
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథ కం చట్ట బద్ద
Satish Kumar Voditela | కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఏతులు, ఎగవేతలు, కోతలు, కూల్చివేతలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఆరోపించారు. హైకోర్టును సాకుగా చూపుతూ లక్షలాది నిరుపేద కుటుంబాలకు భరోసా కల్పించకుండా కల్యాణలక్ష్మి , షాదీ ముబారక్ పథకాలను ఉద్దేశపూర్వకంగా ఎత్తివేయాలన్న ఆలోచనను నిరసిస్తూ హుస్నాబాద్ పట్టణంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిన్న ఫీజు రీయింబర్స్మెంట్ .. నేడు కల్యాణలక్ష్మి , షాదీ ముబారక్ మొన్న లక్షలాది మంది తెలంగాణ విద్యార్థుల భవిష్యత్‌ను ఆగం చేసింది. నేడు వేలాది ఆడబిడ్డల జీవితాలకు అన్యాయం చేసే ప్రయత్నం కాంగ్రెస్ సర్కారు చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ సార్ పేదల కన్నీళ్లు తుడిచేందుకు పథకాలు అమలు చేస్తే... కాంగ్రెస్ సర్కారు ప్రజలను కష్టాల పాలు చేసేందుకు పథకాలను కట్ చేస్తోందని ఫైర్ అయ్యారు. కేసీఆర్ పథకాలు అమలు చేస్తే - కాంగ్రెస్ సర్కారు హామీలకే పరిమితమైందన్నారు. ఎవరో అడ్వకేట్ విజయ్ గోపాల్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారంట... ఈ చేత కాని కాంగ్రెస్ ప్రభుత్వం జులై 8 నుంచి ఆగస్టు 7 వరకు కౌంటర్ దాఖలు చేయలేదు.ఇప్పుడు కోర్టు కల్యాణలక్ష్మి పథకాన్ని అమలును హైకోర్టు నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేసింది. కళ్యాణ లక్షి పథకాన్ని చట్టబద్ధత లేదు, కేవలం జీవోల మీద అమలు చేస్తున్నారని అంటున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15-3, ఆర్టికల్ 21 ప్రకారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం చట్టబద్దమైనదే. కల్యాణలక్ష్మి ,షాదీ ముబారక్ పథకాలను కేసీఆర్ గొప్ప హృదయంతో ప్రవేశపెట్టారు. పేద ఇంటి ఆడపిల్ల పెళ్లి ఆర్థిక కష్టాలతో ఆగిపోకూడదని కేసీఆర్ ఆర్థిక సాయం అందించారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మొదట 51 వేలు తర్వాత 75 వేలు, నేడు 1,00,116 ఇవ్వడం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 10 లక్షల మంది ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి , షాదీ ముబారక్ పథకం అందించడం జరిగింది. కల్యాణలక్ష్మి