూల్ ప్రకారం 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు.
ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులు తుది ప్రతిపాదనలను సిద్ధం చేయనున్నారు. అనంతరం 12వ తేదీన పురపాలక శాఖ డైరెక్టరేట్‌కు ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత 13వ తేదీన డీలిమిటేషన్ వార్డులను ప్రకటించనుండగా, 14వ తేదీన ఏపీ గెజిట్‌లో ప్రచురించేలా షెడ్యూల్ రూపొందించినట్లు సమాచారం.
వార్డుల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కావడంతో ఏపీలో రాజకీయ పార్టీల దృష్టి స్థానిక ఎన్నికలపై పడింది. మున్సిపల్ ఎన్నికలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయ పార్టీలకు అత్యంత కీలకంగా మారనున్నాయి. గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పార్టీ బలం, నాయకుల పనితీరు, స్థానిక సమస్యలపై ప్రజల అభిప్రాయం వంటి అంశాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించాలని మంత్రి వార్డుల పునర్విభజనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన
అభ్యంతరాలకు అవకాశం
స్థానిక ఎన్నికలపై రాజకీయ పార్టీల దృష్టి
కూటమి విజయంపై నారా లోకేష్ వ్యాఖ్యలు





