
అలాస్కాలోని గడ్డకట్టే బెరింగ్ సముద్రంలో పడవ బోల్తా పడి మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన 15 ఏళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో అతని సోదరుడు, కజిన్ ప్రాణాలు కోల్పోగా, ఆ బాలుడు బోల్తా పడిన పడవను గట్టిగా పట్టుకుని మూడు రోజుల పాటు ఆహారం, నీళ్లు లేకుండా గడిపాడు. ఇందుకు సంబంధించిన వార్త, ఈ రెస్క్యూ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.






