
Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
© 2026 nimisham.in

Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..

ప్రేమను మాటల్లో చెప్పడం కన్నా చేతల్లో చూపించేవారే ఎక్కువ. ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రేమకు ఇది సరిగ్గా సరిపోతుంది. తాజాగా ఓ తండ్రి తన కూతురిపై చూపించిన ప్రేమ నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. "డాడీ చాలా గుర్తొస్తున్నావ్" అని కూతురు పెట్టిన ఒక్క మెసేజ్‌తో.. ఆయన 14 గంటలు ప్రయాణించి ఆమె ముందు నిలబడ్డారు. కేవలం 8 గంటలు కూతురితో గడిపి, మళ్లీ 14 గంటలు ప్రయాణించి వెనక్కి వెళ్లిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల్లోకి వెళితే.. కైవల్య (@apple.kaivalya) అనే యువతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పంచుకుంది. ఓ రోజు రాత్రి 1:50 గంటల సమయంలో ఆమె తన తండ్రికి "డాడీ చాలా గుర్తొస్తున్నావ్" అని మెసేజ్ చేసింది. ఆ మెసేజ్‌కు ఆయన అంతలా స్పందిస్తారని ఆమె ఊహించలేదు. కానీ మరుసటి రోజు ఉదయం ఆమె తలుపు తీయగానే, బ్యాక్‌ప్యాక్‌తో తండ్రి ఎదురుగా నిలబడి ఉన్నారు.ఆయన కేవలం 8 గంటల సమయం మాత్రమే తన కూతురితో గడిపారు. ఈ కొద్ది సమయంలోనే ఆయన ఆఫీస్ కాల్స్ మాట్లాడుకుంటూనే, కూతురికి సాయం చేశారు. ఆమె గిన్నెలు శుభ్రం చేయడం, బయటకు తీసుకెళ్లడం, ఆమెకు ఇష్టమైన ఆహారం తినిపించడం వంటి పనులు చేశారు. తిరిగి వెళ్లే ముందు, "నువ్వు ఏం చేసినా సంతోషంగా ఉండు. నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను" అని చెప్పి వెళ్లారు.దీనిపై కైవల్య ఎమోషనల్ అయింది. "నేను నాన్నను చూడాలని అనుకున్నాను, ఆయన వచ్చారు. పెద్దగా ప్లాన్స్

అర్ధరాత్రి వేళ కుమార్తె పంపిన ఆ సందేశం చూసి, ఆమె తండ్రి ఏకంగా 14 గంటల పాటు ప్రయాణించి, ఆమె దగ్గరకు చేరుకున్న ఘటన సామాజిక మాధ్యమాల్లో అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘ఆపిల్.కైవల్య’ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ తన తండ్రి ముకేశ్ హీరో తనపై చూపిన అనురాగాన్ని వీడియో రూపంలో పంచుకున్నారు. రాత్రి సుమారు 1:50 గంటల సమయంలో ఆమె తన తండ్రికి ‘డాడీ చాలా గుర్తొస్తున్నావ్’ అంటూ ఓ సందేశం పంపారు. కుమార్తె నుంచి వచ్చిన ఆ ఒక్క మాటే ఆయనను వెంటనే ప్రయాణానికి పురికొల్పింది. మరుసటి రోజు ఉదయం ఆమె తలుపు తీసి చూసేసరికి, వీపున బ్యాగ్‌తో తండ్రి గుమ్మం ముందు నిల్చుని కనిపించారు. కేవలం ఎనిమిది గంటల పాటు కుమార్తెతో గడపడం కోసం ఆయన 14 గంటల పాటు ప్రయాణించి వచ్చారు. ఆయన తిరిగి తాను ఉండే చోటుకు వెళ్లడానికీ మరో 14 గంటల సమయం పడుతుంది. ఆ కొద్దిపాటి సమయంలోనే ఆ తండ్రీకూతుళ్లు ఎంతో విలువైన క్షణాలను పంచుకున్నారు. ఆమెతో కలిసి బైక్ రైడ్‌కు వెళ్తూనే ఆయన ఆఫీస్ ఫోన్ కాల్స్ మాట్లాడారు. వినోద కేంద్రానికి వెళ్లి సరదాగా సమయం గడిపారు. అనంతరం రెస్టారెంట్లో భోజనం చేశారు. కేవలం బయటకు వెళ్లడమే కాకుండా, కుమార్తె వంటగదిలోని గిన్నెలు కడగడం సహా పలు చిన్నపాటి పనులను ఆయనే స్వయంగా చేసిపెట్టారు. ఈ వీడియోను పంచుకుంటూ.. ‘నిన్ను చూడాలని ఉందని చెప్పాను.. వెంటనే వచ్చేశారు. 14 గంటల ప్రయాణం, ఒక్క రోజు కలయిక, అడగకుండానే చేసిపెట్టిన ఎన్నో పనులు’ అని ఆ యువతి రాసుకొచ్చారు. తల్లిదండ్రులు తమ మాటల్లో ఎప్పుడూ తోడుంటామని చెప్పకపోవచ్చు కానీ, చేతల్లో ఆ ప్రేమను చాటుతారని ఆమె భావోద్వేగంతో వివరించారు. అనంతరం ఆయన స్లీపర్ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. మాటల కంటే చేతలే గొప్పవని నిరూపించిన ఈ వీడియో నెటిజన్ల మనసులను అమితంగా హత్తుకుంటోంది. ఇది కూడా

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన పర్యటనలో ఒక రైతు కుటుంబానికి అనూహ్య రీతిలో ఆశ్చర్యాన్ని కలిగించారు. మంగళవారం సేలం జిల్లాలో పర్యటించిన ఆయన, ఒక గ్రామంలో ఆకస్మికంగా ఆగి స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఒక వృద్ధురాలు చూపిన ఆత్మీయతకు ముగ్ధుడైన ఆయన, తాను ధరించిన కళ్లజోడును ఆమెకు బహుమతిగా అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు.సేలం జిల్లాలోని మెట్టూరు డ్యామ్ గేట్లను తెరిచి, సాగునీటిని విడుదల చేసే క్రమంలో ముఖ్యమంత్రి విజయ్ అక్కడికి చేరుకున్నారు. కార్యక్రమం ముగించుకుని చెన్నైకి తిరుగుప్రయాణమైన ఆయన, మార్గమధ్యలోని చిన్నకావూరు గ్రామం వద్ద తన కాన్వాయ్‌ను నిలిపివేశారు. నేరుగా రామస్వామి అనే రైతు నివాసానికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పలకరించారు.ముఖ్యమంత్రి స్వయంగా తమ ఇంటికి రావడంతో ఆ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షాతిరేకలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఒక వృద్ధురాలు ముఖ్యమంత్రిని చూడగానే అమితానందానికి లోనయ్యారు. ఆత్మీయంగా ఆయన్ను ఆలింగనం చేసుకుని, చేతిని గట్టిగా పట్టుకుని తన అనురాగాన్ని చాటుకున్నారు. అనంతరం తన పెరట్లోని తోటను ఆయనకు చూపించారు. ఆమె అభిమానానికి చలించిన విజయ్, తక్షణమే తాను ధరించిన కళ్లజోడును తీసి ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత గ్రామంలోని వృద్ధులకు చీరలు, పంచెలు పంపిణీ చేసి అక్కడి నుంచి నిష్క్రమించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా, విజయ్ ఆ బామ్మకు బహూకరించిన సన్ గ్లాసులు వరల్డ్ క్లాస్ సంస్థ 'క్రిస్టియన్ డయోర్' తయారు చేసినవి. వీటి ధర రూ.50 వేలకు పైనే

నాగర్‌కర్నూలు జిల్లా పెంట్లవెల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి మరుగుదొడ్డి శుభ్రంగా లేకపోవడంపై.. పెంట్లవెల్లి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూలు జిల్లా పెంట్లవెల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి మరుగుదొడ్డి శుభ్రంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా మంత్రి స్వయంగా బకెట్లో నీరు తీసుకొని మరుగుదొడ్డిని శుభ్రం చేశారు. వివిధ సమస్యలపై వచ్చే ప్రజల అవసరాలు తీర్చడానికి ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు శుభ్రంగా ఉండాలన్నారు. వెంటనే రూ.450తో ఒక బకెట్, జగ్గు, ఫినాయిల్ డబ్బా, బ్రష్, తెప్పించి కార్యాలయానికి అందజేశారు. ఐదు నిమిషాలు సమయం కేటాయిస్తే మన బాత్రూమ్లను మనమే శుభ్రం చేసుకోవచ్చని తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి మంత్రి సూచించారు

మెగా ఫ్యామిలీ హీరోలపై అభిమానులు చూపించే ప్రేమాభిమానాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీ హీరోలపై అభిమానులు చూపించే ప్రేమాభిమానాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే సమయంలో, తనను ఆరాధించే అభిమానులకు ఏదైనా అవసరమైనా, కష్టం వచ్చినా ‘నేనున్నాను’ అంటూ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ముందుంటారు. అభిమానులను తన సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకునే చిరంజీవి దార్శనికతకు నిదర్శనంగా తాజాగా మరొక అద్భుతమైన సంఘటన జరిగింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘మెగా158’ సెట్లో కెమెరా విభాగంలో పనిచేస్తున్న నివాస్ అనే టెక్నీషియన్ పనితీరును మెచ్చుకున్న చిరంజీవి, ఆయనతో సరదాగా ముచ్చటించారు. ఆ సంభాషణలో నివాస్ గురించి తెలుసుకుని చిరంజీవి ఆశ్చర్యపోయారు. నివాస్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) అంటే ప్రాణం. ఆ వీరాభిమానంతోనే తన కుమారుడికి ‘జస్వంత్ రామ్ చరణ్’ (Jaswanth Ram Charan) అని పేరు పెట్టుకున్నట్లు తెలిసింది. అభిమానులు తమను ఎంతగా ఆత్మీయంగా ఓన్ చేసుకుంటున్నారో తెలుసుకుని ఎంతో సంతోషించిన చిరంజీవి, వెంటనే నివాస్ కుటుంబాన్ని తన ఇంటికి రావాల్సిందిగా స్వయంగా ఆహ్వానించారు. ఇంటికి పిలిచారనే ఆనందంతో భార్యాపిల్లలతో కలిసి వెళ్లిన నివాస్ కుటుంబానికి అక్కడ మరొక బిగ్ సర్ప్రైజ్ లభించింది. స్వయంగా రామ్ చరణ్ కూడా అక్కడ ఉండటంతో నివాస్ కుటుంబ ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ నివాస్ ఫ్యామిలీతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడి, వారితో ఫోటోలు దిగి చిరస్మరణీయమైన జ్ఞాపకాన్ని అందించారు. ఒక సాధారణ టెక్నీషియన్, అభిమానికి మెగాస్టార్, మెగా పవర్ స్టార్ ఇచ్చిన ఈ స్పెషల్ సర్ప్రైజ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నివాస్ నిజంగా ఎంతో అదృష్టవంతుడంటూ మెగా అభిమానులు నెట్టింట కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. డిప్యూటీ సీఎం అడిగారు.. ఈ సినిమా చేశా: కింగ్