
Epic Movie Review: ‘ఎపిక్’ సినిమా రివ్యూ.. ‘బేబీ’ జంట మళ్లీ హిట్ కొట్టిందా? లేదా..?
Epic Movie Review: ‘ఎపిక్’ సినిమా రివ్యూ.. ‘బేబీ’ జంట మళ్లీ హిట్ కొట్టిందా? లేదా..?
© 2026 nimisham.in

Epic Movie Review: ‘ఎపిక్’ సినిమా రివ్యూ.. ‘బేబీ’ జంట మళ్లీ హిట్ కొట్టిందా? లేదా..?

ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్లతో పాటు ఓటీటీలోనూ కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు వివిధ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేయనున్నాయి. ఇప్పటికే అక్కినేని నాగార్జున నిర్మించిన పళ్ల బురుసు సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో పాటు వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, లోకేశ్ కనగరాజ్ డీసీ, మాధవన్ జీడీఎన్, ఉన్మాదం, గాంధారి వంటి సినిమాలతో పాటు జగమే సంగీతం, ద కోర్ట్ లాంటి వెబ్ సిరీసులు ఈ వీకెండ్ లోనే స్ట్రీమింగ్ కు రానున్నాయి. అయితే వీటికంటే ముందే ఒక హాలీవుడ్ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. బుధవారం (సెప్టెంబర్ 02) నుంచే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమంగ్ ప్లాట్ ఫామ్ లో ప్రత్యక్షమైంది. అది కూడా ఎలాంటి ముందస్తు థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా పేరు ‘ది రన్నర్’ (The Runner). ‘వండర్ వుమెన్’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన గాల్ గాడోట్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ పోషించింది. ప్రముఖ దర్శకుడు కెవిన్ మెక్‌డొనాల్డ్ తెరకెక్కించిన ది రన్నర్ సినిమా డైరెక్టుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. లండన్ నేపథ్యంగా సాగే ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. గాల్ గాడోట్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇంగ్లిష్ తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ది రన్నర్ సినిమా అందుబాటులో ఉంది. ‘ద రన్నర్’ సినిమా స్టోరీ విషయానికొస్తే.. లండన్‌లో కొడుకుతో జీవించే ఓ మహిళ.. ఆ పిల్లాడ్ని ఓ రోజు స్కూల్లో దిగబెట్టి వస్తుంది. కానీ కొంతసేపటి తర్వాత ఒక కిడ్నాపర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఒక గంటలో తాను

ఓటీటీలో హారర్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ మలయాళం సినిమాలు, సిరీస్ లకు అయితే ఓ రేంజ్ లో రెస్పాన్స్ ఉంటోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఒక మలయాళం హారర్ థ్రిల్లర్ సినిమానే. అందులోనూ నిజ జీవితంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఇందులోని ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, అలాగే ఊహించని ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించాయి. టాక్ కు తగ్గట్టుగానే ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వచ్చాయి. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్లోనే తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్ల వరకు రాబట్టింది. ఐఎమ్ డీబీలోనూ ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి టాప్ రేటింగ్ ఉండడం విశేషం. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. కేరళలోని తిరవనంతపురం సమీపంలోని ఓ మారుమూల గ్రామం చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. అక్కడ చాలా కాలం క్రితం ఓ రోడ్డు మలుపులో గర్భవతి అయిన ఒక అమ్మాయి అనుమానాస్పద స్థితిలో చనిపోతుంది. అప్పటి నుంచి ఆమె దెయ్యమై అక్కడే తిరుగుతూ ఉందనీ, ఆ దారిన వెళుతున్న ఎంతోమందిని బలి తీసుకుందని గ్రామస్తులు నమ్ముతుంటారు. అందుకు తగ్గట్టుగానే ఆ మలుపు దగ్గరక వెళ్లిన చాలా మంది కనిపించకుండా పోతారు. మరి ఆ మలుపులో నిజంగానే దెయ్యాలున్నాయా? గర్భవతి అయిన అమ్మాయి ఎలా చనిపోయింది? చివరికి ఈ మిస్టరీని ఛేదించారన్నదే ఈ సినిమా కథ. కేరళలోని తిరువనంత పురం సమీపంలోని మైలమూడు పరిసర గ్రామాల్లో గతంలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పేరు సుమతి వలవు. ఇదేదో సినిమా కోసంపెట్టిన పేరు కాదు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో నిజంగానే

ఒక సినిమా థియేటర్లలో ఆశించిన విజయం సాధించకపోయినా, ఓటీటీలో దాని తలరాత మారిపోవచ్చు. దీనికి తాజా ఉదాహరణ ఈ సినిమానే. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందని ఈ స్పై-యాక్షన్ చిత్రం, ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన వెంటనే ఈ చిత్రం ట్రెండింగ్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. శివ్ రావైల్ దర్శకత్వం వహించిన 'ఆల్ఫా', YRF స్పై యూనివర్స్‌లో ఒక ముఖ్యమైన భాగం. ఈ చిత్రం 2026 జూలై 3న థియేటర్లలో విడుదలైంది. ఆలియా భట్, శర్వరి వాఘ్ వంటి స్టార్ హీరోయిన్లు ఈ స్పై యూనివర్స్‌లో కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటు భారీ స్టార్ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ చిత్రంలో ఆలియా, షర్వరిలతో పాటు బాబీ డియోల్, అనిల్ కపూర్, హృతిక్ రోషన్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. దీంతో రిలీజ్ కు ముందే 'ఆల్ఫా' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, థియేటర్లలో రిలీజైన తర్వాత ఈ సినిమా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు కలెక్షన్లతో మాత్రమే సరిపెట్టుకుంది. అయితే ఇప్పుడు, 'ఆల్ఫా' డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో తన సత్తా చాటడం ప్రారంభించింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన తర్వాత, ప్రేక్షకుల నుండి మంచి స్పందనను పొందుతూ ట్రెండింగ్ జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది. ఆల్ఫా సినిమాకు ఉదయ్ చోప్రా స్టోరీ అందించగా... యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ మాజీ ఏజెంట్ కూతురు సీత (ఆలియా భట్). ఆమెను చిన్నప్పటి నుంచి సమాజానికి దూరంగా ఓ ప్రొఫెషనల్ సోల్జర్‌గా పెంచుతాడు. ఇదే సమయంలో ఓ అంతర్జాతీయ తీవ్ర వాద ముఠా దేశ భద్రతకే పెను ముప్పుగా మారుతుంది. ఆ ముఠా లీడర్ (బాబీ డియోల్)ను అణచి

కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజైనప్పుడు పెద్దగా ఆడవు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. పేరున్న నటీనటులు లేకపోవడం, ప్రమోషన్లు సరిగ్గా చేయకపోవడం, అలాగే థియేటర్ల సమస్య.. ఇలా చాలా కారణాలతో కొన్ని సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటాయి. అలా బిగ్ స్క్రీన్ పై సందడి చేయని సినిమాలు ఒక్కోసారి ఓటీటీ లేదా యూట్యూబ్‌లో వచ్చినప్పుడు మంచి రెస్పాన్స్ ఉంటుంది. భారీగా వ్యూయర్ షిప్ ఉంటుంది. మరీ ముఖ్యంగా సస్పెన్స్, క్రైమ్, హారర్, థ్రిల్లర్ సినిమాల విషయంలో తరచూ ఇలా జరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. గతేడాది శంబాల వంటి సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ యుగంధర్ ముని ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే థియేటర్లలో రిలీజైనప్పుడు ఈ మూవీ పెద్దగా ఆడలేదు. కానీ ఆ తర్వాత ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీగా వ్యూయర్ షిప్ వచ్చింది. ఇప్పుడీ సినిమా యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. హీర సంజీవ్ ఓ హాస్పిటల్లో అకౌంటెంట్ గా వర్క్ చేస్తుంటాడు. అదే హాస్పిటల్లో నర్స్ గా వర్క్ చేసే పల్లవిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వీరిద్దరూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటారు. అయితే అదే సమయంలో సిటీలో పిల్లలు వరుసగా అదృశ్యమవుతారు. అలా సుమారు 23 మంది పిల్లలు మిస్సింగ్ అవుతారు. అయితే అనుకోకుండా ఈ కేసులో సంజీవ్ ఇరుక్కుంటాడు. మరి ఆ పిల్లల వెనక సందీప్ ఉన్నది నిజమేనా? అసలు ఆ పిల్లల కిడ్నాప్ కు సంజీవ్ కు ఉన్న సంబంధమేంటి? చివరకు ఈ కేసు ఎలా పరిష్కారమయ్యింన్నదే ఈ సినిమా కథ. నరుడి బ్రతకు నటన సినిమాతో ప్రశంసలతో పాటు అవార్డులు అందుకున్న నితిన్ ప్రసన్న హీరోగా నటించిన చిత్రం A (ఏడీ ఇన్ఫినిటమ్). మళ్లీ

మాస్ మహారాజ రవితేజ నటించిన ఇరుముడి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సినిమాతో రవితేజ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. మొదటి నుంచి ఈ సినిమా పై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. సినిమాలో యాక్షన్, సెంటిమెంట్ తో పాటు అయ్యప్ప స్వామి మల నేపథ్యం ఉండటంతో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 21న ( నేడు) సినిమా థియేటర్స్ లోకి రానుంది. కాగా ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ మొదలయ్యాయి. సినిమా చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో తెలుపుతున్నారు. ట్విట్టర్ (ఎక్స్ ) వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు ఆడియన్స్. మరి సినిమా ఎలా ఉందొ వారి పోస్ట్ ద్వారా చూసేద్దాం.. సినిమాకు మంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. It's not India, all this is in LONDON 🙏#IRUMUDI — The Cine Gossips (@TheCineGossips) August 20, 2026 2nd half antha Twist lu High tension lu Edupu lu😭 Actors andharu evaru act cheyyaledhu Asalu jeevinchaaru anthe🔥 Swamiye Sharanam Ayyappa🙏🔥🔥#Irumudi #IrumudiBlockbuster — Surendra (@Surendrapagidi2) August 20, 2026 — LowBattery (@LowBattery0007) August 20, 2026 Uk shows done and it’s a hit talk from there Congratulations... 💐 #IRUMUDI movie team Overseas by @PrathyangiraUS@RaviTeja_offl @priya_Bshankar @ShivaNirvana @gvprakash @MythriOfficial @TSeries — Suresh Kondeti (@santoshamsuresh) August 20, 2026 #Irumudi is a perfect movie for Ravi Teja ❤️ What a beautiful and emotional film.. Definitely one of

ఈ మధ్యన నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల జీవిత కథల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆడియెన్స్ కూడా ఈ రియల్ స్టోరీలను చూసేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీలో రియల్ క్రైమ్ స్టోరీలకు భారీగా వ్యూయర్ షిప్ ఉంటోంది. అందుకే ఈ మధ్యన ఓటీటీలు కూడా ఎక్కువగా ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలనే స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఇదో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా దర్శకుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పుడు తన జీవితంలో జరిగిన ఒక యదార్థ సంఘటననే కథగా మలిచి ఈ మూవీని తెరకెక్కించాడు. ఒక బర్త్ డే పార్టీలో ఫ్రెండ్ షిప్ పేరుతో వేసిన వెకిలి వేషాలు ఓ మనిషి నిండు ప్రాణాలను ఎలా బలి తీసుకున్నాయి? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. థియేటర్లలో ఈ క్రైమ్ థ్రిల్లర్ పెద్దగా ఆడకపోయినా ఓటీటీలో మాత్రం దుమ్మురేపింది. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ సినిమా స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే ట్విస్టులు కూడా ఓ రేంజ్ లో ఉంటాయి. బాలు, అర్జున్, వెంకట్, సాయి, సత్తి క్లోజ్ ఫ్రెండ్స్ అమెరికాలో చదువుకుంటుంటారు. ఒకరోజు బాలు పుట్టినరోజు కావడంతో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. అయితే ఈ సెలబ్రేషన్స్ శ్రుతి మించి అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదంలో బాలు చనిపోతాడు. దీంతో తోటి ఫ్రెండ్స్ అందరూ భయపడిపోతారు. సాయం కోసం అర్జున్ సోదరుడు భరత్ ను పిలుస్తారు. లాయర్ అయిన ఇతడు.. చనిపోయిన బాలు తల్లిదండ్రులకు విషయం చెప్పి అమెరికా రప్పిస్తాడు. మరి ఇంతకీ బాలు చనిపోయాడా? లేదా చంపేశారా? చివరకు ఏమైందన్నదే ఈ సినిమా స్టోరీ. ఆద్యంతం ఆసక్తికరమైన కథా

Shubman Gill:భారత టెస్ట్ జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి శుభ్‌మన్ గిల్ ఆటగాడిగా నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. అయితే కెప్టెన్‌గా మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం తరచుగా విఫలమవుతున్నాడు. ప్రధానంగా డీఆర్ఎస్ (డిసిషన్ రివ్యూ సిస్టమ్) కోరే విషయంలో గిల్ నిర్ణయాలు జట్టును తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. మైదానంలో ఆవేశానికి లోనై లేదా బౌలర్ల ఒత్తిడికి తలొగ్గి రివ్యూలు కోరడం వల్ల విలువైన అవకాశాలు చేజారిపోతున్నాయి. గిల్ తన నాయకత్వ ప్రస్థానంలో ఇప్పటివరకు మొత్తం 41 సార్లు డీఆర్ఎస్ తీసుకున్నాడు. అందులో కేవలం 5 రివ్యూలు మాత్రమే అనుకూలంగా రావడం గమనార్హం. మిగిలిన 36 రివ్యూలు పూర్తిగా వ్యర్థమయ్యాయి. అంటే అతని డీఆర్ఎస్ సక్సెస్ రేటు అత్యంత ఘోరంగా ఉంది. శ్రీలంకతో జరుగుతున్న గాల్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కూడా 30వ ఓవర్, 35వ ఓవర్లలో గిల్ తీసుకున్న నిర్ణయాలు నిరాశనే మిగిల్చాయి. చెరొక సమీక్షను వృథా చేయడంతో మూడింట్లో రెండు రివ్యూలు చేజారాయి. బౌలర్లు, కీపర్ సలహాలు రివర్స్ అవుతున్నాయా? డీఆర్ఎస్ కోరే సమయంలో గిల్ ఒక్కడే నిర్ణయం తీసుకోడు. బౌలర్, వికెట్ కీపర్, స్లిప్ ఫీల్డర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాడు. అయినా సరే ఫలితం మాత్రం ప్రతికూలంగానే వస్తోంది. మైదానంలో బౌలర్ల ఆత్రుతను అదుపు చేసి, కీపర్ ఇచ్చే స్పష్టమైన సమాచారాన్ని విశ్లేషించడంలో కెప్టెన్‌గా గిల్ విఫలమవుతున్నాడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఆవేశంతో కాకుండా స్పష్టత ఉన్నప్పుడు మాత్రమే రివ్యూలు కోరడం అలవాటు చేసుకోవాలి. మాజీ కెప్టెన్లు మహేంద్రసింగ్ ధోని, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాలు డీఆర్ఎస్ కోరడంలో సిద్దహస్తులుగా పేరుగాంచారు. ధోని రివ్యూ తీసుకుంటే వికెట్ ఖాయం అనే నమ్మకం ఉండేది. ఇప్పుడు గిల్ కూడా వారి నుంచి ఆ వ్యూహాత్మక ఆలోచనలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కీలక సమయాల్లో రివ్యూలు మిగిలి ఉంటేనే మ్యాచ్ మలుపు తిరిగే అవకాశం ఉంటుంది. రాబోయే మ్యాచ్‌ల్లో గిల్ ఈ

ఈ రోజుల్లో ఓటీటీ ప్రభావం బాగా పెరిగిపోయింది. అందుకే కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన విజయం సాధించకపోయినా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో మాత్రం దుమ్మురేపుతున్నాయి. రికార్డు వ్యూయర్ షిప్ తెచ్చుకుంటున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ‘భారత్ భాగ్య విధాత’ థియేటర్లలో పెద్దగా వసూళ్లు సాధించలేకపోయింది. అయితే ఓటీటీలో విడుదలైన వెంటనే ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. ‘భారత్ భాగ్య విధాత’ చిత్రం 2026 జూన్ 14న థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. విమర్శకుల నుంచి పాజిటివ్ రివ్యూలు అందుకున్నప్పటికీ, థియేటర్లలో ప్రేక్షకుల నుండి ఈ సినిాకు సానుకూల స్పందన లభించలేదు.భారతదేశంలో ఈ చిత్రం సుమారు రూ. 6.67 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 8.16 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అయితే ఇప్పుడు ఓటీటీలో’భారత్ భాగ్య విధాత’ సినిమా ఇమేజ్ పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 14న జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైంది. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు ఓటీటీలో విడుదలైన తర్వాత, ‘భారత్ భాగ్య విధాత’ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి, ట్రెండింగ్ జాబితాలో నంబర్ వన్‌కు చేరుకున్నట్లు చెబుతున్నారు. ‘భారత్ భాగ్య విధాత’ కథ 26/11 ముంబై ఉగ్రవాద దాడుల నేపథ్యంలో రూపొందించారు.. సంక్షోభ సమయాల్లో ప్రభుత్వ ఆసుపత్రులలోని నర్సులు ప్రదర్శించే ధైర్యం, ముందుచూపును ఈ చిత్రం చాటిచెబుతుంది. ఒక ఉగ్రవాద దాడి మధ్యలో, పిల్లలతో సహా ఎంతోమంది రోగుల ప్రాణాలను కాపాడటానికి నర్సులు తమ ప్రాణాలను ఎలా పణంగా పెట్టారో ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇందులో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించారు. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుండటంతో, ‘భారత్ భాగ్య విధాత’పై విస్తృత చర్చ

ఫస్ట్ లవ్‌ను సరికొత్తగా ఆవిష్కరిస్తూ, హృదయాన్ని హత్తుకునే కథనంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ రొమాంటిక్ డ్రామా ఆగస్టు 21న సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. హృదయాన్ని హత్తుకునే కథనం, మనసుకు హాయినిచ్చే సంగీతం, ఆకట్టుకునే నటీనటుల పెర్ఫార్మెన్స్తో థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా రూ.60 కోట్లకు పైగా గ్రాస్‌ను సాధించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. రవి నంబూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి రవి నంబూరి, సాయి రాజేష్ నీలం స్క్రీన్‌ప్లే అందించారు. సాయి రాజేష్ కథను అందించగా.. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఎస్కేఎన్, సాయి రాజేష్ నీలం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. చెన్నై సిటీ బ్యాగ్రౌండ్లో రూపొందిన ఈ కమింగ్ ఆఫ్ ఏజ్ రొమాంటిక్ డ్రామా ఇద్దరు యువ హృదయాల చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ లవ్‌లోని ఉత్సాహం, అమాయకత్వం, ప్రేమలో ఎదురయ్యే బాధలను దాటుకుంటూ వారు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఈ క్రమంలో ఒకరినొకరు తెలుసుకోవడంతో పాటు.. ఎదిగే క్రమంలో తమను తాము తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమని తెలుసుకుంటారు. ఓటీటీ ప్రీమియర్‌పై హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “ఫస్ట్ లవ్‌తో ముడిపడిన అమాయకత్వం, ఉత్సాహం, భావోద్వేగాలను ఎంతో అందంగా చూపించిన సినిమా ‘చెన్నై లవ్ స్టోరీ’. అందుకే ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైనది. ప్రేక్షకులు సినిమాపై చూపించిన ప్రేమ, ఆదరణ మా అందరి జర్నీని ఎంతో మధురమైన జ్ఞాపకంగా మార్చాయి. ఇప్పుడు సోనీ లివ్ ద్వారా ఈ కథ వివిధ ప్రాంతాలు, భాషలకు చెందిన ప్రేక్షకుల ముందుకు డిజిటల్ ప్రీమియర్‌గా రాబోతుండటం ఎంతో ఆనందంగా ఉంది. సినిమాలోని పాత్రలకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని

తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో దినోత్సవ వేడుకల్లో హీరోయిన్ త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యమంత్రిగా విజయ్ పాల్గొన్న తొలి ఇండిపెండెన్స్ డే వేడుక కావడంతో విజయ్ కుటుంబ సభ్యులతో పాటు త్రిష కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యింది. చెన్నై మెరీనా బీచ్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో విజయ్ తల్లిదండ్రుల పక్కనే మినిస్టర్స్ గ్యాలరీలో త్రిషకు ప్రత్యేక వీఐపీ సీటు కేటాయించడం గమనార్హం. బంగారు రంగు చీరలో ఈ వేడుకలకు హాజరైన త్రిష.. అతిథులను పలకరిస్తూ సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. అయితే ఈ ఇండిపెండెన్స్ వేడుకల్లో త్రిష కట్టుకున్నది తన తల్లి చీరేనట. ఈ విషయాన్ని ఆమెనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ మేరకు ఇది తన తల్లి చీర అంటూ ఫొటోషూట్ చేసుకున్న ఫొటోలని సోషల్ మీడియాలో పంచుకుందీ అందాల తార. ఈ గోల్డ్ కలర్ శారీలో ఎంతో క్యూట్ గా , అందంగా కనిపించింది త్రిష. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే.. చివరిగా కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) సినిమాలో నటించింది త్రిష. ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ సినిమాలో సూర్య హీరోగా నటించాడు. దీని తర్వాత విశ్వంభర సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది త్రిష. వశిష్ట తెరకెక్కిస్తోన్న ఈ సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ లో చిరంజీవి హీరోగా నటిస్తున్నారు విశ్వంభరతో పాటు రామ్ అనే ఓ మలయాళం సినిమాలోనూ హీరోయిన్ గా చేస్తోంది త్రిష. సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇందులో హీరోగా చేస్తున్నారు. దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో సంయుక్తతో పాటు ఇంద్రజిత్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు

ప్రస్తుతం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఓటీటీలో ఈ రకం సినిమాలను చూసేవారు చాలా మంది ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రతి వారం ఓటీటీలో కనీసం రెండు, మూడు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు లేదా సిరీస్ లు స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. ఇతర భాషల్లోహిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు లేదా వెబ్ సిరీస్ లు కూడా ఆయా భాషల డబ్బింగ్ వెర్షన్ తో ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. అలా ఓటీటీ ఆడియెన్స్ ను అలరించేందుకు ఒక తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తోంది. థియేటర్లలో ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ను కూడా మెప్పించేందుకు వస్తోంది. ఆ సినిమా మరేదో కాదు అక్కినేని సుమంత్ నటించిన లేటెస్ట్ మూవీ న్యూటన్స్ థర్డ్ లా. 'ప్రతి చర్యకూ దానికి సమానమైన, వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది' అనే న్యూటన్ భౌతిక శాస్త్ర నియమాన్ని మానవ ప్రవర్తనకు, నేర ప్రపంచానికి ముడిపెడుతూ దర్శకుడు రాజేష్ కర్ణ ఈ సినిమాను తెరకెక్కించారు. సుమంత్ తో పాటు జగపతి బాబు, శ్రీనివాస్ అవసరాల తదితరులు ఈమూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. టీజర్స్, ట్రైలర్ తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా జులై 31న థియేటర్లలో రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. రొటీన్ క్రైమ్ కథలకు భిన్నంగా 'కర్మ' కాన్సెప్టును క్రైమ్ థ్రిల్లర్ కు జోడించి సినిమాను మలిచిన విధానం ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన న్యూటన్స్ థర్డ్ లా సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 27 నుంచి సుమంత్ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు రాబోతున్నాయి. రష్మిక మందన్నా కాక్ టెయిల్ 2, కంగనా రనౌత్ భారతభాగ్య విధాత, సునీల్ కాటాలన్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్.. ఇలా ఓవరాల్ గా అన్ని భాషల్లో కలిసి సుమారు 20 కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేయనున్నాయి. అయితే వీటి కంటే ముందే ఒక తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా థియేటర్లలో రిలీజైన మూడేళ్లకు. టాలీవుడ్ యంగ్ హీరో త్రిగుణ్, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ప్రేమదేశం. 2023 ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ప్రేమకథా చిత్రం ఓ మోస్తరుగా ఆడింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. సీనియర్ హీరోయిన్ రోజా ఫేమ్ మధుబాల ఈ మూవీలో ఒక కీలక పాత్ర పోషించడం విశేషం. కాగా ఈ ప్రేమ దేశం సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పుడు మరో ఓటీటీలోకి ఈ సినిమా వచ్చింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లోనూ ప్రేమ దేశం సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీకాంత్ సిద్ధం తెరకెక్కించిన ప్రేమదేశం సినిమాలో త్రిగుణ్, మేఘా ఆకాశ్లతో పాటు సీనియర్ నటి మధుబాల, అమర్దీప్ చౌదరి, మాయ, తనకెళ్ల భరణి, వైష్ణవి చైతన్య, వైవా హర్ష తదితరులు కీలకపాత్రలు పోషించారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ ప్రేమకథా చిత్రానికి సంగీతం అందించాడు. సిరి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై శిరీష్ సిద్ధం ప్రేమదేశం సినిమాను నిర్మించారు.ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. రెండు జంటల మధ్య సాగే ఎమోషనల్ జర్నీగా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రేమలో ఉన్నా చెప్పుకోలేకపోయిన ఒక జంట.. పెళ్లయినా ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోయిన మరో జంట.. వీళ్ల జీవితాలను ఓ చిన్న

Illu Illalu Pillalu August 10th Episode Review: ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి చీర సారె పెట్టి మొక్కాలని రామరాజు, భద్రావతి గడికి వెళతారు. పగతో రగిలిపోతున్న సేన .. రామరాజును మాటలతో రెచ్చగోడతాడు. ఎత్తుకు పై ఎత్తులు వేసే భద్రావతి ప్రేమను కంట్రోల్లో పెట్టుకుంటుంది. గుడిలో ధీరజ్ తో ప్రేమను కలపాలనే వేదవతి ప్లాన్‌ను అడ్డుకుంటుంది. ఇదీ ఇవాళ్టి ఎపిసోడ్ సంక్షిప్తంగా.. ఇక వివరాల్లోకి వెళితే.. స్పెషల్ క్లాస్‌కి వెళ్లాలి నేను గుడికి రాలేను అంటున్న ప్రేమను ఎలాగైనా ఒప్పించాలి .. గుడికి తీసుకెళ్లాలి అని అన్న విశ్వ ప్రయత్నిస్తుంటాడు. గుడి్కి వెళ్లడానికి భద్రావతి, రామరాజు రెడీ అవుతారు. ప్రేమ కాలేజీకి బయలుదేరుతుంది. రాత్రి మీ ఆయన నన్ను ఎగతాళి చేసాడు అని ప్రేమను రెచ్చగొడతాడు అన్న విశ్వ. ప్రేమ ఆవేశపడిపోయి ఏమన్నాడో చెప్పు అని నిలదీస్తుంది. నాతో మళ్లీ ప్రేమలో పడిపోతుందనే భయంతో రేపు మీ చెల్లెలు గుడికి రాదు. అని ఎగతాళి చేసాడు అంటాడు విశ్వా. ఎక్స్‌ట్రాలు చేస్తున్నాడు..అదంతా వాడి భ్రమ .. నేనేంటో చూపిస్తా.. గుడికి వస్తా అంటుంది ప్రేమ. [caption id="attachment_1884748" align="alignnone" width="1280"] Illu Illalu Pillalu Serial[/caption] రామరాజు కుటుంబం ఆటోలో.. భద్రావతి, సేన, ప్రేమ, కారులో దిగుతారు. ఫ్యామిలీ అంతా కట్టకట్టుకుని గుడికి దొంగ పెళ్లి చేయడానికి వచ్చారా ..మొక్కడానికి వచ్చారా.. అని సేన రామరాజుతో అంటాడు. డబ్బున్న అమ్మాయిని లేపుకెళ్లి గుడిలో పెళ్లి చేసుకోవడం.. అయ్య దగ్గర నుంచి కొడుకుల దాకా .. మీకు ఫ్యామిలీ బిజినెస్ కదా అంటాడు. దానికి ధీరజ్ ఏయ్ అంటూ వార్నింగ్ ఇస్తుంటే.. రెచ్చగొట్టేలా అరుపులు మాటలు మనకు వినిపిస్తాయి .. అవన్నీ పట్టించుకుంటే మన విలువ తగ్గుతుంది. ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి వెళదాం అంటాడు రామరాజు. ఎలాగోలా ప్రేమ, ధీరజ్‌ను కలపాలని అనుకుంటాడు విశ్వా. చెల్లిని ధీరజ్ వైపుకు బలంగా నెట్టి

ఈ సినిమాలో స్టార్ హీరోలు, హీరోయిన్స్ లేరు. భారీ బడ్జెట్ మూవీ కాదు. ప్రస్తుతం హిట్ ఫార్మలా అయిన అబ్బురపరిచే వీఎఫ్ఎక్స్, యాక్షన్ సీన్స్, స్పెషల్ సాంగ్స్ గట్రా కూడా ఏమీ లేవు. అయితేనేం కంటెంట్ తో దుమ్ము రేపుతోందీ సినిమా. థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ఈ న్యూ ఏజ్ లవ్ స్టోరీ ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. రికార్డు వ్యూయర్ షిప్ తో ఆహా ఓటీటీ ట్రెండింగ్ ఛార్ట్ లో అగ్రస్థానంలో దూసుకెళ్లుతోంది. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా? యంగ్ హీరో హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై జంటగా నటించిన ‘దీవాన’ సినిమా ఓటీటీలో సత్తా చాటుతోంది. ఇటీవల 'ఆహా'లో స్ట్రీమింగ్కి వచ్చిన ఈ సినిమా 100+ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌కు చేరుకుంది. ‘దీవాన’ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ మీద వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. జూన్ 19న థియేటర్లలో రిలీజైన దీవానా సినిమాకు సూపర్ హిట్ టాక్ రాకపోయినా డీసెంట్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచిగానే వసూళ్లు రాబట్టింది. అప్పటికీ పోటీగా రిలీజైన సమంత మా ఇంటి బంగారం సినిమాతో సమానంగా దీవానా సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ముఖ్యంగా యూత్ అయితే ఈ ప్రేమకథా చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. బిగ్ స్క్రీన్ పై ఆడియెన్స్ తో కన్నీళ్లు పెట్టించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. జులై 31 నుంచి స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను అధిగమించింది. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కారంపూడి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో హీరో, హీరోయిన్లతో పాటు నరేష్, ఝాన్సీ, రఘు కారుమంచి, వేణు తదితరులు ప్రధాన