బిగ్ బాస్ పదో సీజన్ సందడి షురూ అయింది. ఇంకో మూడు, నాలుగు వారాల్లో పదో సీజన్ లాంఛ్ కాబోతోంది. అంతలోపు అగ్ని పరీక్ష ప్రాసెస్ కూడా పూర్తి అవుతుంది. ఆగస్ట్ 15 నుంచి అగ్ని పరీక్ష ఎపిసోడ్స్ ప్రసారం కాబోతోన్నాయి. ఇప్పటికే వేల సంఖ్యలో వచ్చిన అప్లికేషన్స్‌ను కుదించారు. దాదాపు 70 మందిని ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ 70 మందిలోంచి టాప్ 15 వచ్చే వరకు టాస్కులు అంటూ వారితో జ్యూరీ మెంబర్స్ ఓ ఆట ఆడుకుంటూ ఉంటారు. చివరకు ఐదు లేదా ఆరుగురు కంటెస్టెంట్లను బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశ పెట్టేలా ఉన్నారు.రైతు బిడ్డ కేటగిరీలో ఆల్రెడీ పల్లవి ప్రశాంత్‌కి ఛాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సారి కూడా రైతు బిడ్డ కేటగిరీలో అమ్మాయికి అవకాశం ఇచ్చేలా కనిపిస్తున్నారు. ఈ అగ్ని పరీక్షలో అయితే ఆమెకు మొదటి స్టెప్‌లో గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మరి మున్ముందు టాస్కులతో మెప్పించి టాప్ 5 వరకు ఉంటుందో లేదో చూడాలి. రివర్స్ రైటింగ్ అంటూ స్పెషల్ టాలెంట్‌తో వచ్చిన అమ్మాయికి కూడా గ్రీన్ సిగ్నల్ పడింది. ఫుల్ ఎనర్జీతో ఉన్న కంటెస్టెంట్లను నెక్ట్స్ ఫేజ్‌కి పంపించినట్టుగా అనిపిస్తోంది.తాజాగా వదిలిన అగ్ని పరీక్ష ప్రోమో వైరల్ అవుతోంది. జడ్జ్‌లుగా అభిజిత్ , బిందు మాధవి, నవదీప్ మళ్లీ రప్ఫాడించినట్టుగా కనిపిస్తోంది. వచ్చిన కంటెస్టెంట్లతో సరదాగా మాట్లాడుతూనే కావాల్సిన చోట చురకలు అంటించినట్టు అనిపిస్తోంది. ఇక శ్రీముఖి ఎప్పటిలానే కండలు ఉన్న కంటెస్టెంట్లను చూస్తే వావ్ అంటూ నోరు తెరిచేసింది. నీకు కావాల్సింది వచ్చిందా? అంటూ నవదీప్ కూడా కౌంటర్లు వేసేస్తున్నాడు. ఇక ఈ 70 మంది కంటెస్టెంట్లలోంచి ఈ ప్రోమోలో కొంత మందిని హైలెట్ చేసి చూపించారు.కొంత మంది కంటెస్టెంట్లు రూల్స్ అతిక్రమించినట్టుగా కనిపిస్తోంది. మమ్మల్నే మోసం చేస్తావా? జ్యూరీని తప్పుదారి పట్టిస్తావా? అంటూ శ్రీముఖి ఓ కంటెస్టెంట్ మీద ఫైర్ అవుతూ కనిపించింది. ఇంకో కంటెస్టెంట్ అయితే ఏకంగా అభిజీత్ మీదే కౌంటర్లు వేశాడు. బిగ్ బాస్ షో అయ్యాక రెండు, మూడేళ్లు అభిజిత్ కనిపించలేదు కదా అని అన్నాడు. దీంతో అభిజిత్‌కి కాలినట్టుంది. మాకు వేరే పని లేదని అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావ్ అసలు అని రెడ్ సిగ్నల్ చూపించేశాడు. ఆల్రెడీ సెలెబ్రిటీల కేటగిరీ లిస్ట్ ఒకటి నెట్టింట్లో బాగానే వైరల్ అవుతోంది. దీపిక రంగరాజు, ఆటో రాం ప్రసాద్, జబర్దస్త్ రాకేష్, హరి, పల్లవి రామిశెట్టి, పల్లవి గౌడ వంటి వారు బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం.





