ముఖాన్ని తళతళ మెరిపించే నూనెలు
బాదం నూనెలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి స్కిన్ గ్లో పెంచుతుంది. చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. ఆయుర్వేదంలో కుంకుమాది తైలంకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ నూనెతో చర్మానికి మర్దన చేయడం ద్వారా నల్ల మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. దానిమ్మ నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి చర్మం స్థితిస్థాపకతను మెరుగుపర్చి ముడతలు రాకుండా కాపాడుతాయి. తద్వారా యవ్వనంగా ఉండొచ్చు. కుంకుమపువ్వులోని సమ్మేళనాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. అలాగే నల్ల మచ్చలు తగ్గించి స్కిన్ టోన్ మెరుగుపరుస్తాయి. మరులా ఆెయిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. చర్మాన్ని మెరిపించడంలో సహాయపడతాయి. అందుకే దీనిని కాస్మోటిక్స్లో ఎక్కువగా వాడతారు. జోజోబా ఆయిల్ చాలా తేలికగా ఉండి చర్మం లోపలికి వెళ్లి మాయిశ్చరైజ్ చేస్తుంది. చర్మం పీహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్ చేసి కాంతివంతంగా మారుస్తుంది. రోజ్హిప్ ఆయిల్లో విటమిన్ ఎ, సి మెండుగా ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని తళతళ మెరిపిస్తాయి. గ్రేప్సీడ్ ఆయిల్లో విటమిన్ సి ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఆర్గాన్ ఆయిల్లో విటమిన్ ఇ ఉంటుంది. ఇది చర్మాన్ని లోపలి నుంచి మాయిశ్చరైజ్ చేసి స్కిన్ డ్రై కాకుండా కాపాడుతుంది