
లక్షల మందికి నోటీసులు
అనామలీస్ జాబితాలో 60.50 లక్షల మంది ఎన్యూమరేషన్ ఫారాల్లో పూర్తి వివరాలివ్వనివారు 32.36 లక్షలు వీరంతా సరైన ఆధారాలు సమర్పించేందుకు సెప్టెంబరు 16 వరకు గడువు సర్ ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం ఫారం సమర్పించని వారికి మరో అవకాశం అర్హులందరికీ ఓట్లు: సీఈవో సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియలో 92.86 లక్షల మంది ఓటర్ల వివరాలు సరిగా లేవని గుర్తించినట్లు ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి తెలిపారు. వారికి త్వరలో నోటీసులు జారీచేయనున్నటు చెప్పారు. సర్ ఓటరు ముసాయిదా జాబితాను సోమవారం ఆయన విడుదల చేశారు. ఓటరు జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ గత రికార్డులతో అనుసంధానం (మ్యాపింగ్) చేసే క్రమంలో ఓటరు పేరు, తల్లి, తండ్రి పేర్లలో తేడాలు, చిరునామా సరిగా లేకపోవడం వంటి కారణాలతో 60,50,918 మందిని అనామలీస్ క్యాటగిరీలో చేర్చారు. వీరితోపాటు ఎన్యూమరేషన్ ఫారాల్లో మూడు కాలమ్స్ నింపకపోవడం, సమగ్రంగా వివరాలు నమోదు చేయని 32,36,659 మందికి నోటీసులు జారీచేయనున్నారు. వీరు సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే తుది ఓటరు జాబితాలో చేర్చుతారు. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లకు గాను 2,64,87,213 మంది ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారు. ఈ నెల పదోతేదీ వరకు పూర్తిచేసిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రకారం.. మొత్తం ఓటర్లలో ఫారాలు సమర్పించని 73.39 లక్షల మందిని ఏఎ్‌సడీడీ క్యాటగిరీలో చేర్చారు. వీరిలో శాశ్వతంగా చిరునామా మారినవారు 45,18,963 మంది, మరణించిన వారు 9,22,229 మంది, రెండుచోట్ల ఓటరుగా నమోదైనవారు 6,70,203 మంది ఉన్నారు. మిగిలిన 11,25,546 మంది నమోదిత చిరునామాలో లేకపోవడం, బీఎల్వోలు వెళ్లినప్పుడు అందుబాటులో లేకపోవడంతో ఎన్యూమరేషన్ ఫారాలు పొందలేదు. వీరికి మరో అవకాశం ఇవ్వనున్నట్లు సీఈవో తెలిపారు. వీరితోపాటు ఇతర క్యాటగిరీల్లోని 1,02,294 మందికి కూడా ఫారం 6ఏ ద్వారా