
జూన్ 2026 CSIR UGC NET ఫలితాలు విడుదల
జూన్ 2026 CSIR UGC NET ఫలితాలు విడుదల
© 2026 nimisham.in

జూన్ 2026 CSIR UGC NET ఫలితాలు విడుదల

జూన్ 2026 UGC NET పరీక్షకు సమాధాన కీ విడుదల

UGC NET Re-Exam Answer Key 2026 Released; సెప్టెంబర్ 13 వరకు అభ్యంతరాలు నమోదు చేసుకోండి

NTA Reforms: పేపర్ లీక్‌లకు శాశ్వత చెక్..ఒకేసారి 600 మంది పై వేటు.. కొత్త ఫార్ములాతో కేంద్రం ఈ వార్తకు సంబంధించిన

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తీరుపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూజీసీ-నెట్ పరీక్షలో సోషియాలజీ, ఇంగ్లిష్, కామర్స్ పరీక్షలను రద్దు చేసి సెప్టెంబర్‌లో.. న్యూఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తీరుపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూజీసీ-నెట్ పరీక్షలో సోషియాలజీ, ఇంగ్లిష్, కామర్స్ పరీక్షలను రద్దు చేసి సెప్టెంబర్‌లో మళ్లీ నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించడంపై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ఎన్టీఏ తప్పులకు వేలాది మంది విద్యార్థులు మూల్యం చెల్లించాల్సి వస్తోందని విమర్శించారు. ఎక్స్ వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ.. ‘మోదీజీ.. మీ ఎన్టీఏ ఏం చేసిందో చూడండి. జూన్ 22 నుంచి 30 వరకు సోషియాలజీ, ఇంగ్లిష్, కామర్స్ యూజీసీ-నెట్ పరీక్షలు జరిగాయి. దాదాపు రెండు నెలల తర్వాత ప్రశ్నపత్రాల్లో లోపాలు, గత ప్రశ్నల పునరావృతం కారణంగా ఈ మూడు పరీక్షలను ఎన్టీఏ రద్దు చేసింది. ఎన్టీఏ నిర్ణయం వల్ల ఏళ్ల తరబడి పరీక్షకు సిద్ధమైన వేలాది మంది అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవడం, ఫీజులు చెల్లించడం, దూర ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలకు ప్రయాణించాల్సి వస్తోంది. తప్పు చేసింది ఎన్టీఏ.. కానీ, శిక్ష అనుభవించేది మాత్రం విద్యార్థులా?’ అని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షా వ్యవస్థ విద్యార్థులను దోపిడీ చేసే వ్యవస్థగా మారిందని రాహుల్ ఆరోపించారు. దేశంలో సరైన పరీక్షా వ్యవస్థ లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను కోటా, డెహ్రాడూన్, ప్రయాగ్‌రాజ్‌లలో ఇదే విషయాన్ని ప్రస్తావించానన్నారు. ‘ఇది విద్యా వ్యవస్థ కాదు.. డబ్బు, కాలం, మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసాన్ని తీసుకుని చివరికి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని వ్యవస్థగా మారింది’ అని రాహుల్ విమర్శలు గుప్పించారు. యూజీసీ-నెట్ ప్రశ్నపత్రాలు పరీక్షకు ముందే లీకయ్యాయా? అని రాహుల్ గాంధీ సందేహం వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నకు ఎన్టీఏ ఎందుకు సమాధానం చెప్పడం

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. UGC NET 2026: యూజీసీ నెట్ 2026కు సంబంధించి ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ పరీక్షలను మరోసారి నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం ప్రకటించింది. ఈ సబ్జెక్టుల ప్రశ్న పత్రాల్లో పలు పొరపాట్లు దొర్లినట్లు ఫిర్యాదులు అందడంతో రీటెస్ట్ నిర్వహించేందుకు ఎన్టీఏ నిర్ణయించింది. ట్రాన్స్ లేషన్ దోషాలతో పాటు టైపో గ్రాఫికల్ , ఫ్యాక్చువల్ తప్పులు ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందని కూడా ఎన్టీఏ పేర్కొంది. ఈ నేపథ్యంలో కమిటీ సూచనల మేరకు 3 పేపర్లకు సంబంధించి రీటెస్టు నిర్వహిస్తున్నామని తెలిపింది. సెప్టెంబర్ 9న ఉదయం షిఫ్టులో ఇంగ్లీష్ పరీక్ష, మధ్యాహ్నం షిఫ్టులో కామర్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 10వ తేదీన ఉదయం షిఫ్టులో సోషియాలజీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఎన్టీఏ తెలిపింది. రీటెస్టుకు హాజరయ్యే వారు అదనపు ఫీజులేవి చెల్లించక్కర్లేదని ఎన్టీఏ పేర్కొంది. పరీక్ష కేంద్రం, అడ్మిట్ కార్డుల వివరాలన్నీ త్వరలోనే అధికారిక వెబ్ సైట్లో వెల్లడిస్తామని తెలిపింది. ఇక మిగిలిన 84 సబ్జెక్టుల ఫలితాలు మాత్రం యథావిధిగా విడుదల చేస్తామని కూడా తెలిపింది. ఈ ఏడాది జూన్ 22 నుంచి 30 మధ్య దేశవ్యాప్తంగా 87 సబ్జెక్టుల్లో యూజీసీ నెట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. జేఆర్ఎఫ్ ఫెలోషిప్, పీహెచ్డీ అడ్మిషన్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత కోసం విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తుంటారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి

పీహెచ్డీ ప్రవేశాలకు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత కోసం నిర్వహించే ‘యూజీసీ-నెట్’ పరీక్షల్లో భారీగా తప్పులు బయటపడ్డాయి. మూడు సబ్జెక్టుల పరీక్షలు ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీలలో... చాలా ప్రశ్నల్లో తప్పులు, గతంలోని ప్రశ్నలు పునరావృతమైనట్టు గుర్తించామన్న ఎన్టీఏ.. ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ పరీక్షలు రద్దు వాటిని తిరిగి సెప్టెంబరు 9, 10 తేదీల్లో నిర్వహిస్తామని వెల్లడి జూన్‌లో 87 సబ్జెక్టుల్లో పరీక్ష పెట్టిన ఎన్టీఏ.. 84 సబ్జెక్టుల ‘కీ’ల విడుదల వీటి ఫలితాలు షెడ్యూల్ ప్రకారమే ప్రకటిస్తామని వివరణ న్యూఢిల్లీ, ఆగస్టు 16: పీహెచ్డీ ప్రవేశాలకు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత కోసం నిర్వహించే ‘యూజీసీ-నెట్’ పరీక్షల్లో భారీగా తప్పులు బయటపడ్డాయి. మూడు సబ్జెక్టుల పరీక్షలు ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీలలో సరిదిద్దలేని స్థాయిలో తప్పులు ఉన్నట్టు గుర్తించామని జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) ఆదివారం ప్రకటించింది. అంతేకాకుండా ఈ సబ్జెక్టుల్లో గత పరీక్షల్లో వచ్చిన చాలా ప్రశ్నలు ఆప్షన్లతో సహా యథాతథంగా వచ్చినట్టు తేలిందని వెల్లడించింది. కేవలం ప్రశ్నలను తొలగించడం, ఆప్షన్ల మార్పులకు అనుగుణంగా మార్కులు కేటాయించడం వంటి వాటికి అవకాశం లేనిస్థాయిలో లోపాలు ఉండటంతో.. మూడు సబ్జెక్టుల పరీక్షలను రద్దు చేసి, తిరిగి నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపింది. సెప్టెంబరు 9న ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఇంగ్లిష్ పరీక్ష, అదే రోజున మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కామర్స్ పరీక్ష, 10వ తేదీన ఉదయం 9 నుంచి 12 గంటల వరకు సోషియాలజీ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. విద్యార్థులు మళ్లీ పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరమేదీ ఉండదని తెలిపింది. ఎన్టీఏ జూన్‌లో మొత్తం 87 సబ్జెక్టులకు యూజీసీ-నెట్ పరీక్షలు నిర్వహించింది. పరీక్షల అనంతరం ప్రశ్నల్లో తప్పులు, పునరావృతాలు ఉన్నట్టుగా ఎన్టీఏకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. దీనితో ఎన్టీఏ ఒక ప్రత్యేక కమిటీని నియమించి పరిశీలన జరిపింది. ఈ క్రమంలో ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ

యూజీసీ నెట్-2026కు సంబంధించి ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ పరీక్షలను మరోసారి నిర్వహించనున్నామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా ప్రకటించింది. ఇంటర్నెట్ డెస్క్: యూజీసీ నెట్-2026కు సంబంధించి ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ పరీక్షలను మరోసారి నిర్వహించనున్నామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా ప్రకటించింది. ఈ సబ్జెక్టుల ప్రశ్న పత్రాల్లో పలు పొరపాట్లు ఉన్నట్టు ఫిర్యాదులు రావడంతో రీటెస్టు నిర్వహించేందుకు ఎన్టీఏ నిర్ణయించింది. అనువాద దోషాలతో పాటు టైపోగ్రాఫికల్, ఫ్యాక్చువల్ తప్పులు ఉన్నట్టు తమ పరిశీలనలో తేలిందని కూడా ఎన్టీఏ పేర్కొంది. ఈ నేపథ్యంలో కమిటీ సూచనల మేరకు మూడు పేపర్లకు సంబంధించి రీటెస్టు నిర్వహిస్తున్నామని తెలిపింది. సెప్టెంబర్ 9న ఉదయం షిఫ్టులో (1వ షిఫ్ట్) ఇంగ్లిష్ పరీక్ష, మధ్యాహ్నం షిఫ్ట్‌లో (2వ షిఫ్ట్) కామర్స్ పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 10న ఉదయం షిఫ్ట్‌లో సోషియాలజీ పరీక్ష ఉంటుంది. రీటెస్టుకు హాజరయ్యే వారు అదనపు ఫీజులేవీ చెల్లించాల్సిన అవసరం లేదని కూడా ఎన్టీఏ పేర్కొంది. పరీక్ష కేంద్రం, అడ్మిట్ కార్డుల వివరాలన్నీ త్వరలో అధికారిక వెబ్సైట్లో వెల్లడిస్తామని చెప్పింది. ఇక మిగిలిన 84 సబ్జెక్టుల ఫలితాలు మాత్రం యథావిధిగా విడుదల అవుతాయని కూడా ఎన్టీఏ పేర్కొంది. ఈ ఏడాది జూన్ 22 నుంచి 30 మధ్య దేశవ్యాప్తంగా 87 సబ్జెక్టుల్లో యూజీసీ నెట్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. జేఆర్ఎఫ్ ఫెలోషిప్, పీహెచ్డీ అడ్మిషన్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత కోసం విద్యార్థులు ఈ పరీక్ష రాస్తుంటారు. పోలీస్ శాఖలో ఉద్యోగాల వయోపరిమితిపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం