
I Love You Text Mesage to Woman | మహిళకు ‘ఐ లవ్ యు’ మెసేజ్ పంపిన రాపిడో రైడర్.. ఫిర్యాదు చేసుకోమని సవాల్
I Love You Text Mesage to Woman | మహిళకు ‘ఐ లవ్ యు’ మెసేజ్ పంపిన రాపిడో రైడర్.. ఫిర్యాదు చేసుకోమని సవాల్

I Love You Text Mesage to Woman | మహిళకు ‘ఐ లవ్ యు’ మెసేజ్ పంపిన రాపిడో రైడర్.. ఫిర్యాదు చేసుకోమని సవాల్

Woman Held With 75 Litres Liquor | ట్రైన్ ఏసీ కోచ్‌లో.. 75 లీటర్ల మద్యంతో పట్టుబడిన మహిళ

మొన్న సాదిక్‌ఖాన్.. నేడు గౌస్ మోహిద్దీన్.. కాకినాడలో లవ్ జిహాద్ కేసులు కలకలం రేపుతున్నాయి. సాదిక్‌ఖాన్ అరాచకాలతో ఓ ఫ్యామిలీ బలైతే.. ఇప్పుడు గౌస్ మోహిద్దీన్ బాధితులు బయటకొచ్చారు. గౌస్ మొహిద్దీన్ అనే వ్యక్తి ప్రేమ, పెళ్లి పేరుతో మతం మార్చి మోసం చేశాడంటూ కాకినాడ ఎస్పీకి ఓ మహిళ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. కాకినాడ జిల్లాలో లవ్ జిహాద్ కేసులు పెరుగుతున్నాయి. సాదిక్‌ఖాన్ కేసు మరువక ముందే.. గౌస్ మొహిద్దీన్ కేసు తెరపైకి వచ్చింది. ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ గౌస్ మొహిద్దీన్ అనే వ్యక్తిపై బాల రమ్యశ్రీ అనే మహిళ కాకినాడ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జగన్నాధపురానికి చెందిన గౌస్ మొహిద్దీన్ తనను 8 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. ప్రేమ పేరుతో దగ్గరై, పెళ్లి చేసుకున్న తర్వాత.. మతం మార్చి చిత్రహింసలకు గురి చేశాడని కంప్లైంట్లో పేర్కొంది. ఒత్తిడి చేసి మతం మారేలా చేశాడని బాధితురాలు ఆరోపించింది. అంతేకాదు.. తనతో పాటు మరో ఐదుగురిని కూడా ఇలాగే మోసం చేసినట్టు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో లవ్ జిహాద్ల వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. ప్రేమ పేరుతో గౌస్ మొహిద్దీన్ పలువురు యువతులను మోసం చేశాడని బాధితురాలు తెలిపింది. ఒకరికి తెలియకుండా మరొకర్ని ట్రాప్ చేసి, వారితో సహజీవనం చేశాడని బాల రమ్యశ్రీ ఆరోపించింది. తనను ముస్లిం సంప్రదాయంలో వివాహం చేసుకున్న తర్వాత వేధింపులకు గురిచేశాడని వెల్లడించింది. ఎన్నోసార్లు తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. తనను.. తమ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గౌస్ మోహిద్దీన్‌పై ఇప్పటికే ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఆ కేసులో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నాడని.. ఇదే అదను భావించి తమ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చానని బాధితురాలు చెప్పింది. అయితే.. గౌస్ మొహిద్దీన్ నుంచి తనకు రక్షణ కల్పించి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాకినాడ ఎస్పీని కోరినట్టు తెలిపింది. “జలం… జీవం

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Thailand Bar Hair-shaving Video: సాధారణంగా రెస్టారెంట్లతో పాటు బార్లలో కడుపునిండా తిని.. పీకల లోతు దాకా తాగి బిల్లు కట్టకుండా తప్పించుకున్నారన్న వార్తలు మనం తరచుగా వింటూ ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదా వారిచేత అంట్లు తోమించడం లాంటి పనులు చేయిస్తూ ఉంటారు. కానీ థాయిలాండ్‌లోని బ్యాంకాక్ లో జరిగిన ఒక ఘటన మాత్రం అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. విపరీతంగా ఖర్చు చేసి బిల్లు కట్టలేక పోయిన ఒక ఒక యువతికి పబ్బు యాజమాన్యం ఏకంగా గుండు కొట్టించింది.. ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ గా మారింది.. దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.. అసలేమైందంటే.. ఆగస్టు 25వ తేదీన బ్యాంకాక్ లోని పినక్లావ్ (Pinklao) ప్రాంతంలో ఉన్న ఓ కాస్ట్లీ బార్లో 18 ఏళ్ల యువతి నకిలీ ఐడి కార్డుతో లోపలికి వెళ్ళింది.. అయితే, అక్కడ విపరీతంగా మందు తాగడంతో పాటు.. అక్కడికి డాన్సర్లకు కూడా ఖరీదైన డ్రింక్స్ ఇప్పించింది. అలా ఆ రాత్రి ఆమె చేసిన బిల్లు ఏకంగా భారత కరెన్సీలో 1.7 లక్షల రూపాయలు.. అంత భారీ మొత్తంలో వచ్చిన బిల్లును చూసి కంగు తిన్న ఆ యువతి.. డబ్బులు చెల్లించకుండా బార్ నుంచి మెల్లగా జారుకునే ప్రయత్నం చేసింది.. యువతి దొంగ చాటున పారిపోతుండగా గమనించిన భార సిబ్బంది.. ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.. పోలీసులకు అప్పగించాల్సిన యాజమాన్యం
వృద్ధురాలికి తమిళనాడు సీఎం విజయ్ గిఫ్ట్.. ఆమె ఫుల్ ఖుషీ తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్.. సాలేమ్ జిల్లా పర్యటనలో భాగంగా ఒక గ్రామీణ ప్రాంతంలో పర్యటించారు. కావేరి డెల్టా సాగు నీటి కోసం మెట్టూరు జలశాయం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అధికారిక కార్యక్రమం నిమిత్తం.. సీఎం విజయ్ సాలేమ్ వెళ్లారు. ఈ కార్యక్రమం అనంతరం సాలేమ్ విమానాశ్రయానికి తిరుగు పయనమవుతున్న సమయంలో.. మార్గమధ్యలో ఒక పొలం వద్ద.. కాన్వాయ్‌ను ఆపాలని సెక్యూరిటీకి సూచించారు. అలా దగ్గర్లోని పొలంలో పని చేసుకుంటున్న కొందరు మహిళల వద్దకు స్వయంగా కారు దిగి సీఎం విజయ్ వెళ్లారు. ఆ ప్రాంతానికి చెందిన చెల్లమ్ అనే వృద్ధురాలు ఆశ్చర్యంతో ముందుకు వచ్చి ఆయన చేయి పట్టుకున్నారు. "భోజనం చేశావా?" అని సీఎం విజయ్ ఆమెను ఆప్యాయంగా పలకరించగా.. మిమ్మల్ని చూడాలని అలాగే ఎదురుచూస్తున్నాను.. అందుకే ఇంకా తినలేదు అని ఆమె బదులిచ్చారు. ఈ వార్తకు సంబంధించిన

నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ! ఈ వార్తకు సంబంధించిన
పడుకునే ముందే తర్వాతి రోజు కోసం ప్లాన్ రెడీ చేసుకోండి. ఉదయాన్నే ఏ టిఫిన్ వండాలి, ఏ పని చేయాలో నిర్ణయించుకోండి. దీంతో సమయం ఆదా అవుతుంది. పనులు త్వరగా పూర్తి అవుతాయి. ఇంటి పనులు, ఆఫీస్ పనులను ముందుగానే విభజించుకోండి. ప్రతి పనికి ఒక నిర్ధిష్ట సమయం కేటాయించుకోండి. ఆ షెడ్యూల్ ప్రకారం పని చేయండి. మీరు చేయలేని పనులను మీకు అప్పగిస్తే నో చెప్పండి. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. మీరు చేయాల్సిన పనులు త్వరగా పూర్తి అవుతాయి. ఇంటి పనుల చేసేటప్పుడు కుటుంబ సభ్యుల సాయం తీసుకోండి. అన్ని పనులు నేనే చేయాలని అనుకోవద్దు. ఇతరుల సాయం తీసుకుంటే సమయం కలిసి వస్తుంది. ఆఫీస్‌లో లేదా ఇంట్లో చేయాల్సిన పనుల్లో ఒకే రకంగా ఉన్న పనులను ఒక సమూహంగా మార్చండి. వాటిని ఒకసారి పూర్తి చేయండి. దీంతో టైం కలిసి వస్తుంది. ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల సమయం వృథా అవుతుంది. పనులు చేసేటప్పుడు ఫోన్ నోటిఫికేషన్లు ఆఫ్ చేయండి. దీంతో ఏకాగ్రత పెరుగుతుంది. ఏదైనా ఒక పనిని పూర్తి చేయడానికి రెండు నిమిషాల కంటే తక్కువ సమయం పడితే ఆ పనిని వెంటనే పూర్తి చేయండి. ఆ పనిని వాయిదా వేయవద్దు. ఆఫీస్ పని, ఇంటి పని కోసం మాత్రమే కాకుండా మీ కోసం మీరు కొంత సమయాన్ని కేటాయించుకోండి. దీని వల్ల మీలో ఒత్తిడి తగ్గుతుంది. అన్ని పనులు పర్ఫెక్ట్గా పూర్తి కావాలని అనుకోవద్దు. ఇలా పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తే సమయానికి పనులు పూర్తి కావు. పర్ఫెక్షన్కు బదులుగా పురోగతిపై దృష్టి పెట్టండి

భారత వైమానిక దళంలో ఓ చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. నాన్-మెడికల్ విభాగంలో 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్‌ను సాధించిన మొదటి మహిళా అధికారిణిగా శక్తి శర్మ చరిత్ర సృష్టించారు. ఢిల్లీ, సెప్టెంబర్ 1: భారత వైమానిక దళంలో ఓ చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. నాన్-మెడికల్ విభాగంలో 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్‌ను సాధించిన మొదటి మహిళా అధికారిణిగా శక్తి శర్మ చరిత్ర సృష్టించారు. ఇవాళ ఆమె ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో 'అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ (ఎడ్యుకేషన్)'గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. IAFలో చేరిక: జూన్ 18, 1994న భారత వైమానిక దళానికి చెందిన ఎడ్యుకేషన్ బ్రాంచ్‌లో ఆమె అధికారిణిగా విధుల్లో చేరారు. దాదాపు ముప్పై ఏళ్లకు పైగా విశిష్ట సేవలు అందించిన ఆమె ట్రైనింగ్ సెంటర్లు, ఫీల్డ్ స్టేషన్లు, కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌తో పాటు ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో పలు కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. విద్యా రంగానికి ప్రాధాన్యం: ఐఐటీ కాన్పూర్, పుణె యూనివర్సిటీలలో డిఫెన్స్ సహకారాన్ని పెంచేలా 'IAF చైర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటు చేయడంలో శక్తి శర్మ ప్రముఖ పాత్ర పోషించారు. అంతేకాదు, సైనిక దళాల (Tri-services) చరిత్రలోనే ఒక సైనిక స్కూల్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా (కపూర్తలా సైనిక స్కూల్ ప్రిన్సిపాల్‌గా) వ్యవహరించిన తొలి మహిళా అధికారిణిగా కూడా ఆమె రికార్డు సాధించారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంతో ఎయిర్ వైస్ మార్షల్ శక్తి శర్మ సాధించిన ఈ ఘనత సాయుధ దళాల్లోని భావి మహిళా అధికారులకు స్ఫూర్తిదాయకం. పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు

Priya Adhikari : నేపాల్ లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఊహించని విపత్తు కారణంగా మృతుల సంఖ్య వెయ్యికిపైగా చేరింది.. వేలాది మంది ఆచూకీ గల్లంతు కాగా.. ఆ ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సహాయక చర్యల్లో భాగంగా ఓ మహిళా పైలట్ సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆమెనే.. నేపాల్ తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్‌గా గుర్తింపు పొందిన ప్రియా అధికారి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఆమె నేతృత్వంలో ఆరు రోజుల్లోనే సుమారు 100 రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టడం విశేషం. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, మట్టికొండలు విరిగిపడటంతో నేపాల్‌లో అనేక ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రహదారులు, వంతెనలు ధ్వంసం కావడంతో కొన్ని ప్రాంతాలకు రహదారి మార్గంలో చేరుకోవడం కష్టంగా మారింది. దీంతో హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో నేపాల్ తొలి మహిళా హెలికాప్టర్ పైలట్ ప్రియా అధికారి అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. ఆమె సారథ్యంలో రెస్క్యూ ఆపరేషన్లు చేస్తూ.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించి సురక్షితంగా ప్రాంతాలకు తరలిస్తున్నారు. అంతేకాక.. సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నవారికి అత్యవసర సహాయ సామగ్రిని చేరవేయడం వంటి కార్యకలాపాల్లో ఆమె ముందుండి పనిచేస్తున్నారు. నేపాల్‌లోని వరద ప్రభావిత రుసువా జిల్లాలోని తైమూర్ పట్టణం తీవ్రంగా దెబ్బతింది. ఇక్కడి బాధితులను రక్షించేందుకు దాదాపు 20 హెలికాప్టర్లు పనిచేస్తున్నాయి. ఆ ఆపరేషన్లలో ప్రియా అధికారి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. సవాళ్ల నడుమ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు. ఒక్కోసారి ఐదారు హెలికాప్టర్లు ఒకేచోట దిగుతున్నాయి. బాధితులను తరలించడానికి రేడియో ద్వారా సమన్వయం చేసుకుంటున్నాం. భారీగా బురద ఉన్న ప్రాంతంలో చాపర్లు దిగడం కష్టంగా మారుతోంది. దీంతో బాధితులను ఎక్కించడం ప్రమాదంతో కూడుకున్న పని.. ఆపరేషన్ కొనసాగుతున్నంత సేపు పైలట్లు చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సి
అమెరికాలో ఆరంకెల జీతం వచ్చే ఉద్యోగం, లాటరీలో లభించిన హెచ్-1బీ (H-1B) వీసా.. వీటన్నింటినీ వదులుకుని కుటుంబం కోసం ఓ భారతీయ యువతి స్వదేశానికి తిరిగొచ్చేశారు. కేవలం కుటుంబానికి దగ్గరగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు గురుగ్రామ్‌కు చెందిన 28 ఏళ్ల దిశా లంబా వెల్లడించారు. ఉన్నత విద్య కోసం 2021లో అమెరికాకు వెళ్లిన ఆమె.. న్యూయార్క్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం 'సివీఎస్ హెల్త్' (CVS Health) సంస్థలో డేటా సైంటిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టారు.'బిజినెస్ ఇన్సైడర్'తో మాట్లాడిన లంబా.. అమెరికాలో ఉండటం వల్ల తాను ఎంతో స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో మారగలిగానని చెప్పారు. అయితే, ఆ స్వేచ్ఛ వెనుక మాటల్లో చెప్పలేని ఒక వేదన ఉందన్నారు. ‘‘అమెరికాలో నాకు అద్భుతమైన జీవితం ఉంది. కానీ కుటుంబానికి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో మే 2026లో భారత్‌కు తిరిగిరావాలని నిర్ణయించుకున్నాను.. అలాగే హెచ్-1బీ వీసాలపై ఆంక్షలు నాకు నచ్చలేదు’’ అని లంబా తెలిపారు.అమెరికా నుంచి స్వదేశానికి‘‘నేను ఇండియాలో పుట్టి పెరిగాను.. నేను ఇంట్రోవర్ట్ కావడం వల్ల కంఫర్ట్‌గా ఉండే చోట ఉండటానికే ఇష్టపడేదాన్ని.. కానీ మా నాన్న నన్ను మాస్టర్స్ చదువు కోసం అమెరికాకు పంపించాలని కలలు కనేవారు... ఆయన స్నేహితుల పిల్లలు అమెరికా, యూకేలకు వెళ్లి ఉన్నతంగా ఎదిగారు.. నేను కూడా అలాగే కావాలని కోరుకున్నారు’’ అని ఆమె చెప్పారు. ‘‘పనిచేసే సంస్థ నా H-1B వీసాకు స్పాన్సర్ చేసింది.. నేను మార్చి 2026లో లాటరీలో ఎంపికయ్యానని నాకు తెలియజేశారు. అయితే, చివరికి భారతదేశానికి తిరిగి రావాలనేది నా ప్రణాళిక, ఆ సమయానికే నేను ఆ నిర్ణయం తీసుకున్నాను’’ అని ఆమె అన్నారు.‘‘సాయంత్రం 5 కాగానే రోజు ఎలా గడిచింది అని అడిగేందుకు పక్కన ఎవరూ ఉండేవారు కారు. నాకు స్నేహితులు ఉన్నారు, కానీ స్నేహితులు ఎప్పటికీ కుటుంబం కాలేరు. నా బెస్ట్ ఫ్రెండ్ అయిన మా అమ్మతో మాట్లాడటానికి టైమ్

హైదరాబాద్‌లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంపులో మహిళ మృతదేహం లభ్యమవడంతో కలకలం రేగింది. హైదరాబాద్, ఆగస్టు 22: నగరంలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంపులో మహిళ మృతదేహం లభ్యమవడంతో కలకలం రేగింది. మృతురాలు కమలమ్మగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మహిళ హత్య కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న శ్రీకృష్ణ హాట్ చిప్స్ యజమాని ప్రకాష్.. నగదు, బంగారు కమ్మల కోసం కమలమ్మను హత్య చేసినట్లు విచారణలో అంగీకరించాడు. కమలమ్మ జీతం తీసుకుని ఇంటికి వెళ్తుండగా ప్రకాష్ ఆమెను తన షాపులోకి పిలిచినట్లు పోలీసులు గుర్తించారు. కమలమ్మ షాపులోకి వెళ్లిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే షాపులోకి వెళ్లిన అనంతరం ఆమె బయటకు రాకపోవడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సీసీఫుటేజ్‌లో రికార్డైన దృశ్యాలను పరిశీలించడంతో పాటు దర్యాప్తు ముమ్మరం చేసి అసలు విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. కమలమ్మ వద్ద ఉన్న రూ.10 వేల నగదు, అర తులం బంగారు కమ్మల కోసమే ఈ హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఐటీ ఉద్యోగి మృతి విద్యార్థులే లక్ష్యంగా గంజాయి చాక్లెట్ల విక్రయం.. నలుగురి అరెస్ట్

భూపాలపల్లి జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. హెచ్ఐవీతో బాధపడుతున్న మహిళను అడవిలో వదిలేశారు. అక్కడ ఒంటరిగా ఉన్న సదరు మహిళను స్థానికులు గమనించి 108కి సమాచారం ఇచ్చారు. భూపాలపల్లి, ఆగస్టు 22: మానవత్వాన్ని మంటగలుపుతూ కన్నవారే కసాయివారిలా మారారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళను కుటుంబ సభ్యులే అడవిలో వదిలేశారు. ఈ అమానుష ఘటన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వెలుగు చూసింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన లలిత (35) హెచ్ఐవీతో బాధపడుతున్నారు. కరీంనగర్ ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్తామని చెప్పి కుటుంబ సభ్యులు ఆమెను మేడారం-కాటారం రహదారిలోని పెద్దవాగు సమీప అడవిలో వదిలేశారు. ఒంటరిగా ఉన్న లలితను అటుగా వెళ్తున్న స్థానికులు గమనించారు. ఆ వెంటనే 108కి సమాచారం అందించడంతో సిబ్బంది మహదేవపూర్ సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటనపై స్థానిక గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ఆదుకోవాల్సిన కుటుంబమే అలా ఒంటరిగా వదిలేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన బాధితురాలి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. మరింత పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే

Hanumakonda District : హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కారు నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు డిక్కీ ఓపెన్ చేసిచూడగా అందులో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వండంతో వారు ఘటన స్థలికి చేరుకొని విచారణ ప్రారంభించారు. విచారణలో భాగంగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన వివరాలను డీసీపీ దారా కవిత మీడియాకు వెల్లడించారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన వినోద్ కుమార్ కరీంనగర్లో ఉంటున్నాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన రాజేశం కుమార్తె అంకితి మానస (38) వివాహిత. ఆమెకు వినోద్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయంకాస్త కొన్నాళ్లకు వివాహేతర సంబంధానికి దారితీసింది. వారిద్దరూ కలిసి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒక గదిని అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నారు. కాగా.. సుమారు ఐదు రోజుల క్రితం మానస తన కుటుంబ సభ్యులకు, తండ్రికి తాను తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరుణాచలం వెళ్తున్నట్లు చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. అప్పటి నుంచి కరీంనగర్లో వినోద్ కుమార్ వద్దకు చేరుకుంది. వినోద్ కుమార్, మానస మధ్య ఈ నెల 19న తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన వినోద్ కుమార్ మానసను గొంతు నులిమి హత్య చేశాడు. ఆ హత్యను కప్పిపుచ్చేందుకు మానస మృతదేహాన్ని గుర్తుతెలియని ప్రాంతంలోకి తీసుకెళ్లిన ఖననం చేయాలని నిర్ణయించాడు. అయితే, ఎల్కతుర్తికి చెందిన తుంగళ్లపల్లి సురేందర్ అనే వ్యక్తి తన కారును సమ్మిరెడ్డి వద్ద రూ.2లక్షలకు తాకట్టు పెట్టాడు. ఆ కారు వినోద్ కుమార్ వద్ద ఉంది. అతనే వాడుతున్నాడు. మానస మృతదేహాన్ని ఆ కారు డిక్కీలో పడేసి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కరీంనగర్ నుంచి ఎల్కతుర్తికి చేరుకున్నాడు. ఎల్కతుర్తిలోని బస్టాండ్ సమీపంలో తన ఇంటి పరిసర ప్రాంతాల్లో కారును వినోద్ కుమార్ పార్క్

ఎల్కతుర్తి బస్టాండ్ సమీపంలో ఒక కారు రెండు రోజులుగా పార్క్ చేసి ఉండటాన్ని స్థానికులు గమనించారు. వాహనం నుంచి దుర్వాసన రావడంతో అనుమానం మరింత పెరిగింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారును పరిశీలించిన పోలీసులు డిక్కీ తెరిచి చూడగా అందులో మూటకట్టిన స్థితిలో మహిళ మృతదేహం కనిపించింది. కారు రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఆధారంగా చేసుకుని పోలీసులు దర్యాప్తు ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో మృతురాలు గోదావరిఖనికి చెందిన మానస (33)గా గుర్తించినట్లు సమాచారం. వాహనం మానసకు పరిచయమైన వినోద్ అనే వ్యక్తి అద్దెకు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. దీంతో అనుమానాలు వినోద్ వైపు మళ్లాయి. మృతదేహం లభ్యమైన విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసులు వినోద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మానసతో తనకు పరిచయం ఉందని, ఆమెతో కలిసి కరీంనగర్‌లోని ఓ గదిలో ఉన్న సమయంలో మానసకు ఫిట్స్ వచ్చి నోటి నుంచి నురగలు రావడంతో ఆమె మృతి చెందినట్లు వినోద్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. మానస మృతి చెందడంతో భయపడిపోయిన తాను మృతదేహాన్ని అక్కడే ఉంచకుండా కారులో తీసుకెళ్లి ఎల్కతుర్తి వద్ద వదిలి వెళ్లినట్లు వినోద్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వాంగ్మూలం నిజమేనా? ఘటనకు సంబంధించి మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై ఎల్కతుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మానస మృతి చెందిన పరిస్థితులు, ఆమె చివరిసారిగా ఎవరితో ఉంది, కారు ఎక్కడి నుంచి వచ్చింది, మృతదేహాన్ని ఎల్కతుర్తికి ఎందుకు తీసుకువచ్చారు వంటి అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. వినోద్ చెప్పిన విషయాలను ఇతర ఆధారాలతో సరిపోల్చే పనిలో ఉన్నారు. మృతదేహానికి సంబంధించిన వైద్య, ఫోరెన్సిక్ వివరాలు కూడా దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలు పోలీసుల విచారణలోనే తేలాల్సి ఉంది

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఒక సంచలనాత్మక ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఆలమూరులోని యూనియన్ బ్యాంక్ శాఖలో రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గానుగపెంట సుప్రియ (28) ఆకస్మికంగా అదృశ్యమవ్వడం ఇప్పుడు తీవ్ర మిస్టరీగా మారింది. విధి నిర్వహణలో ఉన్న యువతి ఒక్కసారిగా మాయమవ్వడం, ఆమె వస్తువులు పంట కాలువ వద్ద లభించడంతో కోనసీమ వ్యాప్తంగా ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.ఈనెల 17వ తేదీన ఎప్పటిలాగే విధులకు హాజరైన సుప్రియ, తన మొబైల్ ఫోన్‌ను బ్యాంక్‌లోనే వదిలిపెట్టి బయటకు వెళ్లిపోయింది. ఎంతసేపటికీ ఆమె తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన సిబ్బంది, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఆలమూరు మండలం చొప్పెల్ల లాకుల సమీపంలో సుప్రియకు చెందిన స్కూటీ, చెప్పులు, కళ్లజోడు పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. బ్యాంకులో విధుల్లో ఉన్న వ్యక్తి ఫోన్ కూడా తీసుకెళ్లకుండా, కేవలం తన వస్తువులను లాకుల వద్ద వదిలివెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. అమ్మాయిల అదృశ్యం వెనుక ఫ్రీ ఫైర్ గేమ్.. పేరెంట్స్ జాగ్రత్త!కాలువల్లో తీవ్రంగా గాలింపు.. రంగంలోకి ఎస్డీఆర్ఎఫ్ దళాలు!చొప్పెల్ల లాకుల వద్ద లభించిన ఆధారాల ఆధారంగా సుప్రియ పంట కాలువలో దూకి ఉంటే ఏమోనన్న ప్రాథమిక అనుమానంతో పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. మొదట స్థానిక గజ ఈతగాళ్లతో కాలువను జల్లెడ పట్టించినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. దీంతో ఘటన తీవ్రతను గుర్తించిన జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు ఎస్టీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు రెస్క్యూ ఆపరేషన్లోకి దిగాయి. రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్. విద్యాసాగర్, ఆలమూరు ఎస్సై నరేష్ ల పర్యవేక్షణలో చొప్పెల్ల లాకులకు అనుసంధానంగా ఉన్న అన్ని పంట కాలువల్లో అత్యాధునిక పరికరాలతో గాలింపు ముమ్మరం చేశారు.జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో ట్విస్ట్.. కారుపై మాట మార్చిన తాత! పోలీసులకు సవాల్‌గా మారిన

Ongole: ప్రకాశం జిల్లా ఒంగోలులో విషాద ఘటన చోటుచేసుకుంది. మార్కెట్ సెంటర్లోని సాయి సూర్య అపార్ట్మెంట్లో లిఫ్ట్ ప్రమాదానికి గురై 50 ఏళ్ల మహిళ మృతి చెందారు. మృతురాలిని వనితగా గుర్తించారు. లిఫ్ట్‌లో నుంచి బయటకు వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆమె ఫ్లోర్‌కు, లిఫ్ట్‌కు మధ్యలో ఇరుక్కుపోయారు. సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిన వివరాల ప్రకారం.. వనిత తన కుమార్తె, మనవడితో కలిసి లిఫ్ట్‌లో ఉన్నారు. కుమార్తె, మనవడు లిఫ్ట్ నుంచి బయటకు వచ్చారు. వారి వెంటే వనిత కూడా బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. లిఫ్ట్ తలుపులు పూర్తిగా మూసుకోకముందే ఒక్కసారిగా కిందికి పడిపోయింది. దీంతో వనిత లిఫ్ట్‌కు, ఫ్లోర్‌కు మధ్యలో ఇరుక్కుపోయారు. ప్రమాదాన్ని గమనించిన అపార్ట్మెంట్ వాసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను బయటకు తీశారు. తీవ్ర గాయాలైన ఆమెను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వనిత పరిస్థితి విషమించింది. అనంతరం ఆమె చికిత్స పొందుతూనే మృతి చెందింది. ఈ ప్రమాదం నేపథ్యంలో అపార్ట్మెంట్ లిఫ్ట్‌ల భద్రత, నిర్వహణపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా లిఫ్ట్ తలుపులు తెరిచి ఉన్న సమయంలో కిందికి పడిపోవడంతో ఎందుకు కిందికి కదిలిందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

ప్రకాశం జిల్లా ఒంగోలులో విషాద ఘటన చోటు చేసుకుంది. లిఫ్ట్, ఫ్లోర్ మధ్యలో ఇరుక్కుని 50 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రకాశం, ఆగస్టు 20: ఈ మధ్య కాలంలో లిఫ్ట్ ప్రమాదాలు అనేకం చోటు చేసుకున్నాయి. లిఫ్ట్‌లో ఇరుక్కుని కొంతమంది సురక్షితంగా బయటపడగా, మరికొంత మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. తాజాగా ప్రకాశం జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కూతురు, మనవడితో కలిసి లిఫ్ట్‌లో తమ ఫ్లోర్‌కు వెళ్లిన మహిళ.. లిఫ్ట్ ప్రమాదం బారిన పడి మృతిచెందారు. నిన్న(ఆదివారం) జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒంగోలు మార్కెట్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో వినీత(50) అనే మహిళ.. కూతురు, మనవడితో కలిసి లిఫ్ట్ ఎక్కారు. తమ ఫ్లోర్ రాగానే ముందుగా కూతురు, మనవడు బయటకు రాగా.. ఆ వెనకే వినీత కూడా బయటకు వస్తున్న సమయంలో తలుపులు తెరిచి ఉండగానే లిఫ్ట్ కిందకు కదలింది. దీంతో భయాందోళనకు గురైన మహిళ.. లిఫ్ట్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే లిఫ్ట్ కిందకు వెళ్లడంతో లిఫ్ట్, ఫోర్కు మధ్యలో ఇరుక్కుపోయారు. వెంటనే గమనించిన కూతురు.. తన తల్లిని రక్షించేందుకు ప్రయత్నించారు. విషయం తెలియగానే అపార్ట్మెంట్ వాసులు, ఇతరులు అక్కడకు చేరుకుని వినీతను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. ఈ సంఘటన అపార్ట్మెంట్ భవనాల్లో లిఫ్ట్ భద్రత, నిర్వహణపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లిఫ్ట్‌కు అవసరమైన అన్ని భద్రత, నిర్వహణ తనిఖీలు జరిగాయా.. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్‌లో షహజాద్ భట్టీ నెట్వర్క్ జాడలు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Anu rani meerut Madhya Pradesh sub inspector objectionable video: సమాజంలో పోలీసులను చాలా మంది గౌరవంగా చూస్తుంటారు. రాత్రింబవళ్లు ప్రజల కోసం తమ ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా డ్యూటీలు చేస్తారు. అందుకు చాలా మంది యువతీ, యువకులు పోలీసులు అవ్వాలని ఎంతో కష్టపడుతారు. ఇదంతా మనం చూస్తుంటాం. కానీ కొంత మంది పోలీసులు మాత్రం ఉద్యోగాలు వచ్చాక తమ పవిత్రమైన ఉద్యోగ ధర్మానికి మాయని మచ్చగా మారుతున్నారు. యూపీలోని మీరట్ లో లేడీ పోలీసు యవ్వారం ప్రస్తుతం డిపార్ట్ మెంట్ లో తీవ్రచర్చనీయాంశంగా మారింది. ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో లేడీ ఇన్స్పెక్టర్ ఘటన ప్రస్తుతం పోలీసు శాఖలో దుమారంగా మారింది. సోషల్ మీడియాలో తన నూడ్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తు క్యూఆర్ కోడ్ తో డబ్బులు వసూలు చేస్తుందని ఆరోపణలు మిన్నంటాయి. దీనిపై పోలీసులు ఇప్పటికే మహిళ ఇన్ స్పెక్టర్ యానీ కొల్లిస్ ను సస్పెండ్ చేశారు. ఆమె సోషల్ మీడియా ఖాతాలపై పోలీసులు విచారణ చేపట్టారు.మహిళా ఇన్స్పెక్టర్ అను స్వస్థలం ప్రయాగ్‌రాజ్ అని, ఆమె 2023 బ్యాచ్ సబ్-ఇన్స్పెక్టర్ గా గుర్తించారు. అంతే కాకుండా గతంలో బ్లాడ్రమ్ కేసు సౌరభ్ హత్య జరిగిన సమయంలో ఆమె ముస్కాన్ ను అరెస్ట్ చేసి మీడియా ముందు ఉంచారు. అను బ్రహ్మపురి పోలీస్ స్టేషన్లో పనిచేశారు. ఆ తర్వాత ఆమెను ఎస్ఎస్పి కార్యాలయానికి బదిలీ చేశారు. లేడీ సబ్-ఇన్స్పెక్టర్ యానీ కొల్లిస్ నెట్టింట చాలా యాక్టివ్ గా ఉంటారని ఆరోపణలు వస్తున్నాయి. డే అంతా పోలీసు జాబ్

ఆస్ట్రేలియాలో చదువుకుంటున్న ఓ భారతీయ యువతికి ఊహించని షాక్ తగిలింది. వేడి నీటి స్నానం కారణంగా ఆమెకు లక్ష రూపాయల ఫైన్ పడింది. ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాలో చదువుకుంటున్న ఓ భారతీయ యువతికి ఊహించని షాక్ తగిలింది. వేడి నీటి స్నానం కారణంగా ఆమెకు లక్ష రూపాయల ఫైన్ పడింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. భారత్‌కు చెందిన వామికా అనే యువతి ఆస్ట్రేలియాలో చదువుకుంటోంది. వామికా ఎప్పటిలాగే వేడి నీటి స్నానం చేసింది. అయితే, స్నానం చేస్తున్నపుడు బాత్రూములోని ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను ఆమె ఆఫ్ చేసింది. దీంతో వేడి నీటి కారణంగా ఏర్పడ్డ ఆవిరి బాత్రూము నుంచి బయటకు వెళ్లింది. బయట ఉన్న స్మోక్ డిటెక్టర్‌ను ఆవిరి కప్పేసింది. ఆవిరిని పొగగా భావించిన ఫైర్ అలారం ఒక్కసారిగా మోగటం మొదలెట్టింది. పోలీసులు ఫైర్ ఇంజిన్‌తో సహా ఆ ఇంటి దగ్గరకు వచ్చారు. ఇంటి దగ్గర అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సూచనలు లేకపోవటంతో.. యువతిని ఎంక్వైరీ చేశారు. ‘నాకు ఏమీ తెలీదు. అలారం మోగుతుంటే ఫైర్ డ్రిల్ అనుకున్నాను’ అని యువతి అధికారులతో చెప్పింది. అయితే, ఫైర్ అలారం మోగటానికి కారణమైనందుకు గాను యువతికి అధికారులు 1800 డాలర్ల ఫైన్( ట్యాక్స్‌లు అదనం) వేశారు. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ఆ మొత్తం 1.30 లక్షల రూపాయలు పైనే ఉంటుంది. తనకు ఎదురైన ఈ దారుణమైన అనుభవాన్ని యువతి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంది. 1800 డాలర్ల ఫైన్ పడినందుకు కంటతడి పెట్టుకుంది. యువతి పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది భారతీయులు విదేశాల్లో తమకు ఎదురైన అనుభవాలను పంచుకుంటున్నారు. తనకు కూడా ఫైర్ అలారం కారణంగా 1800 డాలర్ల ఫైన్ పడిందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వందేమాతరం వివాదం.. 1937 నాటి నిర్ణయానికే కట్టుబడి ఉంటామన్న కాంగ్రెస్.. అర్హులైన ఓటరు మిగలకూడదు
వివాహేతర సంబంధం ఓ కుటుంబంలో చిచ్చురేపింది. ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఓ మహిళ.. దీనిని చూసిన తన కన్న కొడుకును కూడా కడతేర్చింది. బంధువుల ఇంటికి వెళ్లి భోజనం చేసిన వచ్చిన తర్వాత ఊపిరాడక తన భర్త, కుమారుడు చనిపోయారని కట్టుకథ అల్లింది. చివరకు కుటుంబసభ్యుల అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. మానవత్వానికి మాయనిమచ్చలాంటి ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో చోటుచేసుకుంది. ఇద్దర్నీ హత్యచేసి సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన మహిళను, ఆమె ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల్లోకి వెళ్తే.. చిక్కబనవరకు చెందిన అభినందన్ (35), హరిణి (26) భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల కుమారుడు యదువీర్ ఉన్నాడు. కనకపుర తాలూకా హారోహళ్లికి చెందిన ప్రయివేట్ ఉద్యోగి వినయ్‌తో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన పరిచయం, వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసిన భర్త అభినందన్.. భార్యను మందలించాడు. దీనిపై ఇరువురి మధ్య పలుసార్లు గొడవ జరిగింది. ప్రవర్తన మార్చుకోకుంటే విడాకులు ఇస్తానని బెదిరించాడు. అయినా సరే ఆమె మారలేదు సరికదా.. భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలసి పథకం వేసింది.ఆదివారం రాత్రి అభినందన్ నిద్రపోయిన అనంతరం వినయ్‌ను రప్పించి తన ప్లాన్‌ను అమలు చేసింది. భర్త అభినందన్ కాళ్లను ఆమె పట్టుకోగా, తలపై కుక్కరుతో కొట్టి, గొంతు నులిమి వినయ్ హత్య చేశాడు. పెనుగులాటలో తండ్రి అరుపులు విని కుమారుడు యదువీర్ అక్కడకు వచ్చాడు. ప్రత్యక్షంగా తమ నేరాన్ని చూసిన చిన్నారి.. ఈ విషయాన్ని బయటపెడితే దొరికిపోతామని భావించిన ఇద్దరూ కలిసి గొంతును నులిమి ప్రాణాలు తీశారు. రక్తం మరకలు ఉన్న దుస్తులను మార్చి.. భర్త గుండెలపై కుమారుడ్ని నిద్రపుచ్చింది. భర్తే కొడుకును చంపి, ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేసింది.పథకం ప్రకారం ఇంటిలోని సీసీటీవీ కెమెరాను ఆఫ్ చేసి, ప్రియుడు వినయ్ వెళ్లిన అనంతరం ఆన్ చేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు పోలీస్

ప్రస్తుతకాలంలో వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలను కూల్చుతున్నాయి. భార్యాభర్తల మధ్య చిచ్చు రేపుతున్నాయి. వివిధ కారణాలతో ఇటీవలి కాలంలో వివాహేతర సంబధాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఉచ్చులో పడి నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలాగే వారి పిల్లల జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు. తాజాగా ఓ మహిళ.. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను.. కన్న కొడుకుని చంపింది. ఈ దారుణమైన ఘటన కర్ణాటకలోని బెంగుళూరులో జరిగింది.పోలీసులుతెలిపిన వివరాల ప్రకారం.. అభినందన్, హరిణికి 2021లో పెళ్లి జరిగింది. వీరికి ఓ కొడుకు ఉన్నాడు. అయితే 2024 లో హరిణికి స్నాప్ చాట్ ద్వారా వినయ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అది కాస్త ప్రేమగా మారడంతో.. వినయ్ తో హరిణి వివాహేతర సంబంధం కొనసాగించింది. అయితే ఇదే విషయంపై భార్యాభర్తలైన హరిణి, అభినందన్ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో హరిణి ఎఫైర్ ను బయటపెట్టేందుకు.. ఆమె కాల్ డేటా రికార్డ్ కోసం భర్త పోలీసుల్ని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలోనే తన ఎఫైర్ కు అడ్డుగా ఉన్న భర్తను చంపాలని వినయ్ తో కలిసి హరిణి ప్లాన్ వేసింది.అలా ఇటీవల ఆదివారం అర్థరాత్రి 12:30 గంటలకు.. అభినందన్ గదిలోకి వెళ్లారు వినయ్, హరిణి. అభినందన్ కాళ్లను హరిణి పట్టుకోగా.. గొంతు నులిమి వినయ్ అతడ్ని చంపేశాడు. అయితే శబ్దాలు రావడంతో.. కుమారుడు నిద్ర లేచి, ఈ ఉదంతం మొత్తం చూశాడు. దీంతో.. తమ బండారం బయటపడుతుందని, అతడ్ని కూడా చంపేశారు రాక్షసులు. ఆపై తన భర్తతో పాటు కొడుకు స్పందించడం లేదని హరిణి డ్రామాలు ఆడింది. వాళ్లు ఎలా చనిపోయారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అసలు నిజం బయటపడింది. వివాహేతర సంబంధం కోసం హరిణి తన ప్రియుడు వినయ్ తో కలిసి చంపిందని గుర్తించారు. దాంతో హరిణితో పాటు ఆమె ప్రియుడు వినయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

అద్దంకి ఆర్టీసీ బస్సులో ఓ మహిళను వేధించిన యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. ఒంగోలు నుంచి అద్దంకి వస్తున్న బస్సులో ఈ ఘటన జరిగింది. బాధితురాలు తన బంధువులకు సమాచారం ఇవ్వగా, బస్సు అద్దంకి బస్టాండ్‌కు చేరగానే వారు ఆ యువకుడిని పట్టుకొని చితకబాదారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు

అస్సాంలో 103 ఏళ్ల వృద్ధురాలు మానవత్వాన్ని చాటుకున్నారు. వరదలతో ఇబ్బందులు పడుతున్న 77 కుటుంబాలకు తన జీవితకాలంలో దాచుకున్న పొదుపు నుంచి రూ.1.54 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇంటర్నెట్ డెస్క్: అస్సాంలోని సోనిత్పూర్ జిల్లాకు చెందిన 103 ఏళ్ల కనకలతా దాస్ మానవత్వాన్ని చాటుకున్నారు. వరదలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబాలకు తన జీవితకాలంలో దాచుకున్న పొదుపు మొత్తాన్ని ఆర్థిక సాయంగా అందించారు. ఇటీవల వచ్చిన వరదల కారణంగా శివసాగర్ జిల్లాలోని అమ్గురి గార్డెన్ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న ఆమె, వారికి తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే శివసాగర్ జిల్లా కమిషనర్ కార్యాలయానికి వెళ్లిన కనకలతా దాస్.. వరద బాధితులైన 77 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.2,000 చొప్పున మొత్తం రూ.1.54 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఈ డబ్బును ఆమె చాలా ఏళ్లుగా దాచుకున్న తన సొంత పొదుపు నుంచే ఇచ్చారు. 103 ఏళ్ల వృద్ధురాలు చేసిన ఈ సాయం అక్కడి అధికారులను కూడా కదిలించింది. డిప్యూటీ కమిషనర్ మృదుల్ యాదవ్ ఆమె నుంచి విరాళాన్ని స్వీకరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. కనకలతా దాస్ చేసిన ఈ మంచి పని ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. వయసుతో సంబంధం లేకుండా అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలనే మానవత్వానికి ఆమె ఆదర్శంగా నిలిచారని పలువురు కొనియాడుతున్నారు. తన జీవితకాలంలో ఎంతో కష్టపడి దాచుకున్న పొదుపు మొత్తాన్ని సైతం వరద బాధితుల కోసం అందించి.. కనకలతా దాస్ సేవాభావం, దాతృత్వం, మానవత్వానికి ఆదర్శంగా నిలిచారు. బెంగళూరులో దారుణం.. భర్త, నాలుగేళ్ల కుమారుడి మృతి.. భార్యపై అనుమానం.. నేను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అమిత్ షా చిన్నపిల్లాడు: మల్లికార్జున ఖర్గే

హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందిందంటూ ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్, ఆగస్టు 18: నగరంలోని అత్తాపూర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందిందంటూ ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. శ్రీలత(28) అనే మహిళ.. జ్వరం కారణంగా నిన్న(సోమవారం) ప్రైవేటు హాస్పిటల్లో చేరింది. నిన్నటి నుంచి చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. అయితే రాత్రి పరిస్థితి విషమంగా ఉందంటూ ఐసీయూకు తరలించిన వైద్యులు.. ఆ తర్వాత శ్రీలత మృతి చెందినట్లు ప్రకటించారు. మహిళ మృతితో కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందంటూ బంధువులు ఆరోపించారు. మృతురాలి బంధువులు.. ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఆస్పత్రి వద్ద బందోబస్తు నిర్వహించారు. మృతురాలి బంధువులకు నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రెండో రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు మత్స్యకారుల గల్లంతు ఘటన.. గాలింపు చర్యలను ముమ్మరం చేయాలంటూ సీఎం ఆదేశాలు

బ్రిటన్‌లో నివసిస్తున్న ఒక భారతీయ మహిళ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. భారత్‌తో పోలిస్తే యూకేలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల ఉద్యోగం తర్వాత ఉండే జీవనశైలి ఎలా ఉంటుందో ఆమె వివరించారు. ఈ అంశంపై ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలతో నెటిజన్లు, ముఖ్యంగా భారతీయులు ఏకీభవిస్తున్నారు.అనుష్క వ్యాస్ అనే మహిళ ఒక సాధారణ పనిదినం రోజున సాయంత్రం తన ఇంటి సమీపంలోని పార్కులో ఈ వీడియో చిత్రీకరించారు. వారాంతాలు లేదా సెలవు దినాల్లో మాత్రమే కాకుండా, సాధారణ రోజుల్లోనూ ఇక్కడి ప్రజలు జీవితాన్ని ఎలా ఆస్వాదిస్తారో ఆమె చూపించారు. ఉద్యోగ బాధ్యతలు ముగించుకున్నాక ప్రజలు కుటుంబంతో కలిసి పార్కులో గడపడం, సరస్సుల వద్ద పిక్నిక్లు నిర్వహించడం, ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలను ఆమె ప్రస్తావించారు.ఇదే సందర్భంలో భారత్‌లోని పని సంస్కృతిపై ఆమె విశ్లేషించారు. మన దేశంలో 9 నుంచి 5 గంటల ఉద్యోగం తర్వాత ఇటువంటి ప్రశాంతమైన జీవనశైలిని ఊహించడం కష్టమని ఆమె పేర్కొన్నారు. ఆఫీసు పని ముగిశాక ట్రాఫిక్ ఇబ్బందులు, అదనపు పని ఒత్తిడి వంటి కారణాల వల్ల ఇంటికి చేరుకునేసరికి తీవ్రంగా అలసిపోతామని తెలిపారు. దీంతో కేవలం వారాంతాల కోసమే ఎదురుచూడాల్సి వస్తుందని, ఆ సెలవు రోజులు కూడా వారం మొత్తం పడిన శ్రమ నుంచి కోలుకోవడానికే సరిపోతాయని అనుష్క వ్యాఖ్యానించారు.డబ్బు, ఉద్యోగ అవకాశాలతో పాటు జీవన నాణ్యత కూడా ముఖ్యమని, అందుకే చాలా మంది భారతీయులు విదేశాల

ఓ మహిళకు తెలియకుండా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి చెందిన జవాన్ ఫొటోలు తీయడం కలకలం రేపింది. మహిళ సహా తోటి ప్రయాణికులు ఆ జవానును ప్రశ్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. న్యూఢిల్లీ: ఓ మహిళకు తెలియకుండా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(CISF)కి చెందిన జవాన్ ఫొటోలు తీయడం కలకలం రేపింది. మహిళ సహా తోటి ప్రయాణికులు ఆ జవానును ప్రశ్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారి మధ్య వాగ్వాదం కాస్తా తోపులాట, ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటన ఢిల్లీ మెట్రో రైలులో జరగ్గా.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శనివారం అర్ధరాత్రి ఢిల్లీ మెట్రోలో ఓ మహిళ ప్రయాణిస్తోంది. సీఐఎస్ఎఫ్ జవాన్ కూడా అదే రైలులో ఉన్నాడు. అయితే, మహిళకు తెలియకుండా ఆమె ఫొటోలను అతను తీశాడు. ఇది గమనించిన ప్రయాణికురాలు.. జవాన్ వద్దకు వెళ్లి నిలదీసింది. తన ఫొటోలు ఎందుకు తీస్తున్నావని ప్రశ్నించింది. మహిళతో పాటు తోటి ప్రయాణికులూ సదరు వ్యక్తిని నిలదీశారు. తాను ఫొటోలు తీయలేదని జవాన్ గట్టిగా వాదించాడు. అయితే ఫోన్లోని ఫొటో గ్యాలరీని చూపించాలని వారంతా డిమాండ్ చేశారు. ఇందుకు తొలుత అతను ఒప్పుకోకపోవడంతో.. తర్వాత చూపించక తప్పని పరిస్థితి ఎదురైంది. మహిళకు సంబంధించిన చిత్రాలు ఫోన్లో కనిపించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. మహిళ తన ఫొటోలను తొలగించాలని డిమాండ్ చేయగా.. కొంతమంది ప్రయాణికులు అతని చేతిలోని ఫోన్‌ను తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న జవానును వెంటనే సస్పెండ్ చేశారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఫొటోలు తీసినట్లు తేలితే తగిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. కాగా, ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందినప్పటికీ.. బాధితురాలు అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. ఎలుగుబంటికి

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Vande Bharat Moulali Incident: తల్లిదండ్రులతో కలిసి సాగిన ఆ సంతోషకరమైన ప్రయాణం క్షణాల వ్యవధిలోనే తీరని విషాదంగా మారింది. గమ్యస్థానానికి చేరుకున్న వెంటనే జరిగిన అనూహ్య ప్రమాదం ఓ యువతి ప్రాణాలను బలితీసుకుంది. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ సమీపంలోని మౌలాలిలో చోటుచేసుకున్న ఈ రైలు దుర్ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అసలేం జరిగింది? తెలంగాణలోని జనగాంకు చెందిన 20 ఏళ్ల మానేపల్లి మానస వృత్తిరీత్యా నర్సుగా పనిచేస్తున్నారు. ఆదివారం (ఆగస్టు 16న) మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆమె తన తల్లిదండ్రులతో కలిసి గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి మౌలాలి చేరుకున్నారు. మౌలాలి రైల్వే ఎల్సీ గేట్ నంబర్-6 సమీపంలోని అప్‌లైన్ వద్ద రైలు దిగిన మానస.. ప్లాట్‌ఫామ్ మారేందుకు పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అదే సమయంలో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు అతివేగంగా వస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఆమెను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మానస తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కళ్లముందే కుమార్తె విగతజీవిగా పడిపోవడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు వర్ణనాతీతం. రైల్వే పోలీసుల దర్యాప్తు గోల్కొండ ఎక్స్‌ప్రెస్ నుంచి దిగిన మానస రైలు పట్టాలు దాటడానికి కారణం ఏమిటి? వందేభారత్ వస్తున్న విషయాన్ని ఆమె గమనించలేదా? అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై సికింద్రాబాద్ రైల్వే పోలీసులు క్రైమ్ నంబర్ 418/2026 కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రాథమికంగా ఇది ప్రమాదవశాత్తు జరిగినట్లు భావిస్తున్నప్పటికీ, అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నారు. అనారోగ్యంతో

ఈ రోజుల్లో కార్పొరేట్ జాబ్ చేసే చాలామంది ఏదైనా సొంతంగా స్టార్ట్ చేయాలని ఉద్యోగానికి రాజీనామా చేస్తుంటారు. ఇలాంటి కోవకు చెందిన ఒక మహిళ.. తాను ఎందుకు 9-5 ఉద్యోగాన్ని వదిలేసిందో వెల్లడించింది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డిజిటల్ క్రియేటర్ అయిన అర్పిత సాహు, ఇన్స్టాగ్రామ్ వీడియోలో.. చిన్నప్పటి నుంచి బాగా చదవాలి, మంచి డిగ్రీ తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, బాగా డబ్బు సంపాదిస్తూ బాధ్యతగా జీవించాలి అనే ఆలోచనతోనే ముందుకు సాగింది. కానీ.. కొంతకాలంగా తాను కోరుకునే జీవితం ఇదేనా అనే ప్రశ్న ఆమెను వెంటాడిందట. దీంతో ఇక తన కోసం కొంత సమయం కేటాయించుకోవాలని నిర్ణయించుకుంది. ఉద్యోగం వదిలేయడం అంత ఈజీగా ఏమీ అనిపించలేదని అర్పితా వెల్లడించింది. స్థిరమైన ఉద్యోగాన్ని వదిలిన తర్వాత ఏం జరుగుతుందో తెలియక కొంత భయంగా ఉందని, అదే సమయంలో కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నాననే ఉత్సాహం కూడా ఉందని తెలిపింది. ఇన్నాళ్లూ ఇతరులు తన నుంచి ఏం ఆశించారో అదే చేస్తూ వచ్చానని, ఇప్పుడు మాత్రం తన మనసు ఏం కోరుకుంటుందో తెలుసుకోవడానికి తనకు తానే ఒక అవకాశం ఇచ్చుకున్నానని చెప్పింది. అర్పితా నిర్ణయంపై సోషల్ మీడియాలో చాలామంది స్పందించారు. కొందరు మాత్రం ఉద్యోగం వదిలేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు రావచ్చని, కెరీర్లో గ్యాప్ ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ.. ఎక్కువ మంది మాత్రం ఆమె తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. తన మానసిక ప్రశాంతత, వ్యక్తిగత ఎదుగుదలకు ప్రాధాన్యం ఇస్తూ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం ధైర్యమైన విషయమని పలువురు కామెంట్లు చేశారు. భర్త బర్త్‌డే.. క్యూట్ ఫొటోలు షేర్ చేసిన కరీనా (ఫొటోలు) నల్లని చీర.. ఎర్రటి పూలు.. అందంగా రాశీ (ఫొటోలు) 'ఇరుముడి'లో రవితేజ కూతురిగా చేసిన పాప ఎవరో తెలుసా? (ఫొటోలు) అమ్మ చీరలో త్రిష.. ఇది చాలా స్పెషల్ (ఫొటోలు)
మూడు దశాబ్దాల కిందట ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇంట్లో వాళ్లని ఎదురించి మరీ వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు కుమార్తెలు. భర్తేమో కేబుల్ నెట్‌వర్క్‌లో పనిచేస్తుండగా.. భార్య అంగన్వాడీ కార్యకర్త. అయితే, పెళ్లైన ముప్పై ఏళ్ల తర్వాత ఆ కుటుంబంలో అనుమానం పెనుభూతంగా మారింది. తన భర్తకు మరో మహిళతో సంబంధం ఉందన్న అనుమానంతో పీక కోసి హత్య చేసి, ఆ తర్వాత అతని తల దగ్గర దీపం పెట్టి ఆ భార్య పోలీసులకు లొంగిపోయింది. ఈ ఘటన చోడవరంలో చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చోడవరం రామ్మోహనరావుపేట సమీపంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన కొండ్ల ఇందిర, వెంకటరావు (58) దంపతులు. వీరికి నలుగురు కుమార్తెలు కాగా ఒకరికి వివాహమైంది. శనివారం రోజు అనకాపల్లిలో ఉన్న కుమార్తె ఇంటికి వెళ్లొచ్చాక భార్యభర్తల మధ్య గొడవ మొదలైంది. ఒకరిపై మరొకరు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇందిరకు పట్టరాని కోపం రావడంతో అక్కడే ఉన్న కత్తి తీసుకుని భర్త వెంకటరావు పీక కోసేసి చంపేసింది. అనంతరం తల వద్ద దీపం పెట్టి పోలీసుల ఎదుట ఆమే లొంగిపోయింది.READ ALSO మెడికో ప్రియాంక మృతి కేసులో కీలక పరిణామం.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ పాటిల్కొండ్ల ఇందిర అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తూ అందరితో బాగుండేది. ప్రతి ఒక్కరికీ తెలిసిన మహిళ.. ఆరోగ్యం, సామాజిక అంశాలపై అవగాహన కూడా కలిగి ఉండేది. అలాంటి మహిళ స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఇలా చేయడంతో స్థానికులంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అసలు విషయం తెలుసుకోవడానికి కన్న కూతుర్లను కూడా విచారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.ఇందిర, వెంకటరావు స్థానికులే కావడంతో ముప్పై ఏళ్ల కిందట ఇద్దరి మధ్య ప్రేమ వికసించింది. అప్పట్లో వీరి వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో పోలీసులను ఆశ్రయించి మరీ పెళ్లి చేసుకున్నారు. అలాంటి జంట ఇలా అవ్వడంతో

MLA Daughter Slaps Woman SI : ఎమ్మెల్యే కుమార్తె మహిళా ఎస్ఐ చెంపపై కొట్టిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో తీవ్ర వివాదంకు దారితీసింది. మండ్య జిల్లాలోని శ్రీరంగపట్నం తాలూకాలోని అరతి ఉక్కాడ ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమకూరు రూరల్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ గౌడ కుమార్తె ఐశ్యర్య మండ్య మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ బి. సబిత పై చేయిచేసుకుంది. భీమన అమావాస్యను పురస్కరించుకొని మాండ్య సమీపంలోని ‘ఆరతి ఉక్కడ’లో అహల్యాదేవి ఆలయానికి ఎమ్మెల్యే కుమార్తె ఐశ్వర్య గత బుధవారం వెళ్లింది. వీఐపీ దర్శన మార్గంలో వెళ్తూ.. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ తో గొడవ జరిగింది. అక్కడే ఉన్న సీఐ లక్ష్మీ ఆమెను వారిస్తున్న సమయంలోనే ఎస్ఐ సవిత చెంపపై కొట్టింది. దీంతో మహిళా ఎస్ఐ క్యాతనహళ్లి పోలీస్ స్టేషన్ లో ఐశ్వర్యపై బుధవారం రాత్రి 12గంటల సమయంలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. దీంతో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు.. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఎమ్మెల్యే బీఎస్ సురేశ్ గౌడ కుమార్తె ఐశ్వర్య సైతం పోలీస్ స్టేషన్ కు వెళ్లి మహిళా ఎస్ఐ పై ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై ఎమ్మెల్యే బీఎస్ సురేశ్ గౌడ స్పందిస్తూ.. తన కుమార్తెను పోలీసు అధికారిణి దూషించారని , ఆలయ గర్భగుడిలోకి వెళ్లేందుకు తన కుమార్తె అనుమతి కోరిందని, పోలీసులు ఆమెను అనుమతించలేదని తెలిపారు. ఈ సమయంలో స్వల్ప ఘర్షణ చోటు చేసుకోవటంతో దురదృష్టకర ఘటన జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు. తొలుత తన కుమార్తెను పోలీసు అధికారి దూషించినట్లు తెలిసిందని, ఆ తరువాతే గొడవ జరిగిందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. తన కుమార్తె ఎస్ఐను చెంపదెబ్బ కొట్టిన వీడియోను తాను చకూడలేదని, నిజంగా అలా జరిగి ఉంటే తాను మహిళా ఎస్ఐకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. ఇదిలాఉంటే ఐశ్వర్య

హైదరాబాద్: విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ మహిళను సినీ నిర్మాత బొమ్మకు మురళికి చెందిన కారు ఢీ కొనడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన బుధవారం రాత్రి అబిడ్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ పరుశురామ్ తెలిపిన మేరకు.. నాంపల్లి ఆండాలమ్మబాడ ప్రాంతానికి చెందిన సునీత గన్‌ఫౌండ్రీలోని ఎస్బీఐలో హౌస్ కీపింగ్‌గా పనిచేస్తోంది. బుధవారం రాత్రి ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా అబిడ్స్ చాపల్ రోడ్డు వద్ద ఎదురుగా రోడ్డుపై నిలిచి ఉన్న కారు ఒక్కసారిగా అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె కాలు విరిగి తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ మహానందను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. డ్రైవర్‌ను చంపుకోండి: నిర్మాత మురళి బాధితురాలి వైద్యానికి అవసరమైన ఖర్చు భరించాలని స్థానికులు డ్రైవర్‌ను కోరారు. అయితే తాను కేవలం డ్రైవర్మాత్రమేనని.. యజమాని అయిన ప్రొడ్యూసర్ బొమ్మకు మురళితో మాట్లాడాలని సమాధానం చెప్పాడు. దీంతో వారు నిర్మాతతో మాట్లాడారు. అయితే అతను.. డ్రైవర్‌నే డబ్బులు అడగాలని, తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనకు చెప్పకుండా కారు బయటకు తీసుకెళ్లాడని.. కావాలంటే మీరు చంపుకోండి.. పోలీస్ కేసు పెట్టుకోండి అని అన్నారు. తాను ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని దురుసుగా మాట్లాడాడు. ఇదిలా ఉండగా నిర్మాత భార్యను షాపింగ్ కోసం తీసుకువచ్చి కారును రోడ్డుపైనే ఆపి నిద్రపోయాడు. ప్రొడ్యూసర్ భార్య డ్రైవర్‌కు ఫోన్ చేయడంతో ఒక్కసారిగా నిద్రలేచి కారును స్టార్ట్ చేయగా మహిళను ఢీకొట్టినట్లు విచారణలో తేలిందని ఇన్స్పెక్టర్ పరశురామ్ తెలిపారు. హీరో శర్వానంద్ 'జార్జ్ క్రిష్' మూవీ ప్రారంభం (ఫొటోలు) ‘అమీర్ లోగ్’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ (ఫొటోలు) 'ప్యార్ ప్రేమ కళ్యాణం'మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు) కర్నూలులో వైఎస్ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు) సొల్లు కబుర్లు ఎందుకు...? దమ్ముంటే నిరూపించు మామయ్య..! బోండా ఉమాకు ఇచ్చిపడేసిన పేర్ని

పసిబిడ్డ తెలియక చేసిన చిన్న పనికి.. బిచ్చగత్తె అయిన పిల్లాడి తల్లిని చెప్పుతో కొట్టాడో దుర్మార్గుడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇంటర్నెట్ డెస్క్: పసిబిడ్డ తెలియక చేసిన చిన్న పనికి.. బిచ్చగత్తె అయిన పిల్లాడి తల్లిని చెప్పుతో కొట్టాడో దుర్మార్గుడు. పంజాబ్‌లోని కాపుర్తలాలోని ప్రసిద్ధ మాతా శ్రీ భద్రకాళి ఆలయ ద్వారం వెలుపల బిక్షాటన చేస్తున్న మహిళపై జరగిన ఈ దాడి.. స్థానికంగా తీవ్ర ప్రజాగ్రహాన్ని రేకెత్తించింది. ఆ మహిళతో ఉన్న పసిబిడ్డ అక్కడ నిలిపి ఉంచిన మోటార్‌సైకిల్‌ను తాకడమే ఈ వివాదానికి కారణమైంది. ఈ చిన్న కారణంతో ఆగ్రహానికి గురైన బైకు యజమాని.. ఆ పిల్లాడి తల్లిని కిందకు తోసి తన చెప్పుతో విచక్షణారహితంగా కొట్టాడు. అటుగా వెళ్తున్న భక్తులు జోక్యం చేసుకుని ఆమెను రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ.. నిందితుడు మళ్లీ వచ్చి ఆమెను కాలితో తన్నాడు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలు తీవ్ర భయాందోళనకు గురై మొదట పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు. అయితే, వీడియో వైరల్ కావడంతో మహిళా కమిషన్, మానవ హక్కుల కమిటీలు ఈ ఘటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనేక వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. ప్రజల ఆగ్రహం, మానవ హక్కుల సంఘాల జోక్యంతో పోలీసులు సుమోటోగా స్వీకరించారు. దాడికి పాల్పడిన నిందితుడిని వికాస్ శర్మగా అధికారులు గుర్తించారు. అతనిపై బీఎన్ఎస్ నిబంధనల కింద సంబంధిత సెక్షన్లతో ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం

బెంగళూరు నగరంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఓ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షాప్ మూసుకుని ఇంటికి వెళ్తున్న ఓ మహిళను బైక్‌పై వచ్చిన దుండగులు టార్గెట్ చేశారు. ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరు నగరంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఓ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షాప్ మూసుకుని ఇంటికి వెళ్తున్న ఓ మహిళను బైక్‌పై వచ్చిన దుండగులు టార్గెట్ చేశారు. ఆమెను కిందపడేసి, మెడలోని 25 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. ఈ ఘటన దొడ్డబిదరకల్లు ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి (Bengaluru Chain Snatching). బాధితురాలు విజయమ్మ దొడ్డబిదరకల్లు ప్రాంతంలో పాల దుకాణం నిర్వహిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున ఐదు గంటలకు దుకాణాన్ని మూసివేసి ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ఆ సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై దాడి చేశారు. ఆమె మెడలో ఉన్న మంగళసూత్రాన్ని లాక్కున్నారు. దుండగులు లాగడంతో విజయమ్మ కిందపడిపోయారు. సహాయం కోసం గట్టిగా కేకలు వేశారు. అయితే తెల్లవారుజాము కావడంతో చుట్టు పక్కల ఎవరూ లేరు (Bengaluru Crime News). ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది (25 Gram Gold Chain). బైక్‌పై వచ్చిన వ్యక్తులు మహిళను అడ్డుకుని దాడి చేసి, నగలతో పరారవుతున్న దృశ్యాలు కనిపించాయి. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మావోయిస్టు క్యాంప్ నుంచి మోడలింగ్ ర్యాంప్ వరకు.. మారిన మాజీ మహిళా నక్సల్స్ జీవితాలు.. మీరు చేయలేకపోతే మేమే చేస్తాం.. లేబుల్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు హెచ్చరిక

భర్తను హత్య చేసేందుకు ఓ మహిళ సినిమా రేంజ్లో చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి, ఆపై ఇంటి వెనుక పాతిపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ముంబై: భర్తను హత్య చేసేందుకు ఓ మహిళ సినిమా రేంజ్లో చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి, ఆపై ఇంటి వెనుక పాతిపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు నెట్టింట వైరల్‌గా మారాయి. భర్తలను హత్య చేసిన మహిళల ఉదంతాలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతున్న వేళ, తాజా ఘటన ప్రకంపనలు రేపుతోంది. కట్టుకున్న వాడిని హతమార్చేందుకు భార్య చేసిన ప్రయత్నాలు చూసి అంతా నివ్వెరపోతున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని బారామతిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని బారామతిలో షర్మిలా ప్రవీణ్ జగ్తాప్ అనే మహిళ తన భర్త ప్రవీణ్ జగ్తాప్ను హత్య చేసేందుకు ప్లాన్ వేసింది. జులై 30న జ్యూస్‌లో నిద్రమాత్రలు కలిపి భర్త, అత్తకు ఇచ్చింది. జ్యూస్ తాగిన వారిద్దరూ రెండు రోజుల పాటు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆగస్టు 1న బాధితుడికి కొంచెం మెలకువ వచ్చింది. అది గ్రహించిన షర్మిల.. అతడిని బ్యాట్‌తో దారుణంగా కొట్టింది. అనంతరం లాక్కెళ్లి, ఇంటి వెనుక అప్పటికే ఇటుకలతో కట్టించిన గుంతలో పడేసింది. భర్త కనిపించకుండా ఆ గుంతపై పెద్ద చెక్కను పెట్టింది. కూలీలను పిలిపించి ఆ గుంతను పూడ్చేందుకు ప్రయత్నించింది. కూలీలకు అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు, కుమారుడు ప్రవీణ్ జగ్తాప్ను బ్యాట్‌తో కొడుతున్న సమయంలోనే తల్లికీ స్పృహ వచ్చింది. వెంటనే తన పెద్ద కుమారుడికి ఫోన్ చేసింది. దీంతో బాధితుడి అన్న, పోలీసులు వచ్చి అతడిని రక్షించారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం షర్మిలను అరెస్టు చేశారు. అయితే, పూర్తి స్పృహలోకి వచ్చిన ప్రవీణ్ జగ్తాప్ కీలక విషయాలు వెల్లడించాడు. 'నా భార్య నాకు నిద్రమాత్రలు ఇచ్చింది. మూడో రోజు

హైదరాబాద్ అబిడ్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. విధులు ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న మహిళపైకి కారు దూసుకెళ్లడంతో ఆమె తీవ్రంగా గాయపడింది.. హైదరాబాద్, ఆగస్టు 13: నగరంలోని అబిడ్స్‌లో బుధవారం మధ్యాహ్నం ఓ కారు బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న ఓ మహిళను కారు ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వివరాల ప్రకారం.. గన్‌ఫౌండ్రీ ఎస్బీఐ బ్యాంకులో హౌస్‌కీపింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న సునీత.. విధులు ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో సినిమా నిర్మాత డ్రైవర్ మహానంద నడుపుతున్న కారు ఒక్కసారిగా ఆమెపైకి దూసుకెళ్లినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదంలో సునీత కాలుకు ఫ్రాక్చర్ కావడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు యజమాని.. ఫిల్మ్ ప్రొడ్యూసర్ బొమ్మకు మురళి యజమాని అని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన అనంతరం ఆయనకు ఫోన్ చేసి సునీత చికిత్సకు అయ్యే ఖర్చులను భరించాలని కోరినట్లు చెప్పారు. అయితే డబ్బులు ఇవ్వనని దురుసుగా సమాధానం ఇచ్చినట్లు వారు వాపోయారు. వారి ఫిర్యాదు మేరకు.. అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో గది అద్దెలకు కళ్లెం.. పార్లమెంటరీ ఆరోగ్య కమిటీ కీలక సిఫారసు.. రాహుల్ గాంధీ పక్కనున్న వారెవరు.. కేంద్ర మంత్రి ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం ఏంటంటే

డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న ఓ మహిళ ప్రమాదానికి గురైంది. డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 42 ఏళ్ల సుమిత్ర దాస్ మృతి చెందారు. ఇంటర్నెట్ డెస్క్: డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న ఓ మహిళ ప్రమాదానికి గురైంది. డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 42 ఏళ్ల సుమిత్ర దాస్ మృతి చెందారు. ఈ ఘటన కోల్‌కతాలోని కేస్టోపూర్లోని ప్రఫుల్ల కనన్ ప్రాంతంలో బుధవారం జరిగింది (Kolkata Woman Car Accident). పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమిత్ర దాస్ తన కుమార్తెను పాఠశాలలో దించి స్కూటర్‌పై ఇంటికి తిరిగి వచ్చారు. స్కూటర్‌ను ఇంటి వద్ద ఉంచి, ఇటీవల భర్త కొనుగోలు చేసిన హ్యుందాయ్ ఈయాన్ కారును బయటకు తీశారు. ఆమెకు డ్రైవింగ్‌లో ఇంకా పూర్తిస్థాయి అనుభవం లేదు. ఆగస్టు 22న డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష ఉండటంతో దాని కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో కారు ఒక్కసారిగా అదుపుతప్పి సమీపంలోని చెరువులోకి దూసుకెళ్లింది (Kolkata Pond Accident). బ్రేక్‌కు బదులుగా పొరపాటున యాక్సిలరేటర్‌ను తొక్కడంతో కారు వేగంగా చెరువు మధ్యలోకి దూసుకెళ్లింది (Driving Practice Accident). కారు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు గంటకు పైగా సాగిన సహాయక చర్యల అనంతరం కారును చెరువు నుంచి బయటకు తీశారు. అప్పటికే సుమిత్ర మృతి చెందారు. సుమిత్ర మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు జేపీసీకి.. విపక్షాల నిరసనల మధ్య కీలక పరిణామం.. భారత్‌పై వంద శాతం సుంకాలు.. ట్రంప్, మోదీ పరిష్కరించుకుంటారు: అమెరికా ప్రతినిధి

రష్యాలో అతిపెద్ద ఆన్లైన్ వాణిజ్య సంస్థ అయిన 'వైల్డ్‌బెర్రీస్'కు చెందిన పలు గిడ్డంగులపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేయడంతో భారీగా నష్టం వాటిల్లింది. ఈ పరిణామం సంస్థ వ్యవస్థాపకురాలు, రష్యాలో అత్యంత సంపన్న మహిళగా పేరున్న టట్యానా కిమ్‌కు పెద్ద సవాలుగా మారింది. ఇంటర్నెట్ డెస్క్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ ప్రభావం రష్యాలోని కీలక వాణిజ్య సంస్థలపై కూడా తీవ్రంగా పడుతోంది. రష్యాలో అతిపెద్ద ఆన్లైన్ వాణిజ్య సంస్థ అయిన 'వైల్డ్‌బెర్రీస్'కు చెందిన పలు గిడ్డంగులపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేయడంతో భారీగా నష్టం వాటిల్లింది. ఈ పరిణామం సంస్థ వ్యవస్థాపకురాలు, రష్యాలో అత్యంత సంపన్న మహిళగా పేరున్న టట్యానా కిమ్‌కు పెద్ద సవాలుగా మారింది (Tatyana Kim Wildberries). ఉక్రెయిన్ డ్రోన్ దాడుల్లో వైల్డ్‌బెర్రీస్‌కు చెందిన కీలక సరఫరా, నిల్వ కేంద్రాలు దెబ్బతిన్నాయి. రష్యా వ్యాప్తంగా ఉన్న సంస్థ లాజిస్టిక్స్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు జరిగినట్లు సమాచారం. దీంతో సంస్థ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. అలాగే వైల్డ్‌బెర్రీస్‌పై ఆధారపడే వేలాది మంది వ్యాపారులపై కూడా ప్రభావం పడింది. దాడుల కారణంగా పలు గిడ్డంగుల్లో నిల్వ ఉన్న వస్తువులు ధ్వంసమయ్యాయి. దీంతో చిన్న, మధ్య తరహా వ్యాపారులు తమ సరుకును కోల్పోయారు. ఆర్డర్ల పంపిణీలో జాప్యం ఏర్పడటంతో వినియోగదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు (Ukraine Drone Attack). వైల్డ్‌బెర్రీస్ గిడ్డంగులు రష్యా యుద్ధానికి అవసరమైన వస్తువుల సరఫరాలో ఉపయోగపడుతున్నాయని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది (Wildberries Warehouses). అందువల్ల వాటిని లక్ష్యాలుగా చేసుకున్నామని చెబుతోంది. అయితే రష్యా ఈ వాదనను తిరస్కరిస్తోంది. ఇవి పౌర వాణిజ్య మౌలిక వసతులని, వాటిపై దాడులు చేయడం వల్ల సాధారణ వ్యాపారులు, వినియోగదారులే నష్టపోతున్నారని తెలిపింది. ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు జేపీసీకి.. విపక్షాల నిరసనల మధ్య కీలక పరిణామం.. భారత్‌పై వంద శాతం సుంకాలు.. ట్రంప్, మోదీ పరిష్కరించుకుంటారు: అమెరికా ప్రతినిధి

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Kerala vlogger Akhil nrd wife megha elopes with conductor: కేరళలో చోటు చేసుకున్న అఖిల్ ఎన్ ఆర్ డీ, మేఘా దంపతుల ఘటన సోషల్ మీడియాలో కాకరేపుతుంది. తొలుత మర్చంట్ నేవీలో పనిచేసే అఖిల్ ఆతర్వాత దాన్ని వదిలేసి యూట్యూబర్ గా సెటిల్ అయ్యాడు. అతనికి సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఫాలోవింగ్ ఉంది. అదే సోషల్ మీడియా వేదికగా మేఘా అనేక యువతి పరిచయం అయ్యింది. అది కాస్త కొన్ని రోజులకు ప్రేమగా మారింది. ఆతర్వాత 2024 లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అఖిల్, మేఘాలు ఇద్దరు సోషల్ మీడియాలో వీడియోలు, రీల్స్ చేస్తు నెట్టింట హల్ చల్ చేస్తుంటారు. అయితే పెళ్లయిన తర్వాత కొన్ని నెలల తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది. భర్త అఖిల్ పై మేఘాకు అనుమానం కల్గింది. అతని అఫైర్ లు ఉన్నాయని తరచుగా భర్తపై అనుమానం పడేది. ఇద్దరి మధ్యఇది కాస్త రచ్చగా మారింది.ఆ తర్వాత మేఘ కాలేజీ చేస్తానంటే భర్త అఖిల్ ఆమెను జాయిన్ చేశాడు. అప్పటికే ఆమె బ్యాచిలర్ ఆఫ్ లా చేసింది. ఇంతలో ఆమెకు రోజు బస్సులో ప్రయాణించే కండక్టర్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారినట్లు చెబుతున్నారు. భర్తతో తరచుగా గొడవలు దీంతో మేఘ కండక్టర్ కు దగ్గరైంది. ఇటీవల అతనికి ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో మేఘా సైతం తన ఇన్ స్టాలో భర్తపై వేధింపులు ఆరోపణలు చేస్తు ఒక వీడియో పోస్ట్ చేసిందని ఆ తర్వాత
వాళ్లిద్దరికీ 12 ఏళ్ల కిందట వివాహమైంది. ఓ కొడుకు కూడా పుట్టాడు. కానీ.. పెళ్లయిన ఐదేళ్ల తర్వాత భార్యభర్తల మధ్య వివాదాలు మొదలయ్యాయి. అవికాస్తా పెద్దవి కావడంతో భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత భర్త తన కొడుకు కోసం వచ్చాడు. కొడుకును తనతో పంపించాలంటూ గొడవ చేశాడు. అత్తమామలు, బావమరిది ఒప్పుకోకపోవడంతో చేసేదేం లేక ఇంటికెళ్లాడు. ఒకరోజు భార్య బస్టాండ్‌లో కనిపించడంతో పుట్టింటి దగ్గర వదిలిపెడతానని చెప్పి బైక్ ఎక్కించుకుని దారి మధ్యలో బండరాయితో మోదీ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వెలిగండ్ల మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వెంకటేశ్వర్లు, దొనకొండ మండలం చందవరానికి చెందిన రమణమ్మకు పన్నెండేళ్ల కిందట వివాహమైంది. కొడుకు పుట్టిన తర్వాత భార్యభర్తల మధ్య వివాదాలు వచ్చాయి. దాంతో రమణమ్మ కొడుకును తీసుకుని పుట్టిల్లయిన దొనకొండ మండలం చందవరానికి వెళ్లింది.READ ALSO Tirumal శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానంటూ స్కామ్.. సస్పెండైన టీటీడీ ఉద్యోగి అరెస్టుఈ క్రమంలోనే ఆమె మానసిక సమస్యతో బాధపడుతూ గుంటూరు వైద్యశాలలో చికిత్స తీసుకుంటుంటుంది. కొంతకాలంగా ఆమె వైద్యం తీసుకుంటూ కొడుకుతోనే పుట్టింటిలో ఉంటోంది. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్లు జూన్ 30న చందవరానికి వెళ్లి కుమారుడిని తన వద్దకు పంపించాలని అత్తమామలను అడిగాడు. వారి ఒప్పుకోకపోవడంతో భార్య, అత్తమామలు, బావమరిదితో గొడవకు దిగాడు. కుమారుడిని పంపించకపోతే ఎంతకైనా తెగిస్తానంటూ హెచ్చరించి వెళ్లిపోయాడు.ఆగస్టు 4వ తేదీన రమణమ్మ కనిగిరి బస్టాండ్ వద్ద ఉండటంతో.. వెంకటేశ్వర్లు ఆమె దగ్గరకు వెళ్లాడు. తనను పుట్టింటిలో వదిలిపెడతానని బైక్ ఎక్కించుకున్నాడు. బైక్‌పై కనిగిరి నుంచి చందవరం తీసుకెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో కల్లూరు వద్ద భార్యను బండరాయితో మోదీ హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆమె ఎలా చనిపోయింది అన్న కోణంలో దర్యాప్తు చేసి కురిచేడు మండలం

Anantapur: పెళ్లైన నెల రోజులకే నవవధువును రోకలిబండతో మోది చంపిన భర్త Anantapur: అనంతపురంలో దారుణం వెలుగుచూసింది. పెళ్ళైన నెల రోజులకే నవవధువు దారుణ హత్యకు గురైంది. భర్తే కాలయముడై భార్య తలపై రోకలిబండతో మోది ప్రాణాలు తీసిన ఘటన అనంతపురంలోని ఎల్లమ్మ కాలనీలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గుంటూరు ప్రాంతానికి చెందిన శాంతి(26)కి, శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం పోతుకుంట గ్రామానికి చెందిన మహేష్(33)కు నెల రోజుల క్రితం పెళ్లైంది. మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన వీరికి పెద్దలు వివాహం జరిపించారు. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన మహేష్, నెల రోజుల క్రితమే భార్య శాంతితో కలసి అనంతపురంలోని ఎల్లమ్మ కాలనీకి వచ్చి అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డిఎస్పి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వన్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు తెరిచి చూడగా, శాంతి రక్తం మడుగులో శవమై కనిపించింది. తలపై రోకలిబండతో బాది హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దారుణం రెండు రోజుల క్రితమే జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కొత్తగా పెళ్ళైన ఈ దంపతుల మధ్య ఏవైనా మనస్పర్థలు, వివాదాలు తలెత్తాయా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతం నిందితుడు మహేష్ పరారీలో ఉన్నాడు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఒకటవ పట్టణ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు
కర్నూలులో 2023 మార్చి 14న జరిగిన జంట హత్యలు అప్పట్లో పెద్ద సంచలనంగా మారాయి. పెళ్లయిన 14 రోజులకే భార్య, అత్తని వరుడు కుటుంబం కలిసి హత్య చేసింది. ఈ కేసు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాట్లాడుకుందామని పిలిచి ఓ అపార్ట్మెంట్లో పక్కా ప్లాన్‌తో ఈ హత్యలకు పాల్పడ్డారు. ఈ కేసుపై హై కోర్టు తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది. ఈ జంట హత్యల కేసులో తండ్రీకొడుకులకు విచారణ కోర్టు మరణశిక్ష విధించింది. ఆ కేసు హైకోర్టుకు చేరడంతో మరణ శిక్షను తప్పించి క్షమాభిక్షకు వీలులేకుండా జీవితాంతం కఠిన కారాగార శిక్ష విధించింది.ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆసక్తికరంగా మారింది. మరణ శిక్ష విధించడానికి ఈ కేసు అత్యంత అరుదైనది కాదని స్పష్టం చేసింది. మరణ శిక్ష విధించే ముందు నేర తీవ్రతను మాత్రమే కాకుండా, నిందితుల స్థితిగతులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. శిక్షించడానికంటే ముందు నేరస్థుల్లో పరివర్తన తీసుకురావడానికి క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ ప్రాధాన్యం ఇస్తుందని గుర్తు చేసింది.గతంలో వారిపై నేర చరిత్ర లేదని గుర్తు చేసిన హైకోర్టు.. ఇద్దర్ని హత్య చేసి దారుణమైన నేరానికి పాల్పడినప్పటికీ నేరస్థుల్లో పరివర్తన రావడానికి అవకాశం ఉందని పేర్కొంది. సమాజానికి వారు ముప్పుగా మారతారని చెప్పేందుకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఈ కేసులో తండ్రీకొడుకులతో పాటు మూడో నిందితురాలిగా ఉన్న తల్లికి దిగువ కోర్టు విధించిన జీవిత కారాగార శిక్షణు హైకోర్టు కొట్టేసి, ఆమెను నిర్దోషిగా ప్రకటించి విడుదల చేయాలని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.సురేష్ రెడ్డి, జస్టిస్ హరిహరనాథ శర్మలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.READ ALSO Tirumal శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానంటూ స్కామ్.. సస్పెండైన టీటీడీ ఉద్యోగి అరెస్టుఈ కేసు వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. కర్నూలులోని చింతలమునినగర్‌కు చెందిన నారపురం వరప్రసాద్, కృష్ణవేణి దంపతుల కుమారుడైన శ్రావణ్ కుమార్‌కు 2023

మాజీ టెన్నిస్ క్రీడాకారిణి, మాజీ ఐపీఎస్ అధికారిణి డాక్టర్ కిరణ్ బేడీ ఏ విషయాన్ని అయినా చాలా ముక్కుసూటిగా నిష్కపటంగా చెబుతుంటారు. మహిళల సమస్యల విషయానికి వస్తే, ఆమె ఏమాత్రం భయపడకుండా, సాంప్రదాయాలను సవాలు చేసేలా..చాలా సూటిగా మాట్లాడతారు. నెల రోజుల క్రితం అభిషేక్ వ్యాస్‌తో జరిగిన ఒక పాడ్‌కాస్ట్‌లో, భారతీయ మహిళలకు వివాహం ఎలాంటిదో చాలా ఓపెన్‌గా చెప్పారు. ప్రతి ఆడపిల్ల ఆ విషయంలో ఎందుకు ఫెయిల్ అవుతుందో కూడా మాట్లాడారు. మరి అవేంటో చూద్దామా..! పెళ్లి చాలా అందంగా ఉంటుంది, పెళ్లి ఊరేగింపు అట్టహాసంగా, వైభవంగా ఉంటుంది అంతే..అని అన్నారు. ఎందుకంటే అప్పటి వరకు ఆ మహిళకు చాలా సురక్షితమైన, ప్రేమగా, అండగా నిలిచే ఇంటిని వెళ్లిపోవాల్సి వస్తుంది కాబట్టి అది ఆమెకు 'మానసిక క్షోభే' అని నర్మగర్భంగా చెప్పారామె. అంతేగాదు ఒక మహిళ తన పుట్టింటిని విడిచి వెళ్లడమే కాకుండా, తన అత్తమామలను కూడా సొంత తల్లిదండ్రుల్లా చూడాలని ఆశిస్తారని, ఇది చాలా హాస్యాస్పదమైనదని అన్నారు. ఎందుకంటే అది ఆచరణ సాధ్యమైనది కాదని తేల్చి చెప్పారు. అసలు ఎవరైనా ఏదో ఒక మహిళను 'అమ్మా' అని పిలవగలరా? అది అసలు సాధ్యమేనా అని నిలదీశారు. వాస్తవం ఏంటంటే అసలు ఎవరూ అలా చేయలేరు, కానీ పెళ్లైన భారతీయ మహిళపై అలా చేయమని ఒత్తిడి చేస్తుంటారని అన్నారు. కొత్తగా పెళ్లయిన మహిళ తన భర్త ఇంటి వాతావరణం ఎలా ఉన్నా సరే, దానికి అనుగుణంగా సర్దుకుపోవాల్సి ఉంటుందని అన్నారు. ఎందుకంటే పెళ్లి అన్న రెండు అక్షరాలతో ఆమె ఇంటికి 'యజమాని'గా మారుతుంది కాబట్టి అని అన్నారు. అయినా ఒక మహిళ గృహిణిగా ఉండాలనుకుంటుందా లేదా అనే విషయాన్ని కుటుంబాలు అసలు ఆలోచించవని అన్నారు. ఒకవేళ వివాహిత ఉద్యోగం చేస్తుంటే, ఇంటి పనుల కోసం సహాయకులను (domestic help) నియమించుకోవచ్చని ఆమె సూచించారు. వివాహానికి ముందే జంటలు ఈ విషయం గురించి ఎందుకు
హిందూ సంప్రదాయం ప్రకారం తనకు అంత్యక్రియలు నిర్వహించి, అస్థికలను భారత్‌లోని పవిత్ర నదిలో నిమజ్జనం చేయాలన్న భర్త చివరి కోరికను నెరవేర్చడానికి ఒక జపాన్ మహిళ వేల కిలోమీటర్లు ప్రయాణించింది. ఉత్తరాఖండ్‌లోని బాఘేశ్వర్కు చేరుకున్న ఆమె.. తన భర్త అస్థికలను పవిత్ర సరయూ నదిలో నిమజ్జనం చేసి, ఆయన కోరికను ఘనంగా నెరవేర్చింది. జపాన్‌కు చెందిన మియాకో అనే మహిళ, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక సంప్రదాయాలపై గాఢమైన ఆసక్తిని పెంచుకున్న అమెరికాలో జన్మించిన తన భర్త రాబర్ట్ అవశేషాలను తీసుకుని బాఘేశ్వర్కు చేరుకున్నారు.తన జీవిత కాలంలో రాబర్ట్.. తన అంత్యక్రియలు మరియు అస్థికల నిమజ్జనం (హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాల అవశేషాలను పవిత్ర నదిలో కలపడం) ఉత్తరాఖండ్‌లోని బాఘేశ్వర్ ఉన్న బాగ్నాథ్ ధామ్‌లో జరగాలని కోరుకున్నారు. స్థానిక గైడ్లు, పురోహితుల సహాయంతో మియాకో బాఘేశ్వర్లోని సరయూ, గోమతి నదుల సంగమ ప్రాంతానికి చేరుకున్నారు. రాబర్ట్ ఆత్మ శాంతి కోసం స్థానిక పూజారుల సహాయంతో నదీతీరంలో సాంప్రదాయ వైదిక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయన అస్థికలను సరయూ నదిలో నిమజ్జనం చేశారు.భారతీయ సంస్కృతి, హిందూ సంప్రదాయాలు, ఆధ్యాత్మికతపై రాబర్ట్‌కు ఎంతో గౌరవం ఉందని, తన చివరి కోరికను ఆయన భార్యకు స్పష్టంగా తెలియజేశారని మియాకోకు సహకరించిన స్థానిక గైడ్ తెలిపారు. భర్త ఎంతగానో గౌరవించే సంప్రదాయాల ప్రకారం ఆయన చివరి కోరిక నెరవేరేలా చూడటానికే మియాకో జపాన్ నుంచి బాఘేశ్వర్కు వచ్చినట్లు వెల్లడించారు. ఘాట్ల వద్ద ఉన్న స్థానికులు, తీర్థయాత్రలకు వచ్చిన భక్తులు ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించారు. భర్త చివరి కోరికను గౌరవించడానికి జపాన్ నుంచి ఉత్తరాఖండ్‌కు వచ్చిన మియాకో నిర్ణయాన్ని పలువురు ప్రశంసించారు.శివునికి అంకితం చేసిన పురాతన బాఘేశ్వర్లోని ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన బాగ్నాథ్ ఆలయం సమీపంలో ఈ కార్యక్రమం జరిగింది. సరయూ, గోమతి నదుల సంగమ స్థానంలో ఉన్న బాఘేశ్వర్, ఉత్తరాఖండ్‌లో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా ఉంది

మహిళా ఎస్ఐపై అసభ్యకర ప్రవర్తన కేసులో వైసీపీ నేత చింతాడ రవి కుమార్ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. ఘటన జరిగిన తొమ్మిది రోజుల తర్వాత రవి కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం, ఆగస్టు 10: మహిళా ఎస్ఐపై అసభ్యకర ప్రవర్తన కేసులో వైసీపీ నేత చింతాడ రవి కుమార్ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. ఘటన జరిగిన తొమ్మిది రోజుల తర్వాత రవి కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల శ్రీకాకుళంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఓ మహిళా ఎస్ఐ పట్ల రవి కుమార్ అనుచితంగా ప్రవర్తించడంతో పాటు దాడి చేశారంటూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో అరెస్ట్ భయంతో వైసీపీ నేత పరారయ్యారు. దాదాపు 9 రోజుల్లో ఎనిమిది ప్రాంతాలకు వెళ్లినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. 24 సిమ్ కార్డులు, 21 మొబైల్ ఫోన్లు ఉపయోగించినట్లు పోలీసులు చెబుతున్నారు. విజయనగరం, బెంగళూరు, విజయవాడ, ఒడిస్సా, అరకు ప్రాంతాల్లో మకాం వేశారు. అరకు నుంచి శ్రీకాకుళంవైపు కారులో వస్తుండగా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వద్ద రవిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా ఎందుకు పరారయ్యారని పోలీసులు ప్రశ్నించగా.. తాను ఇంట్లోనే ఉన్నానంటూ వైసీపీ నేత సమాధానం ఇచ్చారు. అయితే పారిపోయినట్లు పోలీసులు.. వీడియోలు, సాక్ష్యాలు చూపించడంతో రవికుమార్ మౌనంగా ఉండిపోయినట్లు సమాచారం. మిగిలిపోయిన అర్హులకూ ‘నేతన్నల సేవలో’ పథకం కింద ఆర్థిక సాయం: మంత్రి సవిత ఈ జీవోకు, ఫార్చ్యూన్ ఇండియా కథనానికి సంబంధం లేదు: ఏపీ ప్రభుత్వం క్లారిటీ

హైదరాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న మహిళా డ్రగ్ సప్లయర్‌ను ఈగల్ టీమ్ అరెస్ట్ చేసింది. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి ఎల్బీనగర్ పరిసరాల్లో విక్రయిస్తున్న సునీతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన బంధువు లక్కన్‌తో కలిసి సునీత గంజాయి సిండికేట్ నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. లక్కన్ వద్ద కిలో గంజాయిని రూ.3,500కు కొనుగోలు చేస్తున్న సునీత.. ఎల్బీనగర్కు చెందిన మరో సప్లయర్ సత్యకు అదే గంజాయిని కిలో రూ.14 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఎల్బీనగర్లో గంజాయి డ్రాప్ చేసేందుకు సునీత వచ్చిన సమయంలో ఈగల్ టీమ్ పక్కా సమాచారంతో దాడి చేసి ఆమెను పట్టుకుంది. ఈ కేసులో సునీతతో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి మొత్తం 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్‌లోకి సరఫరా చేస్తున్న నెట్‌వర్క్‌పై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ స్మగ్లింగ్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ఈగల్ టీమ్ విచారణలో గంజాయి సరఫరా చేసే ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఒడిశా నుంచి తక్కువ ధరకు గంజాయిని తీసుకొచ్చి.. హైదరాబాద్‌లోని డ్రగ్ సప్లయర్లకు అధిక ధరకు విక్రయిస్తూ సునీత, లక్కన్లు డబ్బులు సంపాదిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ముందుగా ఒడిస్సా నుండి ఆటోలో భద్రాచలం వరకు వచ్చి అక్కడి నుండి బస్సులో హైదరాబాద్ లోని ఎల్బీనగర్ చేరుకుంటుంది.. అయితే.. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉందా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గంజాయి సరఫరా కోసం నిందితులు ప్రత్యేకంగా డ్రాప్ పాయింట్లను ఎంచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎల్బీనగర్లో సత్యకు గంజాయి అందించేందుకు సునీత వచ్చిన సమయంలో ఈగల్ టీమ్ పక్కా సమాచారంతో నిఘా పెట్టి పట్టుకుంది. ఆమెతో పాటు ఉన్న మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని

రీల్స్ పిచ్చితో ఓ మహిళ తన చంటిబిడ్డ ప్రాణాలను ప్రమాదంలో పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు మహిళపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ డెస్క్: రీల్స్ పిచ్చితో ఓ మహిళ తన చంటిబిడ్డ ప్రాణాలను ప్రమాదంలో పెట్టింది. ఉత్తర భారత దేశానికి చెందిన ఓ మహిళ రీల్స్ కోసం తన బిడ్డను రోడ్డుపై వదిలేసింది. రోడ్డుమీద ఆమె డ్యాన్స్ చేస్తుండగా.. చిన్నారి పాక్కుంటూ రేలింగ్ దగ్గరకు వచ్చింది. రేలింగ్ సందులో దూరే ప్రయత్నం చేసింది. అలా జరిగి ఉంటే పాప బ్రిడ్జిపై నుంచి నీటిలో పడిపోయేది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి పరుగున చిన్నారి దగ్గరకు వచ్చాడు. చిన్నారిని వెంటనే అక్కడినుంచి పక్కకు తీసుకువచ్చాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? ఆమె ఎవరు? అన్నది తెలియరాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు మహిళపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘రీల్స్ అంటే అంత పిచ్చి ఉంటే.. పెళ్లి చేసుకోవటం ఎందుకు? పిల్లల్ని కనటం ఎందుకు? కొంచెం కూడా బాధ్యత లేదు’.. ‘ఛీ ఇలాంటి వాళ్ల వల్లే పిల్లలు దారుణంగా తయారు అవుతున్నారు’..‘కొన్ని లైక్స్ కోసం.. వ్యూస్ కోసం కన్నబిడ్డ ప్రాణాలను రిస్క్‌లో పెడతావా? నువ్వసలు తల్లివేనా’..‘దీన్నే కొంతమంది సెల్ఫ్ లవ్ అని చెప్పుకుని తిరుగుతున్నారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు

బందోబస్తు విధుల్లో ఉన్న మహిళా ఎస్సై పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసులో ఆమదాలవలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్‌కు శ్రీకాకుళం జిల్లా కోర్టు రిమాండ్ విధించింది. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టు ఆదేశాల మేరకు వారిని అంపోలు జైలుకు తరలించారు.వివరాల్లోకి వెళితే.. ఇటీవల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బందోబస్తు విధుల్లో ఉన్న బూర్జ మహిళా ఎస్సై ప్రవల్లికతో చింతాడ రవికుమార్‌తో పాటు పలువురు వైసీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. విధి నిర్వహణకు ఆటంకం కలిగించడంతో పాటు ఎస్సై పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా చింతాడ రవికుమార్‌తో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. తాజాగా ఆయనను, మరో ఇద్దరిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్‌కు ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 14 మంది నిందితులకు కోర్టు రిమాండ్ విధించినట్లు పోలీసులు వెల్లడించారు
ప్రేమకు మనన్సు తప్ప ఏదీ చూడదని మరోసారి నిరూపించారు ఈ జంట. ఆ ఇద్దరిది ఒక ప్రాంతం కాదు, ఒక రాష్ట్రం కాదు.. ఒక దేశం కూడా కాదు. కానీ, ఆ ఇద్దరి మనస్సులు కలిశాయి. అలా అనీ ఎక్కడో ఒక చోటు పెళ్లి చేసుకుని ఉండిపోలేదు. తల్లిదండ్రులను ఒప్పించుకున్నారు. వారి మతాచారంలోనే సంప్రదాయంగా వివాహం చేసుకున్నారు. ఎల్లలు దాటిని వీరి ప్రేమగాథ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.తణుకు ప్రాంతానికి చెందిన సిర్రా బ్రహ్మయ్య కుమారుడు జానకి రామ్ పాల్ నాలుగేళ్ల కిందట రష్యా వెళ్లాడు. అక్కడ బైబిల్ కోర్సులో శిక్షణ పొందాడు. ఆ సమయంలోనే రష్యాలో డానిలోవా అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా, స్నేహం కాస్తా ప్రేమగా మారింది. దాంతో వారిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.READ ALSO ఏడో నెలలోనే పుట్టిన బిడ్డ.. ప్రాణమే లేకుండా శిశువు.. దేవుడిలా 108 సిబ్బందిడానిలోవా ముందుగా తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. తాను భారతదేశానికి చెందిన వ్యక్తిని ప్రేమించానని, వివాహం చేసుకుంటానని చెప్పింది. దాంతో ఆమె తల్లిదండ్రులు సానుకూలంగా స్పందించి పెళ్లికి అంగీకరించారు. జానకిరామ్ పాల్ కూడా తణుకులోని తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెంటనే వివాహానికి అంగీకరించారు.అయితే, వివాహం భారతదేశంలో జరుగుతుండటంతో అమ్మాయి తల్లిదండ్రులు కూడా దీనికి అంగీకరించారు. రష్యా దేశం నుంచి డానిలోవా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తణుకుకు వచ్చారు. తణుకులోని స్థానిక వీకే ఫంక్షన్ హాలులో వీరి వివాహం జరిగింది. క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో వివాహం జరిగింది.ఈ వివాహం అందర్నీ ఆకట్టుకుంది. రష్యా అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అని తెలియడంతో ఈ వివాహం చూసేందుకు చాలా మంది వచ్చారు. జంటను చూసిన అందరూ మెచ్చుకున్నారు. ఈ వివాహ కార్యక్రమానికి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. దేశాంతరాలు దాటి వివాహాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఎంతోమంది

టొరంటో: కెనడాలోని టొరంటోలో గత డిసెంబర్లో జరిగిన భారత సంతతికి చెందిన హిమాన్షీ ఖురానా (30) హత్య కేసులో ప్రధాన నిందితుడు, ఆమె భాగస్వామి అబ్దుల్ గఫూరీ (32)ని పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్ 20, 2025న ఈ హత్య జరిగినప్పటి నుండి పరారీలో ఉన్న గఫూరీని, ఆగస్టు 7న టొరంటో విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు టొరంటో పోలీసులు శనివారం ప్రకటించారు. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉందని దర్యాప్తులో తేలింది. నిందితుడిపై ఫస్ట్ డిగ్రీ హత్య కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే అతనికి పెరోల్ లేని జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. డిసెంబర్ 19న హిమాన్షీ కనిపించడం లేదని వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టగా, మరుసటి రోజు ఉదయం ఆమె మృతదేహం ఆమె ఇంట్లోనే లభ్యమైంది. టొరంటోలోని భారత కాన్సులేట్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతురాలి కుటుంబానికి అన్ని విధాలా సహకారం అందిస్తామని ప్రకటించింది. నిందితుడు విదేశాలకు పారిపోయినప్పటికీ, అంతర్జాతీయ పోలీసు ఏజెన్సీల సహకారంతో అతడిని కెనడాకు రప్పించి, అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: బ్రెజిల్లో విషాదం: హెలికాప్టర్ కూలి నలుగురు మృతి! ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు) వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్ తెలుసా? (ఫొటోలు) సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్ హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్ హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్ రుక్మిణి వసంత్ (ఫొటోలు) జెన్ జీ దెబ్బ.. లోకేశ్ లీలలు.. బాబు గొడ్డలి పూజ నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని