
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Tirumala | తిరుమల కు వచ్చే ప్రైవేటు వాహనాల పై ఆంక్షలు విధిస్తున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఖండించింది .

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు, రోజూ 15 వేల వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, తర్వాత వచ్చే వాహనాలను చెక్ పాయింట్ల వద్ద నిలిపివేస్తారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తితిదే దృష్టికి వచ్చింది.

ఎలక్ట్రిక్ కారు (ఈవీ) కొన్నవారికి ఛార్జింగ్ స్టేషన్ వెతుక్కోవడం పెద్ద తలనొప్పి అనుకుంటే పొరపాటే. అసలు సమస్య తమ సొంత ఇల్లు లేదా అపార్ట్మెంట్లోని ఎలక్ట్రికల్ వ్యవస్థ దానిని తట్టుకోలేకపోవడమే కావచ్చు. సొంత ఇల్లు ఉన్నవారికి ఛార్జర్ ఏర్పాటు చేసుకోవడం సులభంగా అనిపించినా, అపార్ట్మెంట్లలో నివసించే వారికి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఛార్జర్ ఒక్కటే కాదు, భవనం వైరింగ్, ట్రాన్స్ఫార్మర్, మొత్తం సొసైటీ విద్యుత్ వ్యవస్థ అదనపు లోడ్‌ను మోయగలదా అన్నదే అసలు ప్రశ్న. అందుకే, ఈవీ కొనేముందే ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.ఇంటికి తగినంత సాంక్షన్డ్ లోడ్ ఉందా?సాధారణంగా ఇళ్లకు 3-4 కిలోవాట్ల (కేడబ్ల్యూ) సాంక్షన్డ్ లోడ్ ఉంటుంది. కానీ, ఒక ఈవీ ఛార్జర్ కారు, ఛార్జర్ రకాన్ని బట్టి అదనంగా 7.5 కేడబ్ల్యూ లేదా అంతకంటే ఎక్కువ లోడ్‌ను జోడిస్తుంది. "ఈవీ యజమానులు ఇంట్లో ఛార్జింగ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఇది ఇంట్లోని ఇతర ఉపకరణాల కంటే చాలా భిన్నమైన లోడ్ అని అర్థం చేసుకోవాలి. ఒక కారును 8 నుంచి 10 గంటల పాటు ఛార్జ్ చేయడానికి కనీసం 7.5 కేడబ్ల్యూ అదనపు లోడ్ అవసరం. ఫాస్ట్ ఛార్జర్లకు 22 కేడబ్ల్యూ వరకు అవసరం పడొచ్చు" అని ఛార్జర్ ఆన్ వీల్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ అనిల్ కుమార్ ఎన్డీటీవీకి తెలిపారు. దీనివల్ల ఇంటికి కేటాయించిన అసలు లోడ్ కంటే వినియోగం భారీగా పెరిగిపోతుంది. కాబట్టి, మొదటగా మీ విద్యుత్ కనెక్షన్ సాంక్షన్డ్ లోడ్ ఎంత ఉందో

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. E10 Petrol Brings Back: దేశవ్యాప్తంగా పెట్రోల్‌లో ఇథనాల్ కలపడంపై వ్యక్తమవుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక పునరాలోచనలో పడింది. వాహనాల మైలేజ్, ఇంజిన్ ఆయుష్షు తగ్గిపోతున్నాయంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో, పాత వాహనాల కోసం ప్రత్యేకంగా E10 పెట్రోల్ (10 శాతం ఇథనాల్ కలిపిన ఇంధనం)ను మళ్లీ బంకుల్లో అందుబాటులోకి తీసుకురావాలని భారత ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (CEA) అనంత నాగేశ్వరన్ ప్రతిపాదించారు. కొత్త వాహనాలకు మాత్రం E20ని యథావిధిగా కొనసాగించాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం దేశంలో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ చేసిన E20 పెట్రోల్ అమల్లో ఉంది. అయితే పాత ఇంజిన్లు ఉన్న మోటార్ సైకిళ్లు, కార్ల యజమానులు దీనివల్ల నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో E10ని పునరుద్ధరిస్తే ధరలు ఏ విధంగా ఉంటాయనే దానిపై మార్కెట్లో చర్చ నడుస్తోంది. ధరల అంచనా.. ప్రస్తుత ట్యాక్స్‌లు, పెట్రోల్, ఇథనాల్ బేస్ ధరల ఆధారంగా చూస్తే.. E20తో పోలిస్తే E10లో పెట్రోల్ శాతం (90%) కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. దీంతో దీని లీటరు ధర సుమారు రూ.103 నుంచి రూ.105 మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో మార్పులు ఉండవచ్చు. ఇథనాల్ కలపని ప్రీమియం ఇంధనాలు.. మరోవైపు ఎలాంటి ఇథనాల్ కలపని స్వచ్ఛమైన E0 ప్రీమియం పెట్రోల్ (100 ఆక్టేన్) కూడా కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో అందుబాటులో ఉంది. ఇండియన్ ఆయిల్ (XP100)

దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమలవుతున్న E20 పెట్రోల్ విధానంపై కేంద్ర ప్రభుత్వం కీలక పునరాలోచన చేస్తోంది. పాత వాహనాల యజమానులు ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, మళ్ళీ E10 పెట్రోల్ సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇంధన దిగుమతులను తగ్గించే లక్ష్యంతో 20 శాతం ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ, సామాన్యుల నుంచి వస్తున్న విజ్ఞప్తులతో ఇప్పుడు ఈ చర్చలు మొదలయ్యాయి. భారత్ తన ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమ లక్ష్యాలను నిర్దేశిత సమయం కంటే ముందే పూర్తి చేసింది. గత ఏడాది నుంచే ఈ ప్రక్రియ వేగవంతం కాగా, 2026 ఏప్రిల్ నాటికి దేశంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో E20 ఇంధనం మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అయితే, పాత కాలపు వాహనాలు, ముఖ్యంగా కార్బ్యురేటర్ ఆధారిత ద్విచక్ర వాహనాల ఇంజిన్లపై ఈ ఇంధన ప్రభావం ఎక్కువగా ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సుమారు 75 నుంచి 80 కోట్ల పాత ద్విచక్ర వాహనాల యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వాహనాల్లోని రబ్బరు సీల్స్, గాస్కెట్లు అధిక ఇథనాల్‌ను తట్టుకోలేక పాడవుతున్నాయని మెకానిక్‌లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వ అంచనాల ప్రకారం E20 వాడకం వల్ల పాత వాహనాల మైలేజీలో సుమారు 3 నుంచి 5 శాతం మేర తగ్గుదల నమోదవుతోంది. ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ కూడా ఈ సమస్యపై సానుకూలంగా స్పందించారు. పాత వాహనాల కోసం మళ్ళీ E10 పెట్రోల్‌ను అందుబాటులోకి తెస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఫలితంగా ప్రజలపై ఆర్థిక భారం తగ్గుతుందని, కొత్త వాహనాలు కొనుగోలు చేసే వరకు పాత వాహనదారులకు ఇది పెద్ద ఊరట అవుతుందని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు రెండు రకాల ఇంధనాల సరఫరాపై ప్రాథమిక చర్చలు జరుపుతోంది. అయితే, దేశవ్యాప్తంగా ఉన్న 1 లక్షకు పైగా పెట్రోల్ బంకుల్లో రెండు రకాల ఇంధన సరఫరా

సీఈఏ వి.అనంత నాగేశ్వరన్, డీఈఏ ఆకాష్ పూజారి వ్యాఖ్యలు పాత వాహనాలను వినియోగించే కోట్లాది మంది ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తక్కువ ఇథనాల్ (ఈ10) కలిగిన పెట్రోల్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి. అనంత నాగేశ్వరన్, ఆర్థిక వ్యవహారాల శాఖ కన్సల్టెంట్ ఆకాష్ పూజారి సూచించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో 20 శాతం ఇథనాల్ కలిగిన ఈ20 పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉంది. ముడిచమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం, దేశీయ వ్యవసాయానికి మద్దతు ఇవ్వడం, ఉద్గారాలను తగ్గించడం లక్ష్యంగా గతేడాది ఈ20ని ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 1 నుంచి బంకుల్లో విక్రయించే పెట్రోల్‌కు ఇదే ప్రామాణికంగా మారింది. ఈ20 పెట్రోల్ వాడకం వల్ల బీఎస్–6కు ముందు మోడల్ వాహనాల మైలేజీ తగ్గడంతో పాటు ఆటో విడిభాగాలు దెబ్బతినడం వంటి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే, ఈ ఆరోపణలను పెట్రోలియం మంత్రిత్వ శాఖ తోసిపుచ్చుతూ వస్తోంది. పలు రకాల ఇంధనాలను ఏకకాలంలో సరఫరా చేసేందుకు అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేసి నిర్వహించడం సాధ్యం కాదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే ఈ ఫిర్యాదులను పూర్తిగా తోసిపుచ్చడం సరికాదని అనంత నాగేశ్వరన్, ఆకాష్ పూజారి ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో రాసిన అభిప్రాయ వ్యాసంలో పేర్కొన్నారు. ఈ అభిప్రాయాలు తమ వ్యక్తిగతమైనవని స్పష్టం చేశారు. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో శక్తి తక్కువగా ఉండటంతో ఈ20 వాడకం వల్ల లీటరుకు వాహనం ప్రయాణించే దూరం కొంత తగ్గుతుందని నాగేశ్వరన్, పూజారి అంగీకరించారు. అయితే దీని ప్రభావం 6–7 శాతం మేరకే ఉంటుందని అంచనా వేశారు. ఈ20కు అనుకూలంగా రూపొందించిన వాహనాల్లో ఇంజిన్ అరుగుదల పెరుగుతుందనడానికి భారత్, అమెరికాలో నిర్వహించిన పరీక్షల్లో ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. ఇథనాల్ విధానం వల్ల చెరకు రైతులకు బకాయిల చెల్లింపులు వేగవంతం కావడం, గ్రామీణ ఆదాయా లు పెరగడం వంటి సానుకూల ఫలితాలు ల భించాయని నాగేశ్వరన్, పూజారి

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. extend EV commercial vehicle age limit: దేశంలో గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రంలోని మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయానికి రెడీ అయ్యింది. ఎలక్ట్రిక్ వెహికల్స్, హైడ్రోజన్ ఫ్యూయల్ సీఎన్జీతో నడిచే కమర్షియల్ వెహికల్స్ లైఫ్ లిమిట్ ను మరో 5 ఏళ్లు పెంచాలని కేంద్రం భావిస్తోంది. కేంద్ర మోటార్ వెహికల్స్ రూల్స్ 1989కి సవరణలు చేస్తూ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ కీలక ముసాదాయిను రిలీజ్ చేసింది. దీని ద్వారా గ్రీన్ ఎనర్జీతో నడిచే వెహికల్స్ యజమానులకు పెద్దపీట వేయాలన్నలక్ష్యంతోనే సర్కార్ ఈ ప్రణాళికను రూపొందించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం నేషనల్ పర్మిట్ వ్యవస్థలో కొన్ని రకాల కమర్షియ్ వెహికల్స్ కు ఉన్న 12,15ఏళ్ల గడువును .. ఈ కొత్త సవరణ ద్వారా 17,20 ఏళ్లకు పెంచనున్నారు. అయితే ఈ మినహాయింపు అన్నిరకాల వాణిజ్య వెహికల్స్ వర్తించదని కేవలం బ్యాటరీతో నడిచేవి, హైడ్రోజన్ అండ్ నేచురల్ గ్యాస్ ఆధారంగా నడిచే వెహికల్స్ కు మాత్రమే పరిమితం చేయనున్నట్లు స్పష్టం చేసింది. కమర్షియల్ రంగంలో క్లీన్ ఎనర్జీ వెహికల్స్ వినియోగాన్ని పెంచాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మార్పుల ద్వారా వెహికల్స్ నేషనల్ పర్మిట్ ప్రక్రియను మరింత ఈజీగా చేయడంతోపాటు ఆన్ లైన్ డాక్యుమెంటేషన్ ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దరఖాస్తుదారులు కోరుకుంటే నేషనల్ పర్మిట్ ఆథరైజేషన్ ను ఒకేసారీ 5ఏండ్ల వరకు ఎలక్ట్రానిక్ విధానంలో పొందే వెసులుబాటు కల్పిస్తున్నారు. దీనికోసం ఏడాదికి 16వేల 500 చొప్పున ఐదేళ్లకు 82వేల ఫీజు చెల్లించేలా నిర్ణయించారు. అలాగే వాహన్ పోర్టల్ వినియోగాన్ని మరింత విస్త్రుతం చేసి డీలర్లు
హైదరాబాద్‌ను స్వచ్ఛమైన, పర్యావరణహిత ప్రజా రవాణా నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ ఆటో మార్పిడి పథకంపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఆటో యజమానికి రూ.1.50 లక్షల వరకు సబ్సిడీ అందిస్తామని ఆయన వెల్లడించారు. అర్హత ప్రమాణాలు పూర్తి చేసే ప్రతి లబ్ధిదారుడికి సమానంగా పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ‘తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం–2026’ను రూపొందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. నగరంలో వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రజా రవాణాను పర్యావరణహితంగా మార్చడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్–2047 లక్ష్యాలకు అనుగుణంగా దీర్ఘకాలిక రవాణా ప్రణాళికలో భాగంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు.పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రభుత్వం సుమారు రూ.200 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఇందుకు రాష్ట్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. పథకం ద్వారా పాత ఇంధన వాహనాల సంఖ్యను క్రమంగా తగ్గించి, నగర రవాణా వ్యవస్థలో ఎలక్ట్రిక్ ఆటోల వాటాను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ ఆటోగా మారాలనుకునే అర్హత కలిగిన యజమానులకు ప్రభుత్వం రెండు ఆప్షన్లు కల్పించనుంది. మొదటి అవకాశంలో ప్రస్తుతం వినియోగిస్తున్న పెట్రోల్ లేదా డీజిల్ ఆటోను AIS–123 ప్రమాణాలకు అనుగుణంగా ఆమోదం పొందిన ఎలక్ట్రిక్ కిట్‌తో రెట్రోఫిట్ చేసుకోవచ్చు. అంటే ప్రస్తుత వాహనాన్ని పూర్తిగా మార్చకుండా, అనుమతించిన సాంకేతిక విధానంలో ఎలక్ట్రిక్ వ్యవస్థను అమర్చుకునే అవకాశం ఉంటుంది.రెండో అవకాశంలో పాత ఆటోను ప్రభుత్వ నిర్దేశిత విధానంలో అప్పగించి, దాని స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేసుకోవచ్చు. ఈ రెండు మార్గాల్లో ఏదైనా ఎంచుకున్నా అర్హత కలిగిన

మహీంద్రా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ భారత మార్కెట్లోకి వచ్చింది. బీఈ6 స్పోర్టెక్ పేరుతో విడుదలైన ఈ మోడల్ ప్రారంభ ధర రూ.11.45 లక్షలు. ఇది బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) పథకం ధర. బీఏఏఎస్ లేకుండా ప్రారంభ ధర రూ.19.45 లక్షలుగా ఉంది. కొత్త మోడల్లో డిజైన్ మార్పులతో పాటు టెక్నాలజీ, డ్యాష్బోర్డ్లోనూ కీలక మార్పులు చేశారు. లాంచ్ ఎడిషన్, ఫోర్, ఎఫ్ఈ, ఎఫ్ఈ ఫోర్ వంటి ప్రత్యేక వేరియంట్లను అందుబాటులోకి తెచ్చారు.బీఈ6 స్పోర్టెక్ మొత్తం ఎనిమిది వేరియంట్లలో లభిస్తుంది. ‘వన్’ వేరియంట్ 59kWh బ్యాటరీతో బీఏఏఎస్ ధర రూ.11.45 లక్షలు కాగా.. సాధారణ ధర రూ.19.45 లక్షలు. ‘టూ’ ధరలు వరుసగా రూ.12.95 లక్షలు, రూ.20.95 లక్షలు. ‘త్రీ’ ధర రూ.21.95 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ‘త్రీ+’ ధర రూ.23.95 లక్షల నుంచి ఉంది. ఫోర్, లాంచ్ ఎడిషన్, ఎఫ్ఈ ఫోర్ ధర రూ.26.95 లక్షలు కాగా.. ఎఫ్ఈ వేరియంట్ ధర రూ.24.45 లక్షలుగా ఉంది. ఇవన్నీ ఎక్స్‌షోరూమ్ ధరలు.కొత్త బీఈ6 స్పోర్టెక్లో బయట డిజైన్ పెద్దగా మారలేదు. లాంచ్ ఎడిషన్‌లో ప్రత్యేక పెయింట్ స్కీమ్ ఇచ్చారు. వెనుక భాగంలో లాంచ్ ఎడిషన్ బ్యాడ్జ్, బీఈ6 లెటరింగ్ ఉన్నాయి. వెనుక లైట్ల సాయంతో టెయిల్‌గేట్‌పై సందేశాలను ప్రదర్శించే సదుపాయం కూడా ఉంది. మొత్తం 12 రంగుల్లో ఈ ఎస్యూవీ లభిస్తుంది. వీటిలో రోసో ఇంపల్సో, రూబీ వెల్వెట్, గ్రాఫైట్ స్టోర్మ్, ఫైర్‌స్టార్మ్ ఆరెంజ్ సాటిన్ అనే నాలుగు కొత్త రంగులు ఉన్నాయి

ఏపీలో ఆధునాతన అగ్నిమాపక వాహనాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు. సీడ్ యాక్సెస్ రోడ్లో ఫైర్ వెహికల్స్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం నిర్వహించారు. అమరావతి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ఏపీలో ఆధునాతన అగ్నిమాపక వాహనాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఈరోజు (శుక్రవారం) ప్రారంభించారు. సీడ్ యాక్సెస్ రోడ్లో ఫైర్ వెహికల్స్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం నిర్వహించారు. రూ.40కోట్ల వ్యయంతో 58 ఆధునిక ఫైర్ ఫైటింగ్ వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. 25 ఫైర్ ఫైటింగ్, 20 వాటర్ బౌజర్లు, 13 క్విక్ రెస్పాన్స్ వాహనాలను వినియోగించనున్నారు

జాతీయ రహదారుల సంస్థ నూతన నిబంధనలను ప్రవేశపెట్టింది. హైవేలపై చోటు చేసుకునే ప్రమాదాల్లో బాధితులకు త్వరితగతిన అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఓ విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. జాతీయ రహదారులపై మోహరించిన అంబులెన్స్ సేవలకు సంబంధించి కఠిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై జాతీయ రహదారిపై ఎక్కడైనా ప్రమాదం సంభవించినప్పుడు 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అంబులెన్స్ 10 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకోవాల్సి ఉంటుంది.ఒకవేళ నిర్ణీత సమయానికి చేరుకోకపోతే భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం.. 10 నిమిషాల గడువును ఉల్లంఘించిన ప్రతిసారీ అంబులెన్స్ ఆపరేటర్లకు 10,000 రూపాయల జరిమానా విధిస్తారు. ప్రమాద స్థలం 10 కిలోమీటర్ల కంటే దూరంగా ఉంటే.. దానికి అనుగుణంగా ప్రయాణ సమయాన్ని దామాషా పద్ధతిలో పెంచుతారు. దీంతో పాటు అత్యవసర కాల్స్ లేదా టికెట్లను అంబులెన్స్ సిబ్బంది తిరస్కరించిన ప్రతిసారీ రూ. 10,000 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.ప్రమాద తీవ్రతను బట్టి అంబులెన్స్‌లు సకాలంలో స్పందించేలా చేసేందుకే ఈ జరిమానా విధానాన్ని అమల్లోకి తెచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణలో గోల్డెన్ అవర్ అంటే.. యాక్సిడెంట్ జరిగిన మొదటి గంట అత్యంత కీలకం. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎన్హెచ్ఏఐ తాజా నిబంధనను తెరపైకి తెచ్చింది. అలాగే.. అంబులెన్స్ కాల్ అంగీకరించిన సమయం నుంచి గరిష్టంగా ఒక గంట వ్యవధిలోనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి చేర్చాల్సి ఉంటుంది.సగం భూగోళం చీకట్లో..: స్టన్నింగ్ వీడియోలుఈ గడువును దాటినా కూడా రూ. 10,000 జరిమానా వర్తిస్తుంది. ఒప్పంద నిబంధనల ప్రకారం అంబులెన్స్‌లో అవసరమైన మందులు, పరికరాలు, వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోయినా కూడా ఇదే విధమైన జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి వీలుగా ఎన్హెచ్ఏఐ కేర్ సిస్టమ్ (NHAI Care System) ద్వారా రోడ్డు భద్రతా విభాగాలను పటిష్టం చేయనున్నారు.సీఎం విజయ్ సైనింగ్ ఇన్ స్టైల్- తమిళనాడులో రూ. లక్ష కోట్ల పెట్టబడులు.. !!జాతీయ రహదారులపై

డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్ సబ్సిడీపై ఈ-ఆటోల పంపిణీ తక్కువ వడ్డీకే బ్యాంకు రుణాలు Dwcra Women: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయం ఉపాధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సమాజంలో మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు, సొంతంగా ఆదాయ మార్గాలను సృష్టించుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తూనే, మహిళలకు(Dwcra Women) ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు సబ్సిడీపై ఎలక్ట్రిక్ వాహనాలను (ఈ-ఆటోలు, ఈ-స్కూటీలు) అందించే దిశగా మెప్మా ఆధ్వర్యంలో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. Ktr: పేరుందని పథకాలు ఆపేస్తారా? అధికారం శాశ్వతం కాదు.. కాంగ్రెస్ తీరుపై కేటీఆర్ ఫైర్ రూ.లక్ష రాయితీతో ఈ-ఆటోలు, సులభ వాయిదాలలో బ్యాంకు రుణాలు: ఈ పథకం కింద రూ.4.5 లక్షల విలువైన ఈ-ఆటోను ప్రభుత్వం ఏకంగా రూ.లక్ష సబ్సిడీతో రూ.3.5 లక్షలకే అందిస్తోంది. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల భారీ వడ్డీల భారం లేకుండా, బ్యాంకులతో తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పిస్తూ సులభ కంతుల రూపంలో చెల్లించే సౌకర్యం కల్పిస్తోంది. ఈ ఆటోలను డ్వాక్రా మహిళలు లేదా వారి కుటుంబ సభ్యులు నడుపుకుంటూ స్వయం ఉపాధి పొందే వెసులుబాటు ఉంది. గతంలో కొంతమందికి సబ్సిడీ ఆటోలు అందించగా, ప్రస్తుతం మరింత మందికి ఈ ప్రయోజనం చేకూర్చేందుకు అధికారులు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ-స్కూటీలకు రూ.12 వేల సబ్సిడీ: ఈ-ఆటోలతో పాటు మహిళల సౌకర్యార్థం ఎలక్ట్రిక్ స్కూటీల కొనుగోలుపై కూడా రూ.12,000 రాయితీని, తక్కువ వడ్డీ బ్యాంకు రుణ సదుపాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ప్రస్తుతం పట్టణ మహిళలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో దీనిపై అవగాహన తక్కువగా ఉన్నందున, అర్హులైన మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా మెప్మా అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. ఆసక్తి కలిగిన డ్వాక్రా సభ్యులు వెంటనే సమీప మెప్మా అధికారులను సంప్రదించి అప్లై చేసుకోవచ్చని
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మాతాశిశు సంరక్షణలో భాగంగా గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన రవాణా సేవలు అందించబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా రవాణా సేవలు అందించేందుకు ప్రభుత్వం ఏకంగా 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తొలి విడతలో భాగంగా సిద్ధమైన 300 వాహనాలు విజయవాడ నుంచి అన్ని జిల్లాలకు పంపించారు.ఈ తల్లిబిడ్డ వాహనాలను అధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్దారు. ఈ వాహనంలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, అత్యవసర సమయంలో వెంటనే సహాయం అందేలా ఎమర్జెన్సీ బటన్, అగ్నిప్రమాదం జరిగినప్పుడు తీసుకునే రక్షణ చర్యలు, జీపీఎస్ లొకేషన్ ట్రాకింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఈ వాహనాలను పల్నాడు జిల్లా నరసరావుపేటలో మంగళవారం నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రారంభించనున్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల రవాణా కోసం'తల్లీ-బిడ్డ ఎక్స్‌ప్రెస్' (102)ను తీసుకొచ్చింది. ఏటా దాదాపు 2.75 లక్షల మందికి ఉచిత రవాణా సేవలు అందించనున్నారు. ఈ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవం తర్వాత తల్లులను, శిశువులను సురక్షితంగా వారి ఇళ్లకు తీసుకెళతారు. అంతేకాదు గర్భిణీ మహిళలకు అవసరమైనప్పుడు ఆసుపత్రికి రవాణా సౌకర్యం కల్పిస్తారు. ఈ సర్వీసు పూర్తిగా ఉచితం, ఎలాంటి డబ్బులు చెల్లించాల్సి అవసరం లేదు. ఈ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవల కోసం గర్భిణులు లేదా బాలింతలు 102 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయొచ్చు.ఈ వాహనాల్లో తల్లిబిడ్డలకు ఎటువంటి అలసట, అసౌకర్యం కలగకుండా ఏసీ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఈ వాహనంలోని వెనుక సీట్లలో కూర్చునే బాలింతల భద్రత కోసం ప్రత్యేక సీట్ బెల్టులను ఏర్పాటు చేశారు. ప్రసవం తర్వాత బాలింతలు సులభంగా వాహనం ఎక్కడానికి, దిగడానికి వీలుగా ఫుట్‌రెస్ట్‌లు ఉన్నాయి. ఈ తల్లిబిడ్డ ఎక్స్ప్రెసక్ వాహనాలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించేందుకు వీలుగా ప్రతి వాహనానికి జీపీఎస్ కూడా ఉంది. అత్యవసర పరిస్థితుల కోసం ఫస్ట్ ఎయిడ్ కిట్లు, అగ్నిమాపక పరికరాలు

విద్యుత్ వాహనాల (ఈవీ) రంగం దేశంలో భారీగా ఉద్యోగాలు కల్పించనుంది. 2030 నాటికి ఈ రంగంలో 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అడ్కో ఇండియా నివేదిక తెలిపింది. బ్యాటరీ తయారీ, ఛార్జింగ్ కేంద్రాలు, వాహనాల సర్వీసింగ్, సాఫ్ట్వేర్, ఫ్లీట్ నిర్వహణ, బ్యాటరీ రీసైక్లింగ్ వంటి రంగాల్లో అవకాశాలు పెరగనున్నాయి.ఈ ఉద్యోగాల్లో కేవలం 10-15 శాతం మాత్రమే నేరుగా వాహనాల తయారీకి సంబంధించినవి ఉంటాయని అడ్కో అంచనా వేసింది. మిగతా 85-90 శాతం ఉద్యోగాలు ఈవీల చుట్టూ ఏర్పడే ఇతర రంగాల్లో వస్తాయని పేర్కొంది. దీంతో సంప్రదాయ కార్ల తయారీ కేంద్రాలకే ఉద్యోగాలు పరిమితం కావని స్పష్టం చేసింది.ఈవీ రంగంలో నియామకాలు ఏటా 15-20 శాతం పెరగొచ్చని నివేదిక తెలిపింది. ప్రత్యేక నైపుణ్యాలున్న ఉద్యోగులకు డిమాండ్ 35 శాతం వరకు పెరగవచ్చని అంచనా వేసింది. ఈవీ రంగంలో అవసరమైన నైపుణ్యాలు ఉన్నవారికి సంప్రదాయ ఇంజిన్ వాహనాల ఉద్యోగాలతో పోలిస్తే 45 శాతం వరకు ఎక్కువ జీతాలు లభించే అవకాశం ఉందని పేర్కొంది.ఈవీ రంగంలో ఉద్యోగాల్లో వాహనాల తయారీ వాటా 50-55 శాతం ఉండొచ్చని అడ్కో తెలిపింది. బ్యాటరీ తయారీ, ఛార్జింగ్ సదుపాయాలు, బ్యాటరీల రీసైక్లింగ్ రంగాల్లో వేగంగా ఉద్యోగాలు పెరగనున్నాయి.దేశంలో ఈవీల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఛార్జింగ్ కేంద్రాలు, సర్వీసింగ్ కేంద్రాలు, ఫ్లీట్ నిర్వహణకు సిబ్బంది అవసరం పెరుగుతుంది. ఢిల్లీలో జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఈవీ పాలసీ కింద దాదాపు 30 వేల ఛార్జింగ్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. E20 Fuel Vehicles Key Changes: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ దేశాలు పెట్రోల్ దిగుమతిపైనే ఆధారపడ్డాయి. దీనికే ఎక్కువ విదేశీ మారకం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని కలుపుతుంది. ఇదే E20 పెట్రోల్‌గా పిలుస్తున్నారు. ఇప్పటికే అమెరికా, రష్యా, సహా పలు దేశాలు పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలుపుతున్నాయి. అమెరికాలో అయితే.. ఏకంగా E80 పెట్రోల్ అంటే.. దాదాపు 80 శాతం ఇథనాల్‌ను కలుపుతున్నట్టు చెబుతున్నారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం.. మన దేశం ఇపుడిపుడే ఈ దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా ముందుగా 80 శాతం పెట్రోల్‌కు 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని కలుపుతున్నాయి. దీన్నే E20 పెట్రోల్‌గా పిలుస్తున్నారు. ఇథనాల్ హైగ్రోస్కోపిక్ కావడం వల్ల తేమను గ్రహిస్తుంది. అందువల్ల ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని వాడితే, ఫ్యూయల్ లైన్ తుప్పు పట్టే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్న మాట. రబ్బరు సీల్ క్షీణించడం, ఇతర పార్ట్స్ పాడవటం లాంటివి జరగొచ్చు. అందువల్ల ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని వాడటానికి వాహనాల్లో కొన్ని మార్పులు చేయాలని చెబుతున్నారు. తుప్పు పట్టకుండా ఏం చేయాలి... తుప్పు పట్టకుండా ఉండేందుకు కొన్ని పూతలు పూయాలి. ఇంజిన్ కంట్రోల్ యూనిట్లను (ECU) కూడా మార్చాలి. అలాగైతేనే, E20 వాడినా వాహనం పాడవకుండా సురక్షితంగా ఉంటుంది. ఈ మార్పులు చేయకుండా E20ని వాడితే వాహనాలు పాడైపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కొన్నిసార్లు