
Lionel Messi Net Worth And Assets: ప్రపంచ ఫుట్‌బాల్‌లో మరో దిగ్గజం ఆట నుంచి వైదొలిగింది. దాదాపు రెండు దశాబ్దాలు ఆటకు వన్నె తెచ్చిన గొప్ప సాకర్ ఆటగాడు లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అర్జెంటీనా స్టార్ తన ఆటకు ముగింపు పలుకుతూ ప్రకటన చేశాడు. దీంతో ఆయన ఆట నుంచి ఎంత సంపాదించాడో తెలుసుకుందాం.
ప్రపంచంలో అత్యంత టాప్ జట్టు అంటే అర్జెంటీనా.. మేటి ఆటగాడు అంటే లియోనిల్ మెస్సీ గుర్తుకు వస్తాడు. అంతటి గొప్ప జట్టు.. గొప్ప ఆటగాడు ఇటీవల ముగిసిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ట్రోఫీ లేకుండానే టోర్నీని ముగించాడు. ఫైనల్లో ఘోర పరాభవం నుంచి తేలుకోక ముందే మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించడం ఆ అర్జెంటీనా జట్టును మరింత కోలుకోలేని దెబ్బతీసింది.
ఇటీవల అతడి తండ్రి జార్జ్ మెస్సీ మరణించడం.. ప్రపంచకప్‌లో ట్రోఫీని చేజార్చుకున్న బాధలో మెస్సీ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ రెండు పరిణామాలతో కొంత కలత చెందిన మెస్సీ ఈ క్రమంలోనే భవిష్యత్‌లో ఆటపై దృష్టి సారించలేనని ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పేశాడు.
ఫుట్‌బాల్ అర్జెంటీనా జాతీయ జట్టు తరపున అంతర్జాతీయ పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం మెస్సీ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. జాతీయ జట్టును వీడటం బాధాకరమైన నిర్ణయమే అయినా తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని తెలిపాడు. అర్జెంటీనాకు 2022 ప్రపంచ కప్, రెండు కోపా అమెరికా టైటిళ్లు అందించిన మెస్సీ 2026 ప్రపంచ కప్‌లో జట్టును రన్నరప్‌గా నిలిపాడు.
ఆటతోపాటు ఆస్తుల్లోనూ మెస్సీ బాగా సంపాదించాడు. అతడి ఆస్తులు మొత్తం రూ.10,450 కోట్లు ఉంటుందని ఇటీవల విడుదలైన ఫోర్బ్స్ నివేదిక ఆధారంగా చెప్పవచ్చు. ఫుట్‌బాల్ ఆటగాడిగానే కాకుండా వ్యాపారాలు, వాణిజ్య ప్రకటనల ద్వారా 39 ఏళ్ల మెస్సీ బాగా వెనకేసుకున్నాడు.
ఫుట్‌బాల్ ఆటగాడిగా ఏడాదికి రూ.530 కోట్లకు పైగా సంపాదించగా.. వాణిజ్య ప్రకటనలు.. ఇతర వ్యాపారాల ద్వారా రూ.550 కోట్ల మేర సంపాదిస్తున్నట్లు కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలిపాయి. అంటే అతడి ఏడాది సంపాదన రూ.వెయ్యి కోట్లకు పైమాటే ఉంది.
ఇక అతడు ఆస్తులు దాదాపు రూ. రెండు, మూడు వేల కోట్లకు పైగా ఉంటాయని సమాచారం. అంతర్జాతీయంగా అతడు వ్యాపారాలు చేస్తున్నాడు. గోట్ టూర్ పేరిట వివిధ దేశాల సందర్శన చేసిన సమయంలో మెస్సీ భారీగా ఆదాయం పొందుతాడు. ఇక సామాజిక మాధ్యమాల ద్వారా కూడా మెస్సీ కొన్ని కోట్లు సంపాదిస్తున్నాడు.



