
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

ప్రయాణం మొదలైన కొద్దిసేపటికే చాలా మందికి నిద్ర వస్తుంటుంది. అసలు ప్రయాణంలో ఎందుకు అంత త్వరగా నిద్ర వస్తుందో తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: కారు, బస్సు లేదా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు కొద్దిసేపటికే నిద్రలోకి జారుకుంటున్నారా? చాలా మందికి ప్రయాణం మొదలైన 10–15 నిమిషాల్లోనే నిద్రమత్తు వస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం తర్వాత ప్రయాణిస్తే ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటుంది. అసలు ప్రయాణంలో ఎందుకు నిద్ర వస్తుంది? దానికి గల కారణాలేంటో చూద్దాం.. ప్రయాణిస్తున్నప్పుడు వాహనం స్వల్పంగా కదులుతూ ఉంటుంది. ఈ కదలికలు ఊయలలో ఊగుతున్న అనుభూతిని కలిగిస్తాయి. దీంతో శరీరం, మెదడు క్రమంగా రిలాక్స్ అవుతాయి. ఫలితంగా నిద్రమత్తు రావచ్చు. కారు, బస్సు లేదా రైలు వంటి మూసివున్న ప్రదేశాల్లో బయటితో పోలిస్తే సహజ కాంతి తక్కువగా ఉంటుంది. కాంతి తగ్గినప్పుడు శరీరంలోని నిద్ర–మేల్కొలుపు చక్రం ప్రభావితమై నిద్రమత్తు పెరగవచ్చు. ప్రయాణంలో ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని ఉండాల్సి వస్తుంది. శారీరక శ్రమ లేకపోవడం, పెద్దగా ఎలాంటి పని లేకపోవడం వల్ల మెదడు ప్రశాంతంగా మారుతుంది. దీంతో నిద్ర వచ్చే అవకాశం పెరుగుతుంది. కారు, బస్సు లేదా రైలు ఇంజిన్, టైర్ల నుంచి నిరంతరం ఒకే రకమైన మృదువైన శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఈ శబ్దం కొంతమందికి ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించి నిద్రమత్తును పెంచుతుంది. సాధారణంగా పెద్దలకు రోజుకు సుమారు 7–9 గంటల నిద్ర అవసరం. సరైన నిద్ర లేకపోవడం లేదా ఎక్కువగా అలసిపోయి ఉండటం వల్ల ప్రయాణంలో ప్రశాంతమైన వాతావరణం, వాహనం కదలికలు నిద్రను మరింత ప్రేరేపించవచ్చు. కారు, బస్సు లేదా రైలు ఒకే వేగంతో సాఫీగా ప్రయాణిస్తుంటే శరీరం క్రమంగా విశ్రాంతి స్థితిలోకి వెళ్తుంది. ఒత్తిడి తగ్గి శరీరం, మనసు ప్రశాంతంగా మారడంతో నిద్ర సులభంగా రావచ్చు. ప్రయాణంలో కిటికీ బయట రోడ్లు, చెట్లు, పొలాలు, భవనాలు వంటి దృశ్యాలను చూస్తూ ఉండటం వల్ల కొంతమందికి మానసిక ఒత్తిడి తగ్గుతుంది