
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

ప్రస్తుతం సోషల్ మీడియాలో 80s ట్రెండ్ నడుస్తోంది. సెలబ్రిటీలు అంతా తమ తమ ఫోటోలను AI సహాయంతో 80s లుక్స్ లోకి మార్చి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ జాబితాలో నటి కీర్తీ సురేష్ కూడా చేరిపోయింది. కొంచెం ఆలస్యమైంది గానీ.. నేను వచ్చేశాను అనే క్యాప్షన్‌ను ఆ ఫోటోలకు ఇచ్చింది.

టాలీవుడ్లో రాబోయే అత్యంత ప్రతిష్టాత్మక సినిమాల్లో నాని నటిస్తున్న ది ప్యారడైజ్(The Paradise) ఒకటిగా నిలుస్తోంది. నాని(Nani) కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రారంభం నుంచే భారీ అంచనాలున్నాయి. రిలీజ్ ఆలస్యం కావడంతో పాటు నిర్మాణ వ్యయం కూడా గణనీయంగా పెరిగినట్లు సమాచారం. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడం సినిమాపై హైప్‌ను మరింత పెంచుతోంది. నాన్ థియేట్రికల్ డీల్ ద్వారా కొంత పెట్టుబడి తిరిగి వచ్చినప్పటికీ, అసలు ఛాలెంజ్ మాత్రం థియేట్రికల్ మార్కెట్లోనే ఉండబోతోంది. ఇప్పటివరకు నాని సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో స్ట్రాంగ్ మార్కెట్ ఉన్నప్పటికీ, ఈ స్థాయి భారీ బడ్జెట్‌ను రికవర్ చేయాలంటే ఇతర భాషల్లో కూడా సినిమా సత్తా చాటాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ మార్కెట్లలో మంచి కలెక్షన్లు సాధించడం కీలకం కానుంది. గతంలో నాని తన సినిమాలను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేసినప్పటికీ, తెలుగు కాకుండా ఆశించిన స్థాయి కమర్షియల్ ఫలితాలు మాత్రం రాలేదు. దీంతో ది ప్యారడైజ్ నానికి కొత్త మార్కెట్‌ను తెరిచే సినిమాగా మారుతుందా అన్న ఆసక్తి నెలకొంది. శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri) నిర్మిస్తున్నారు. కయాదు లోహర్(Kayadhu Lohar) హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ పెట్టుబడి, పెరిగిన అంచనాలు, పాన్ ఇండియా టార్గెట్‌తో వస్తున్న ఈ సినిమా సక్సెస్ నాని కెరీర్లో మరో కీలక మైలురాయిగా నిలవనుంది. తెలుగు మార్కెట్‌ను దాటి ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగితేనే ఈ భారీ ప్రాజెక్ట్‌కు నిజమైన కమర్షియల్ సక్సెస్ దక్కే అవకాశం ఉంది

వెంకటేష్, కీర్తి సురేష్, నందమూరి కళ్యాణ్ రామ్, కృతి శెట్టిలతో దర్శకుడు అనిల్ రావిపూడి ఒక మల్టీస్టారర్ మూవీ తీస్తున్నారు. ఈ సినిమాకి “జనవరి 12 విడుదల” (January 12 Vidudala) అనే పేరుని ఖరారు చేశారు. పేరుతో పాటు విడుదల తేదీ కూడా అదే ఫిక్స్ చేశారు. రిలీజ్ డేట్ ముందే ఫిక్స్ చేసుకొని షూటింగ్ మొదలుపెట్టడం అనిల్ రావిపూడి స్టయిల్. అతని ప్లానింగ్ అంతా పక్కాగా ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఒక పాట తీశారు. తాజాగా రెండో పాట మొత్తం నలుగురు హీరో, హీరోయిన్లతో చిత్రకరిస్తున్నారు. మైసూర్ దగ్గర్లోని మేల్కొటిలో ఒక సెలెబ్రేషన్ సాంగ్ తీస్తున్నారు. హీరోలు ఇద్దరూ బైక్ పై వెళ్తుంటే వారితో హీరోయిన్లు పాల్గొనే గ్రామీణ నేపథ్యపు పాటని అనిల్ రావిపూడి చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో ఇప్పటికే 40 రోజులకి పైగా షూటింగ్ పూర్తి అవుతుంది. మరో నలభై రోజుల్లో మొత్తం షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేస్తారట. అంత స్పీడ్ అనిల్ రావిపూడిది. మరోవైపు, ఎప్పుడో మొదలుపెట్టిన “ఆదర్శ కుటుంబం” సినిమాని మాత్రం త్రివిక్రమ్ పూర్తి చెయ్యలేకపోయారు. మిగిలిన బ్యాలెన్స్ షూటింగ్ ని వెంకటేష్ ఈ నెలలో పూర్తి చేస్తారట. ‘జనవరి 12 విడుదల’ పాట చిత్రీకరణ పూర్తికాగానే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కి వచ్చి అది కంప్లీట్ చేస్తారు

ఏషనాగుల కట్ట మీద సాంగ్ ట్రెండ్.. ఆ ఫొటోలు షేర్ చేసిన కీర్తిఏషనాగుల కట్ట మీద సాంగ్ ట్రెండ్.. ఆ ఫొటోలు షేర్ చేసిన కీర్తి samatha 01 september 2026 Pic credit - Pinterest స్టార్ బ్యూటీ, అందా చిన్నది కీర్తి సురేశ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ అమ్మడు నేను శైలజ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది. ఈ మూవీతోనే అందరి మనసు దోచేసుకుంది. మొదటి మూవీతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ చిన్నది తర్వాత నాని సరసన నేను లోకల్ మూవీలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ మూవీతో ఈ అమ్మడుకు విపరీతంగా క్రేజ్ పెరిగింది. తర్వాత చాలా సినిమాల్లో అవకాశాలు అందుకుంది. వరసగా సినిమాలు చేసి మంచి ఫే మ్ సంపాదించుకుంది. ముఖ్యంగా మహానటి మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీలో అచ్చం సావిత్రిలా నటించి, విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ తర్వాత కీర్తి స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా, టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగింది. ఇక తర్వాత నాని సరసన దసరా మూవీలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ ఏషనాగుల కట్ట మీద ట్రెండ్ అవుతుంది. అదే సమయంలో ఈ ముద్దుగుమ్మ ఓనం పండుగకు సంబంధించిన ఫొటోలను షేర్ చేయడంతో అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఎర్ర బెండకాయలను ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదో తెలుసా? సూర్యుడు అస్తమించని ఏడు ప్రదేశాలు ఇవే.. అక్కడి వారు ఎలా నిద్రపోతారో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? చెవులు లేకుండా పాములు ఎలా వింటాయి?

నటి కీర్తి సురేష్ (Keerthy Suresh :) ఓనం పండుగ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నాకు అత్యంత ఇష్టమైన కొందరితో కిక్కిరిసిన అయినా అందమైన ఓనం పండుగ. చాలా సధ్యలు గుక్కలు గుక్కాము, కాస్త ఎక్కువగానే నవ్వాము, ఇక ఇదంతా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడానికి కాస్త సమయం పట్టింది. అంటూ రాసుకొచ్చింది

టీజర్‌ను రిలీజ్ చేసిన ప్రముఖ నటుడు తణికెళ్ల భరణి మహారత్న ప్రొడక్షన్స్, ఎస్కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను తణికెళ్ల భరణి విడుదల చేశారు. ఈ మేరకు తణికెళ్ల భరణి మాట్లాడుతూ .. ‘సురేష్ కొండేటి సామాన్య జర్నలిస్ట్ నుంచి పత్రికాధినేతగా ఎదగడం మామూలు విషయం కాదు. ‘సంతోషం’ అనే పేరులోనే ఓ పాజిటివిటీ ఉంది. ‘ప్రేమనే ఊరిలో’ చిత్రంతో తండ్రి గొప్పదనం చక్కగా చూపించారనిపిస్తోంది. నేను గతంలో చెప్పిన నాన్న మీద కవిత ఎంతగానో ప్రాచుర్యం పొందింది. తండ్రే తల్లిలా పెంచిన కథతో ‘ప్రేమనే ఊరిలో’ సినిమాని తీశారు. ప్రేమతో దేన్నైనా సాధించగలం. అలాంటి ప్రేమతో తీసిన ఈ చిత్రాన్ని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. *నిర్మాత చందు శ్రీనివాస్ మాట్లాడుతూ* .. ‘మంచి సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ‘ప్రేమనే ఊరిలో’ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. మా టీజర్‌ను విడుదల చేసిన తణికెళ్ల భరణి గారికి థాంక్స్’ అని అన్నారు. సురేష్ కొండేటి మాట్లాడుతూ .. ‘‘ప్రేమనే ఊరిలో’ టీజర్ చూసిన తర్వాతే ఈ చిత్రాన్ని తెలుగు వారికి అందించాలని నిర్ణయించుకున్నాం. ఈ టీజర్‌కి శ్రీకాంత్ గారి వాయిస్ ఓవర్ అద్భుతంగా కుదిరింది. మా కోసం టీజర్ రిలీజ్ చేసిన తణికెళ్ల భరణి గారికి ధన్యవాదాలు. నాన్న ఎందుకో వెనకబడ్డారు అంటూ తణికెళ్ల భరణి గారు చెప్పిన మాటలు ఎప్పటికీ నిలిచిపోయింది. ఈ టీజర్ చూసిన తర్వాత నేను ఆయనతోనే ఈ టీజర్‌ను రిలీజ్ చేయాలని అనుకున్నాను. మా కోసం ఆయన టీజర్‌ను రిలీజ్

నటుడు సురేష్ తన కెరీర్‌లోని ఎత్తుపల్లాలు, పరిశ్రమపై తన వ్యక్తిగత దృక్పథాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన కెరీర్లో వచ్చిన విరామం గురించి ప్రశ్నించగా, అది ఇండస్ట్రీ ఇచ్చినది సగం, తాను స్వచ్ఛందంగా తీసుకున్నది సగం అని వివరించారు. చివరి సన్నివేశంలో కనిపించి శుభం కార్డు వేయడానికి ఉపయోగపడే రబ్బర్ స్టాంప్ పాత్రలు తనకు ఇష్టం లేవని స్పష్టం చేశారు. ఒక సినిమాలో తాను ఏదైనా కాంట్రిబ్యూట్ చేయలేనప్పుడు, ఆ పాత్ర చేయాల్సిన అవసరం లేదని భావించేవాడినని చెప్పారు. మొదటి నుంచి పని తక్కువ ఉన్న హీరో పాత్రల కంటే, పని ఎక్కువ ఉన్న విలన్ పాత్రల పట్ల ఎక్కువ ఆసక్తి చూపానని సురేష్ పేర్కొన్నారు. పరిశ్రమలో తోటి నటులతో తన స్నేహ సంబంధాలపై మాట్లాడుతూ, జగపతిబాబు, సుమన్, శ్రీకాంత్, ఉత్తేజ్ వంటి వారితో తనకు చక్కటి అనుబంధం ఉందని తెలిపారు. ఎక్కువమంది చదివినవి : Hemachandra : శ్రావణ భార్గవితో విడాకులు ?.. రూమర్స్ పై స్పందించిన హేమచంద్ర.. ఏమన్నారంటే.. ముఖ్యంగా జెడి చక్రవర్తి గురించి ప్రస్తావిస్తూ, తనను ఫ్రాడ్ 420 అని చనువుగా పిలుస్తానని, వారిద్దరి మధ్య ఉన్న ప్రత్యేక స్నేహాన్ని వివరించారు. జెడి చక్రవర్తి స్వభావం చాలా ప్రత్యేకమైనదని, అతని మనసులో ఏముందో అంచనా వేయడం కష్టమని, అతనికి కూడా తెలియదేమో అని సరదాగా అన్నారు. జెడితో తను ఏదైనా మాట్లాడగలనని, అతను తనతో ఏదైనా చెప్పగలడని, ఎందుకంటే ఇద్దరూ అంత స్పోర్టివ్‌గా తీసుకుంటారని తెలిపారు. ఎక్కువమంది చదివినవి : Cinema : ఓటీటీలో వణుకు పుట్టించిన సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మైండ్ బ్లాకింగ్ హారర్ మూవీ.. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి స్టార్ హీరోల విజయాలను తన సమకాలికుల పోటీగా కాకుండా, వారి పుణ్యం, కర్మ ఫలితంగా చూస్తానని సురేష్ వివరించారు. పెద్ద ఫ్యామిలీలో పుట్టినంత మాత్రాన అందరూ విజయం సాధించలేరని, అందుకు దాసరి

హీరోగా ఎంట్రీ ఇస్తున్న 'కింగ్డమ్' మురుగన్: విలన్ వద్దు.. హీరో ముద్దు.! ఈ వార్తకు సంబంధించిన

విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమాకు టైటిల్ ఖరారైంది. ఇంతవరకు #VenkyAnil5, #NKRAR2 పేర్లతో ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి ‘జనవరి 12 విడుదల’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్‌ను ప్రత్యేక వీడియో ద్వారా ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు నివాళిగా ‘అప్పుల అప్పారావు’లోని ఓ హాస్య సన్నివేశాన్ని గుర్తు చేస్తూ వీడియోను మొదలుపెట్టారు. ఈవీవీ సత్యనారాయణ తనకు స్ఫూర్తి అని అనిల్ రావిపూడి పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే.వెంకటేశ్, కల్యాణ్‌రామ్, కీర్తి సురేశ్, కృతిశెట్టి కలిసి అనిల్ రావిపూడిని సినిమా టైటిల్ ఏంటని అడుగుతారు. అందుకు ఆయన ఎలాంటి తడబాటు లేకుండా ‘జనవరి 12 విడుదల’ అని చెబుతారు. దీంతో నటీనటులు కాసేపు అయోమయానికి గురవుతారు. తాము విడుదల తేదీ గురించి కాదు.. టైటిల్ గురించి అడిగామని చెబుతారు. చివరికి అదే సినిమా టైటిల్ అని అనిల్ వెల్లడించడంతో వీడియో ముగుస్తుంది.కొద్ది రోజుల క్రితం వెంకటేశ్ ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సినీ పరిశ్రమలో ఆయన 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పోస్టర్‌ను తీసుకొచ్చారు. ఇందులో లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్‌రెడ్డిగా వెంకటేశ్ కనిపించారు.భారత సైన్యంలో పనిచేసే ఈ అధికారి కౌంటర్ టెర్రరిజం, బందీలను రక్షించే కార్యకలాపాల్లో నిపుణుడిగా ఉంటారని పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఆర్మీ దుస్తుల్లో, సన్‌గ్లాసెస్‌తో, ఓ కారు

అనిల్ రావిపూడి ఏం చేసినా ప్రేక్షకుల దృష్టిని వెంటనే ఆకర్షిస్తుంటారు. ఆయన సినిమాల టైటిల్స్ విషయంలోనూ ఇదే ప్రత్యేకత కనిపిస్తుంది. గతంలో సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ప్రకటించినప్పుడు కొందరు విమర్శలు, సెటైర్లు చేసినప్పటికీ, ఆ సినిమా విడుదలైన తర్వాత భారీ విజయాన్ని అందుకుంది. ప్రాంతీయ సినిమా పరిశ్రమలో పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాకు కూడా ఆసక్తికరమైన టైటిల్‌ను ఎంచుకున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు 'జనవరి 12 విడుదల' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు. దానికి అనుగుణంగానే సినిమా టైటిల్ కూడా ఫైనల్ చేశారు. టైటిల్‌ను ప్రకటిస్తూ చిత్రబృందం విడుదల చేసిన వీడియో కూడా సరదాగా సాగింది. ఇందులో వెంకటేష్, కల్యాణ్ రామ్‌తో పాటు కీర్తి సురేష్, కృతి శెట్టి కనిపించారు. జనవరి 12 విడుదల అనే మాట విన్న కీర్తి సురేష్, కృతి శెట్టి అది సినిమా టైటిల్ అనుకోవాలా, లేక విడుదల తేదీ అనుకోవాలా అన్న అయోమయంలో పడతారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి అసలు విషయాన్ని వివరిస్తారు. సినిమా పేరు కూడా జనవరి 12 విడుదలేనని, విడుదల తేదీ కూడా జనవరి 12నే అని చెబుతారు. ఈ సందర్భంగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఓ పాత సినిమాలోని క్లిప్‌ను స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలుస్తోంది. టైటిల్ ప్రకటన వీడియోలోని కామెడీ, హీరోలతో పాటు హీరోయిన్లను కూడా భాగం చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు బావ బామ్మర్ది సౌజన్యంతో అనే ట్యాగ్‌లైన్‌ను కూడా ఖరారు చేశారు. వెంకటేష్, కల్యాణ్ రామ్ కలయిక నేపథ్యంలో ఈ ట్యాగ్‌లైన్ మరింత ఆసక్తిని పెంచుతోంది. అసలు జనవరి 12 విడుదలతో అనిల్ రావిపూడి ఎలాంటి కథను చెప్పబోతున్నారు, బావ బామ్మర్ది సౌజన్యంతో అనే ట్యాగ్‌లైన్ వెనుక

Anirudh Ravichander Girlfriends:సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అనిరుధ్ రవిచందర్ పేరు చాలా పాపులర్. పాటలతోనే కాకుండా తన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో కూడా సినిమాలకు మంచి హైప్ తీసుకురావడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో అనిరుధ్ ఇచ్చే ఎలివేషన్ మ్యూజిక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. విక్రమ్, జైలర్, దేవర వంటి సినిమాల్లో ఆయన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు మంచి స్పందన వచ్చింది. ఒక సాధారణ సన్నివేశాన్ని కూడా తన మ్యూజిక్‌తో మరింత ప్రభావవంతంగా మార్చడం అనిరుధ్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. దీంతో తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అనిరుధ్ వ్యక్తిగత జీవితం గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆయన కావ్య మారన్‌ను పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి. కొంతకాలంగా వీరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నప్పటికీ, తాజాగా ఈ వార్తలు మరోసారి వైరల్‌గా మారాయి. నవంబర్ 10న గ్రీస్‌లో వీరి వివాహం జరగనుందని కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అనిరుధ్ గతంలో ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా అనే చర్చ కూడా మొదలైంది. గతంలో ఆయనకు కొందరు హీరోయిన్లతో సంబంధం ఉందంటూ పలు రూమర్స్ వచ్చాయి. ముఖ్యంగా నటి ఆండ్రియాతో అనిరుధ్ డేటింగ్ చేశారనే వార్తలు ఒకప్పుడు బాగా ప్రచారంలోకి వచ్చాయి. వీరిద్దరి వ్యక్తిగత ఫొటోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అలాగే హీరోయిన్ కీర్తి సురేష్‌తో కూడా అనిరుధ్ ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను కీర్తి సురేష్ ఖండించారు. అనిరుధ్ తనకు మంచి స్నేహితుడు మాత్రమే అని ఆమె అప్పట్లో స్పష్టం చేసినట్లు కథనాలు వచ్చాయి. ఇక అనిరుధ్‌తో ఎక్కువగా పాటలు పాడిన సింగర్ జోనితా గాంధీతో కూడా ఆయన రిలేషన్లో ఉన్నారనే

విక్టరీ వెంకటేష్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రానికి టైటిల్ ఖరారైంది. "జనవరి 12 విడుదల బావ బామ్మర్ది సౌజన్యంతో" అనే ఆసక్తికరమైన శీర్షికను చిత్ర బృందం అధికారికంగా ఎంపిక చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. టైటిల్ ద్వారానే ఇది పూర్తి స్థాయి ఫ్యామిలీ మరియు కామెడీ ఎంటర్టైనర్ అని స్పష్టమవుతోంది. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన శైలిలో ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే వరుస బ్లాక్‌బస్టర్ హిట్లతో దూసుకుపోతున్న ఈ దర్శకుడు, ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ హీరోలను ఒకే స్క్రీన్‌పై చూపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో మరియు సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కీర్తి సురేష్, కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తూ సందడి చేయనున్నారు. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే మార్కెట్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇదిలా ఉండగా, షూటింగ్ ఇప్పటికే సగం వరకు పూర్తి చేసుకున్నట్లు సమాచారం అందింది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ పక్కా ప్లానింగ్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఫలితంగా, జనవరి 12న బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్ద పోటీని ఇవ్వనుంది. వెంకటేష్ మరియు కళ్యాణ్ రామ్ కెమిస్ట్రీ వెండితెరపై ఎలా ఉండబోతుందో చూడాలి. పండుగ రోజున కుటుంబ ప్రేక్షకులను అలరించడానికి ఈ సినిమా సిద్ధమవుతోంది. అనిల్ రావిపూడి మరోసారి

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ప్లాన్ చేసిన హాలీవుడ్ ప్రాజెక్ట్ ‘అబు – థీఫ్ ఆఫ్ బాగ్దాద్’ గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. కోలీవుడ్ ప్రముఖ దర్శకులు పుష్కర్ మరియు గాయత్రి ఒక ఇంటర్వ్యూలో ఈ భారీ ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించారు. 1999 సమయంలోనే చిరంజీవి గ్లోబల్ స్థాయిలో తన ముద్ర వేసేందుకు ఈ ఇంగ్లీష్ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేశారు. అప్పట్లోనే దాదాపు 40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ ఫ్యాంటసీ అడ్వెంచర్ ప్రాజెక్ట్‌ను రూపకల్పన చేశారు. భారత్‌తో పాటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, అమెరికా దేశాల్లో షూటింగ్ జరిపేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. భారతీయ దర్శకుడు సురేష్ కృష్ణతో పాటు ఒక అమెరికన్ డైరెక్టర్ కూడా ఈ సినిమాకు కలసి పనిచేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో పుష్కర్ కెమెరా విభాగంలో, గాయత్రి దర్శకత్వ విభాగంలో సాంకేతిక నిపుణులుగా బాధ్యతలు నిర్వహించారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి విదేశీ నటీనటులను ఎంపిక చేయడంతో పాటు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌ను సంగీత దర్శకుడిగా నిర్ణయించారు. దీనికి సంబంధించి కొంత భాగం చిత్రీకరణ కూడా వేగంగా పూర్తి చేశారు. అయితే షూటింగ్ సమయంలో ఖురాన్ పేజీలకు సంబంధించిన వివాదాలు, మతపరమైన సున్నితమైన అంశాలు హఠాత్తుగా తెరపైకి వచ్చాయి. దీంతో అనూహ్య రీతిలో నిరసనలు వ్యక్తమై కోర్టు వివాదాలు చుట్టుముట్టడంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఈ సినిమా పూర్తయి విడుదలై ఉంటే చిరంజీవి రేంజ్ అంతర్జాతీయ స్థాయిలో వేరేలా ఉండేదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫలితంగా ఆ రోజుల్లోనే పాన్-వరల్డ్ స్టార్‌గా ఆయన నిలిచే అవకాశాన్ని తృటిలో కోల్పోయారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన చిరంజీవి, హాలీవుడ్లో కూడా తన జెండా పాతేందుకు తీవ్రంగా ప్రయత్నించారని ఈ ఘటన నిరూపిస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్ ఆగిపోయినప్పటికీ, ఆ

హైదరాబాద్: బాంబు బూచితో ఓ వ్యక్తి శంషాబాద్ ఎయిర్‌పోర్టు భద్రతాధికారులను కంగారు పెట్టాడు. మంగళవారం సాయంత్రం 6ఈ–208 విమానం 181 మందితో ఏపీలోని భోగాపురం బయల్దేరేందుకు సిద్ధమైంది. దాంట్లో ప్రయాణించాల్సిన సురేష్.. విమానం ఎక్కి కూర్చున్నాక తన బ్యాగులో బాంబు ఉందని అధికారులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన అధికారులు అతడిని మరోసారి ప్రశ్నించగా... తనకు వేరేవారు చెప్పారని సమాధానమిచ్చాడు. దీంతో తనిఖీలు ప్రారంభించారు. విమానంలోని అందరినీ దించేసి లగేజీలను పరిశీలించారు. బాంబు లేదని నిర్ధారించుకున్నారు. సాయంత్రం 5.25కు బయల్దేరాల్సిన విమానం రాత్రి 7.20కు టేకాఫ్ తీసుకుంది. సురేష్‌ను విమానాశ్రయ పోలీస్‌లు అదుపులోకి తీసుకుని, ఔట్‌పోస్టు పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు. దుబాయ్ విమానంలో సాంకేతిక లోపం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్–951 విమానం మంగళవారం రాత్రి 7.15కు శంషాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమైంది. కొద్ది క్షణాల ముందు పైలట్లు సాంకేతిక సమస్య గుర్తించడంతో ఎయిర్‌క్రాఫ్ట్ ఆన్ గ్రౌండ్‌ను ప్రకటించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో రాత్రి 10కి బయల్దేరింది. కేబీఆర్ ట్రాఫిక్ ‘ట్రాప్’.. ఎటు వెళ్లాలో తెలియక జనం పరేషాన్!(చిత్రాలు) చీరకట్టులో మంత్రముగ్ధం చేస్తున్న శ్రీలీల అందం ...(ఫొటోలు) అదితి రావు స్టన్నింగ్ లుక్స్.. సిద్ధార్థ్‌తో స్పెషల్ మూమెంట్స్! (ఫొటోలు) సినీ నటి అయేషా ఖాన్ నిశ్చితార్థం ...? (ఫొటోలు) అదిరిపోయే లుక్స్‌తో రాశి ఖన్నా.. (ఫొటోలు) అద్దంకి సాక్షిగా చెప్తున్నా... గంజాయి దొరికిన కార్ దగ్గరికి వెళ్లి చూస్తే.. వంద రోజుల్లో గంజాయి నిర్మూలిస్తామన్న హోంమంత్రి ఇప్పుడు ఎక్కడ ? ఒక్కసారి అద్దంలో చూసుకో.. బొత్సపై అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు.. నాగమల్లీశ్వరి అదిరిపోయే కౌంటర్ అడ్డంగా బుక్కయ్యారు.. తండ్రీకొడుకులకు CBI ఫీవర్

‘హుషార్ పిట్టలు’ టీంని చూస్తే ఎంతో గర్వంగా ఉంది.. విజయోత్సవ వేడుకలో ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ అన్ష్, వాసవి గణేషన్ జంటగా రూపొందిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'హుషార్ పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మించిన ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు ఆగస్ట్ 15న భారీ ఎత్తున విడుదలైంది. గత నాలుగైదు రోజులుగా వేస్తున్న ప్రీమియర్లకు ఆల్రెడీ అద్భతమైన స్పందన వచ్చింది. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆదివారం నాడు సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు, బెక్కం వేణుగోపాల్ గార్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో.. ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు మాట్లాడుతూ .. ‘‘హుషార్ పిట్టలు’ సినిమాని ఇప్పటి వరకు లక్ష మంది చూశారు. దాదాపు కోటి ముప్పై లక్షల గ్రాస్ వచ్చింది. కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ సినిమాని చూస్తారు. ప్రీమియర్ల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. టీజర్, ట్రైలర్ ద్వారా మంచి బజ్ ఏర్పడింది. సక్సెస్ అవ్వడంతో టీం అంతా సంతోషంగా ఉంది. చాలా ఏళ్లకి మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్‌కి బ్రేక్ వచ్చింది. ఇంకా పది, ఇరవై లక్షల మంది సినిమాని చూస్తే టీంకు లాభాలు వస్తాయి. కంటిన్యూగా పబ్లిసిటీ చేయండి. కోరుకున్న విజయం దక్కుతుంది. బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ .. ‘ఎన్నో చిన్న చిత్రాలు తీసి సక్సెస్‌ను చూశాను. మళ్లీ ఈ ‘హుషార్ పిట్టలు’ మూవీని అందరితో కలిసి థియేటర్లో చూసి, ఆ సక్సెస్‌ను చూడటం ఆనందంగా అనిపించింది. అన్ని థియేటర్లు హౌస్ ఫుల్స్ అయ్యాయి. కంటెంట్ బాగుంటే కచ్చితంగా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రంలో స్టార్స్ లేకపోయినా.. స్టార్ హీరో
విక్టరీ వెంకటేష్ , నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. వినోదానికి సరికొత్త హంగులు అద్ది, పక్కా కమర్షియల్ హంగులతో రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఏమాత్రం విరామం లేకుండా నిరంతరాయంగా చిత్రీకరణ జరుపుతోంది.చిత్ర యూనిట్ నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. దర్శకుడు అనిల్ రావిపూడి ఆదివారాలు, పండుగ సెలవులు అనే తేడా లేకుండా ఏకధాటిగా షూటింగ్ పనులను ముందుకు నడిపిస్తున్నారు. సంక్రాంతి నాటికి విడుదల చేయాలన్న పక్కా ప్రణాళికతో టీమ్ మొత్తం రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. వేగంతో పాటు అవుట్‌పుట్ విషయంలో కూడా రాజీపడకుండా ప్రతి సన్నివేశాన్ని ఎంతో గ్రాండ్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటివరకు పూర్తి చేసుకున్న విజువల్స్ క్వాలిటీ అద్భుతంగా వచ్చిందని, థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.* కావేరీ పాత్ర కోసం చాలా కష్టపడ్డా... ‘ఇరుముడి’లో సెంటిమెంట్‌తో పాటు మంచి మెసేజ్ ఉంటుంది - ప్రియా భవానీకల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్ఈ సినిమాలో వెంకటేష్ పోషిస్తున్న పాత్ర కథకి ప్రధాన బలంగా నిలవనుంది. ఆర్మీలోని కౌంటర్-టెర్రరిజం, బందీల విముక్తి విభాగంలో పనిచేసే 'లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి' అనే మోస్ట్ పవర్ఫుల్ సైనిక అధికారి పాత్రలో ఆయన కనిపించనున్నారు. చిత్ర పరిశ్రమలో 40 ఏళ్ల మైలురాయిని పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలైన వెంకటేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. మిలిటరీ గెటప్‌లో వెంకటేష్ చూపించిన గాంభీర్యం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా రెట్టింపు చేసింది.అనిల్ మార్క్ ఎంటర్టైన్మెంట్అనిల్ రావిపూడి అనగానే గుర్తొచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్, కడుపుబ్బా నవ్వించే హాస్యానికి ఈసారి భారీ యాక్షన్, ఆర్మీ నేపథ్యాన్ని జోడించి సినిమాను అత్యున్నత ప్రమాణాలతో మలుస్తున్నారు. ఇందులో వెంకటేష్‌కు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకిలో మద్యం మత్తులో ఓ యువకుడు చేసిన పని నెట్టింట అందరినీ షాక్‌కు గురి చేసింది. ఏకంగా కొండచిలువను పట్టుకుని మెడలో వేసుకోవడం కలకలం రేపింది. లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకిలో మద్యం మత్తులో ఓ యువకుడు చేసిన పని నెట్టింట అందరినీ షాక్‌కు గురి చేసింది. ఏకంగా కొండచిలువను పట్టుకుని మెడలో వేసుకోవడం కలకలం రేపింది. జనావాసాల మధ్యకు వచ్చిన పామును మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు పట్టుకున్నాడు. అనంతరం దానితో ఆడుకుంటూ హంగామా చేశాడు. దీంతో కొండచిలువ, యువకుడికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌గా మారింది. స్థానికుల కథనం ప్రకారం.. శుక్రవారం రాత్రి సమయంలో బారాబంకి ప్రాంతంలోకి ఓ కొండచిలువ వచ్చింది. స్థానికంగా ఉన్న మాంసం దుకాణంలోని మేకను తినేందుకు లోపలికి వెళ్లింది. దీనిని గమనించిన షాపు యజమాని తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు. అంత పెద్ద పామును ఒక్కసారిగా చూడటంతో షాక్ అయ్యాడు. షాపు యజమాని వెంటనే గట్టిగా కేకలు వేయడంతో స్థానికులంతా పెద్దఎత్తున గుమిగూడారు. 15 అడుగుల కొండచిలువను వారంతా ఆశ్చర్యంగా చూశారు. ఇంతలో మద్యం మత్తులో ఉన్న సురేశ్ అనే యువకుడు అక్కడికి వచ్చాడు. పామును చూసిన వెంటనే ఎలాంటి భయం లేకుండా నేరుగా దాని వద్దకు వెళ్లాడు. పట్టుకునేందుకు ప్రయత్నించగా యువకుడిని అది రెండు సార్లు కాటు వేసింది. కొండచిలువకు విషం ఉండకపోవడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, పాము దాడిని ఏమాత్రం లెక్కచేయని సురేశ్ తన చేతులతోనే దానిని పట్టుకున్నాడు. ఈ క్రమంలో అది అతని చేతిని పలుమార్లు చుట్టేసింది. మద్యం మత్తులో సురేశ్ చేసిన సాహసానికి స్థానికులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ తర్వాత పాముతో అతను కాసేపు విన్యాసాలు చేశాడు. దానిని ఏకంగా తన మెడలో వేసుకుని హంగామా చేశాడు. అనంతరం పెద్ద పాత్రలో బంధించి దూరంగా తీసుకెళ్లి వదిలిపెట్టారు. కాగా, ఈ తతంగం మొత్తాన్ని అక్కడున్న యువత తమ

విక్టరీ వెంకటేష్(Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ కీలక పాత్రల్లో దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. విక్టరీ వెంకటేష్(Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ కీలక పాత్రల్లో దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సంక్రాంతి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో షూటింగ్‌ను ఎలాంటి బ్రేక్ లేకుండా శరవేగంగా పూర్తి చేసే పనిలో చిత్రబృందం నిమగ్నమైంది. ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అనిల్ క్షణం తీరక లేకుండా సినిమా షూటింగ్ చేస్తున్నారట. ఆదివారాలు, సెలవులు అనే తేడా లేకుండా టీమ్ షూటింగ్ చేస్తోందట. సంక్రాంతి విడుదలను టార్గెట్‌గా పెట్టుకుని వీలైనంత త్వరగా చిత్రీకరణను పూర్తి చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పూర్తయిన సన్నివేశాల అవుట్‌పుట్ కూడా అద్భుతంగా వస్తున్నట్లు చిత్రబృందం చెబుతోంది. ప్రాజెక్ట్ విషయంలో నిర్మాణ సంస్థ, దర్శకుడు ఎక్కడా రాజీపడటం లేదని తెలుస్తోంది. భారీ స్కేల్‌తో పాటు అత్యున్నత నిర్మాణ విలువలను పాటిస్తూ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. థియేటర్లలో ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు గ్రాండ్ విజువల్ ఎక్స్పీరియన్స్ అందించేలా ప్రతి అంశాన్ని పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. (VenkyANIL5 - #NKRAR2) అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్, ఎంటర్టైన్మెంట్కు ఈసారి మరింత భారీ స్కేల్‌ను జోడిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వెంకటేష్–కళ్యాణ్ రామ్ కాంబినేషన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇందులో వెంకటేష్ ‘లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి’ అనే పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి

అందంగా ట్రెండింగ్ హీరోయిన్ రుక్మిణి వసంత్ సరికొత్త లుక్‌లో మాయ చేస్తున్న ప్రీతి ముకుందన్ స్టైల్ మార్చిన హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక బ్లాక్ డ్రస్‌లో ఓర చూపులతో కృతిశెట్టి రచ్చ 'విశ్వనాథ్ అండ్ సన్స్' జ్ఞాపకాలతో భవానీ శ్రీ ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఫొటోలతో కీర్తి సురేశ్ ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా పటేల్ (ఫొటోలు) ‘వణక్కం జెన్‌జీ’.. సీఎంగా విజయ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే (ఫొటోలు) హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ బర్త్ డే వైబ్స్.. ఫోటోలు 'డార్క్ చాక్లెట్' సినిమా మొదటి పాట లాంచ్ (ఫొటోలు) బాక్ల్ డ్రెస్‌లో మైండ్ బాక్ల్ చేస్తున్న కృతిశెట్టి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ SBI నుంచి మరో కొత్త స్కీం.. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు ఇక పండగే నిన్ను సూటిగా ఒక్కటే అడుగుతున్నా.. లోకేష్ కు ఇచ్చిపడేసిన మహిళా మిస్టరీ మర్డర్.. 15 నిమిషాల్లో 27 కత్తిపోట్లు..! మంత్రి ఇలాకాలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు మద్యం సరఫరా

On This Day In Cricket: స్వాతంత్య్ర దినోత్సవం నాడు దేశమంతా సంబరాల్లో ఉండగా, భారత క్రికెట్ అభిమానుల గుండెలు మాత్రం ముక్కలయ్యాయి. సరిగ్గా 2020 ఆగస్టు 15వ తేదీన ఎంఎస్ ధోనీ, సురేష్ రైనా ఏకకాలంలో అంతర్జాతీయ ఆటకు గుడ్‌బై చెప్పి యావత్ క్రీడాలోకాన్ని కన్నీట ముంచారు. ఆ భావోద్వేగ క్షణాలకు నేటితో సరిగ్గా ఆరేళ్లు. భారత చరిత్రలో ఆగస్టు 15 ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎర్రకోట నుంచి గల్లీ వరకు ప్రతి భారతీయుడు పండుగ చేసుకునే ఆ రోజున, సామాజిక మాధ్యమాల్లో ధోనీ పెట్టిన ఓ చిన్న పోస్ట్ సునామీ సృష్టించింది. తనదైన శైలిలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా నిశ్శబ్దంగా ఆట నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆ షాక్ నుంచి అభిమానులు తేరుకోకముందే, అతడి బాటలోనే నడుస్తూ సురేష్ రైనా కూడా అదే రోజున అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఇద్దరు పంచుకున్న భావోద్వేగ వీడ్కోలు సందేశాలు, వారి నిరాడంబర వీడ్కోలు ఇప్పటికీ అభిమానుల కళ్లలో నీళ్లు తెప్పిస్తాయి. ఎక్కువమంది చదివినది: 41 సిక్సర్లు, 39 ఫోర్లతో 487 పరుగులు.. భారీ ప్రపంచ రికార్డ్‌తో టీ20 హిస్టరీనే షేక్ చేశారుగా..! క్రికెట్ చరిత్రలో ఎంతో మంది ఆటగాళ్లు వస్తుంటారు, పోతుంటారు. ధోనీ, రైనాల ప్రయాణం మాత్రం చాలా ప్రత్యేకం. జాతీయ జట్టులో అయినా, ఫ్రాంచైజీ క్రికెట్లో అయినా వీరిద్దరి కలయిక అద్భుత విజయాలను అందించింది. మిడిల్ ఆర్డర్లో వీరు క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపించేవి. విజయాలైనా, అపజయాలైనా ఏనాడూ విడిపోకుండా కలిసి పంచుకునేవారు. కేవలం సహచర ఆటగాళ్లుగానే కాకుండా ఒకరికొకరు సోదరుల్లా ఎదిగారు, వీరి అద్భుతమైన బంధం ఎప్పుడూ క్రికెట్ అనే ఆట కంటే గొప్పదిగానే నిలిచింది. ఎక్కువమంది చదివినది: IND vs ENG: ప్రపంచ రికార్డ్‌తో వైభవ్ బీభత్సం గుర్తుందా.. బుడ్డోడి ఊచకోతకు బలైన ఇంగ్లాండ్..! చెరిగిపోని జ్ఞాపకాలు.. సైలెంట్ వీడ్కోలు.. క్రికెట్ మైదానంలో

తెలుగు చిత్రసీమలో విక్టరీ వెంకటేష్ తన సినీ ప్రస్థానంలో 40 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. 1986 ఆగస్టు 14న కలియుగ పాండవులు సినిమాతో కథానాయకుడిగా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆయన, సరిగ్గా నాలుగు దశాబ్దాల తర్వాత అదే తేదీన అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆగస్టు 14న దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గరపటి, సురేష్ ప్రొడక్షన్స్ బృందం సంయుక్తంగా ఆయన కొత్త చిత్రాన్ని ప్రకటించాయి. ఈ ప్రత్యేక సందర్భంగా వెంకటేష్‌ను లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా పరిచయం చేస్తూ శక్తివంతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. వెంకటేష్ 1986లో తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించి బ్రహ్మపుత్రుడు, స్వర్ణకమలం, ప్రేమ, బొబ్బిలి రాజా, చంటి, దృశ్యం, గురు, ఎఫ్2 వంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలతో అలరించారు. కుటుంబ కథా చిత్రాల నుండి పవర్ ఫుల్ యాక్షన్ సినిమాల వరకు ప్రతి విభాగంలోనూ తనదైన ముద్ర వేసి విక్టరీ అనే బిరుదును సార్థకం చేసుకున్నారు. ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు అనేక నంది పురస్కారాలను అందుకొని నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ నూతన చిత్రం వెంకీఅనిల్5 మరియు ఎన్‌కేఆర్‌ఏఆర్2గా ప్రచారంలో ఉంది. విడుదల చేసిన పోస్టర్లో వెంకటేష్ కాంబాట్ కామోఫ్లాజ్ యూనిఫాం, సన్‌గ్లాసెస్, స్కార్ఫ్‌తో చాలా కమాండింగ్‌గా కనిపించారు. కౌంటర్-టెర్రరిజం మరియు హోస్టేజ్ నెగోషియేషన్‌లో నిపుణుడైన ఆర్మీ అధికారిగా ఆయన పాత్ర ఉండబోతోందని చిత్ర బృందం స్పష్టం చేసింది. దీంతో ఈ ఆర్మీ ఆఫీసర్ అవతార్ సోషల్ మీడియాలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదిలా ఉండగా బ్యాక్‌డ్రాప్‌లో ఆర్మీ ఇన్సిగ్నియా, క్రాస్డ్ స్వోర్డ్స్ సింబల్ మరియు లగ్జరీ కారు పక్కన ఆయన నిలబడి ఉన్న శైలి సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి తన ఎక్స్ ఖాతాలో వెంకటేష్‌తో కలిసి పనిచేయడం ఎంతో గౌరవంగా ఉందని రాసుకొచ్చారు

హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని డెక్కన్ కిచెన్ ప్రాపర్టీ వివాదంలో నటులు దగ్గుబాటి వెంకటేశ్, రానా దగ్గుబాటిలకు తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని దగ్గుబాటి కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎన్. తుకారాంజీ ఇటీవల తోసిపుచ్చారు. దీంతో నాంపల్లి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసు విచారణ యథాతథంగా కొనసాగనుంది. ఈ వ్యవహారంలో నటులతో పాటు నిర్మాత డి. సురేష్ బాబు, డి. అభిరామ్, అకౌంటెంట్ గడ్డం విశ్వనాథం కూడా క్రిమినల్ విచారణను ఎదుర్కోనున్నారు. ఈ వివాదం మూలాలు 2014 కాలం నాటి లీజు ఒప్పందంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ సమయంలో దగ్గుబాటి కుటుంబం తమ భూమిని డబ్ల్యూ3 హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు లీజుకు ఇవ్వగా, వ్యాపారవేత్త కొరే నందు కుమార్ అక్కడ డెక్కన్ కిచెన్ రెస్టారెంట్ ఏర్పాటుకు భారీ పెట్టుబడులు పెట్టారు. అయితే 2018 నుంచి ప్రాపర్టీ లీజు హక్కులు, స్థలం స్వాధీనం విషయంలో ఇరువర్గాల మధ్య తీవ్ర విభేదాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత 2022 నవంబర్‌లో జీహెచ్ఎంసీ అధికారులు ప్రాంగణంలోని కొన్ని నిర్మాణాలను పాక్షికంగా కూల్చివేశారు. హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు అమలులో ఉన్నప్పటికీ 2024 జనవరిలో నిర్మాణాలను పూర్తిగా కూల్చివేశారని బాధితుడు నందు కుమార్ కోర్టును ఆశ్రయించారు. దీంతో దగ్గుబాటి కుటుంబ సభ్యులు అధికారుల సహకారంతో లీజు ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశించి, ఆస్తులను ధ్వంసం చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డారని ప్రైవేట్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హౌస్ ట్రెస్పాస్, దొంగతనం, క్రిమినల్ కుట్ర వంటి తీవ్రమైన సెక్షన్ల కింద నమోదు చేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించింది. క్రిమినల్ కేసును రద్దు చేయాలంటూ దగ్గుబాటి కుటుంబం 2024 లోనే హైకోర్టును ఆశ్రయించి తమ వాదనలను బలంగా వినిపించింది. ఇది కేవలం లీజు, ఆస్తుల స్వాధీనానికి సంబంధించిన సివిల్ వివాదమని, కాబట్టి క్రిమినల్ ప్రొసీడింగ్స్ సరికాదని

ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మాణంలో, వాచస్పతి దర్శకత్వంలో రూపొందుతున్న సరికొత్త సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'మిస్సింగ్ మేఘన'. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల కాగా, తాజాగా లెజెండరీ ప్రొడ్యూసర్ డి. సురేష్ బాబు చేతుల మీదుగా ఈ చిత్రంలోని మొదటి పాట "పిల్ల పిల్ల పిల్ల"ను ఘనంగా లాంచ్ చేశారు. పాటను విడుదల చేసిన అనంతరం ప్రొడ్యూసర్ సురేష్ బాబు మాట్లాడుతూ... "పిల్ల పిల్ల పిల్ల" సాంగ్ మెలోడీ చాలా హాయిగా, బాగుందని మెచ్చుకుంటూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాత పంచుమర్తి నరేష్ బాబు మాట్లాడుతూ... తమ సినిమా పూజా కార్యక్రమాలు చారిత్రాత్మక రామానాయుడు స్టూడియోలోనే ప్రారంభమయ్యాయని, ఇప్పుడు అదే స్టూడియోస్ అధినేత, గోల్డెన్ హ్యాండ్ సురేష్ బాబు చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.ఆర్. ధృవన్ కాంబినేషన్లో తమకు ఇది రెండో ప్రాజెక్ట్ అని, ధృవన్ బాణీలు కట్టి, స్వయంగా రాసిన ఈ పాటను ప్రముఖ గాయకుడు జావేద్ అలీ అద్భుతంగా ఆలపించారని పేర్కొన్నారు. హీరో రామ్ కార్తీక్, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.ఆర్. ధృవన్ తమ సంతోషాన్ని పంచుకుంటూ... రామానాయుడు స్టూడియోస్ నుంచి ఈ పాట విడుదల కావడం ఒక మంచి అనుభూతిని ఇచ్చిందని చెప్పారు. దర్శకుడు వాచస్పతి ఈ చిత్రాన్ని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా మలిచారని, శామ్.కె.నాయుడు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. ఈ లాంచ్ కార్యక్రమంలో నిర్మాతలు బెక్కం వేణుగోపాల్, కో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గోపరాజు రమణ, నళిని, కౌశిక్, మహిపాల్ లాంటి సీనియర్ నటీనటులు ముఖ్య

రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా, వాచస్పతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్ సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్ చేతుల మీదుగా జరగగా ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘పిల్ల పిల్ల పిల్ల’ని నిర్మాత సురేష్ బాబు చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. ఫస్ట్ సింగిల్ పిల్ల పిల్ల పిల్ల సాంగ్ చాలా బాగుంది. మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానంటూ చిత్రబృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ..ఇండియన్ ఫిలిం ఫీల్డ్ లో సురేష్ ప్రొడక్షన్స్ కి ఉన్న పేరు మనందరికీ తెలుసు. సురేష్ బాబుచేతుల మీదుగా మా ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ నరేష్ గారికి, కో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న బెక్కం వేణుగోపాల్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాలో అద్భుతమైన పాటలు అందించిన ఆర్. ఆర్. ధృవన్ కి, అలాగే ఈ పాట పాడిన మనందరి ఫేవరెట్ సింగర్ జావేద్ అలీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిర్మాత నరేష్ మాట్లాడుతూ..‘మా సినిమా ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోలో జరిగింది. రామానాయుడు స్టూడియో అధినేత గోల్డెన్ హ్యాండ్ సురేష్ బాబు చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ ధృవన్ తో మాకు ఇది రెండో సినిమా. తంత్ర
భారత క్రికెట్ చరిత్రలో శ్రీలంక పర్యటనలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా 2000 తర్వాత లంక గడ్డపై ప్రతిష్టాత్మకమైన రెడ్ బాల్ క్రికెట్లో భారత్ తరఫున అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించిన ఆటగాళ్లు నలుగురు మాత్రమే ఉన్నారు. 2010లో అభిమన్యు మిథున్‌తో పాటు డాషింగ్ ఆల్ రౌండర్ సురేష్ రైనా లంకలోనే తమ తొలి టెస్ట్ మ్యాచ్ ఆడారు. ఆ తదుపరి 2015లో వికెట్ కీపర్ బ్యాటర్ నమన్ ఓజా, 2017లో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా శ్రీలంకలోనే భారత టెస్ట్ క్యాప్‌ను అందుకున్నారు.ఇప్పుడు 2026లో మరోసారి భారత్, శ్రీలంక వేదికగా టెస్టు సిరీస్ ఆడుతున్న తరుణంలో, ఈ ప్రతిష్టాత్మక జాబితాలోకి మరో నయా ప్లేయర్ వచ్చి చేరే అవకాశం కనిపిస్తోంది. జట్టులో చోటు దక్కించుకున్న యువ ఆటగాళ్లలో ప్రధానంగా ఆకిబ్ నబీ, సారాంశ్ జైన్, గుర్నూర్ బ్రార్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఏ ఒక్కరు గాలేలో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌లో తుది జట్టులోకి వచ్చినా, లంక గడ్డపై టెస్ట్ డెబ్యూ చేసిన ఐదో భారత ఆటగాడిగా నిలుస్తారు.రసవత్తరంగా సాగుతున్న ఈ రేసులో జమ్మూ కశ్మీర్‌కు చెందిన రైట్ ఆర్మ్ పేసర్ ఆఖిబ్ నబీ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన నబీ, రంజీ ట్రోఫీలో అత్యుత్తమ బౌలింగ్‌తో మెరిశాడు. అదే సమయంలో పంజాబ్ విజిట్ టూర్ నుంచి ఎదిగిన గుర్నూర్ బ్రార్ కూడా లంక-ఏ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లలో ఏకంగా 10 వికెట్ల సాధించి మేనేజ్మెంట్ దృష్టిని ఆకర్షించాడు. ఇక ఆల్ రౌండ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ కూడా తుది బెర్త్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు.శ్రీలంక పిచ్‌లపై స్పిన్‌తో పాటు లెంగ్త్ బౌలింగ్‌కు అనుకూలించే పరిస్థితులు ఉండటంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్ ఏ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతారనేది ఉత్కంఠగా మారింది. ఓవైపు సీనియర్ల అనుభవం, మరోవైపు యంగ్

అన్షు, వాసవీ గణేశన్ జంటగా నటించిన 'హుషార్ పిట్లలు' చిత్రం ఆగస్ట్ 15న విడుదల కాబోతోంది. ఈ సినిమాను ఏషియన్ సురేశ్ ఫిలిమ్స్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేయబోతోంది. అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'హుషారు పిట్టలు'. వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు ఆగస్టు 15న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ సోమవారం ఉదయం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు విచ్చేసి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, 'కొన్ని నెలల ముందు బెక్కెం వేణుగోపాల్ ద్వారా ఈ సినిమా గురించి తెలిసింది. తెలంగాణ నుంచి వచ్చిన దర్శక, నిర్మాతలు ఎంతో పాషన్‌తో సినిమా తీశారు. మా సురేష్ ప్రొడక్షన్స్ ప్రతినిధులు ఈ సినిమా చూసి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడంతో ఈ సినిమాను మా సురేష్ ఏషియన్ ఫిలింస్ ద్వారా విడుదల చేస్తున్నాం. ఈ సినిమా విషయంలో ఎదురైన అన్ని కష్టాలు దాటుకుని ఈ స్టేజ్‌కు వచ్చారు. వాళ్ల ఎగ్రెసివ్‌తో ఈ సినిమాను మార్కెటింగ్ చేస్తున్నారు. తప్పకుండా అందరి టైమ్‌కు, డబ్బుకు విలువ నిచ్చే సినిమా ఇది అని నమ్ముతున్నారు. విడుదలకు ముందే కొన్ని షోలు వేస్తున్నారు. ఆ పాజిటివ్ ఫీడ్‌బ్యాక్‌తో.. మౌత్ టాక్‌తో ఈ సినిమా మరింత మందికి రీచ్ అవుతుంది. తప్పకుండా ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మాట్లాడుతూ, 'ఈ చిత్రం ఎంతో నేచురల్‌గా ఉంటుంది. ఈ సినిమా చూస్తే అందరికి మీ ఊరికి వెళ్లొచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. నా హృదయానికి తాకిన సినిమా ఇది. నేను ఎప్పట్నుంచో కోరుకుంటున్న సక్సెస్ ఈ సినిమాతో దక్కుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమా విజయంతో నాకు సినీ

సీనియర్ నటుడు సురేష్ ఓ ఇంటర్వ్యూలో పలువురు ప్రముఖ నటులైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, విజయ్‌లతో తన అనుభవాలను, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన లక్షణాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఒక నిజమైన హీరోకు ఉండాల్సిన లక్షణాలు తెలిపారు. తమిళ నటుడు విజయ్‌తో తన పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ సురేష్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. "ఎవర్నైనా చూసి, అబ్బా ఏం హీరో అయ్యాడు అనిపించింది అంటే అది విజయ్. నేను చిన్నప్పుడే వాడిని ఎత్తుకున్నాను" అని సురేష్ అన్నారు. విజయ్ తండ్రి, ఎస్.ఏ.చంద్రశేఖర్‌తో కలిసి క్రికెట్ ఆడుతున్నప్పుడు విజయ్ చాలా చురుకైన పిల్లవాడని సురేష్ గుర్తుచేసుకున్నారు. పెద్దయ్యాక విజయ్ పెద్ద స్టార్ అయిన తర్వాత, తాను ఒకసారి ఎస్.ఏ.చంద్రశేఖర్‌కు, "మీ అబ్బాయి పెద్ద హీరో అయ్యాడు, అంతా మీ వల్లే" అని సరదాగా చెప్పిన విషయాన్ని పంచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్ చిత్రంలో సమంత తండ్రి పాత్రలో నటించిన అనుభవాన్ని సురేష్ వివరించారు. "తారక్‌తో అది నా మొదటి యాక్టింగ్ ఎక్స్పీరియన్స్" అని సురేష్ పేర్కొన్నారు. అంతకుముందు కొన్ని మీటింగ్‌లు, పార్టీలలో కలిసినప్పటికీ, కలిసి నటించినప్పుడు మాత్రమే ఒక నటుడి సామర్థ్యం తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ అద్భుతమైన నటుడని, "హి ఈజ్ ఏ వెరీ వెరీ కేపబుల్ యాక్టర్" అని ప్రశంసించారు. తారక్ సినిమాను లోతుగా అర్థం చేసుకోగలడని, ఒక డైలాగ్‌లో పంచ్ ఎక్కడ ఉంది, ఎంత చెప్పాలి, ఎప్పుడు వదిలేయాలి వంటి విషయాలపై స్పష్టమైన అవగాహన ఉంటుందని సురేష్ తెలిపారు. ఒక సన్నివేశంలో తన డైలాగ్‌లతో పాటు సహనటుల డైలాగ్‌లను కూడా తారక్ గుర్తుంచుకుని, దానికి తగినట్లుగా తన నటనను మార్చుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని ఆయన చెప్పారు. ఇది చాలా అరుదైన లక్షణమని, "ఏకసంధాగ్రాహి" అని పేర్కొన్నారు. తారక్ వయసులో పెద్దవారైన నటుల పట్ల, ముఖ్యంగా తన తాతగారు, బాబాయ్ జనరేషన్‌కు చెందిన నటుల పట్ల ఎంతో

‘ది ప్యారడైజ్’ (The Paradise) స్పెషల్ సాంగ్ షూటింగ్ పూర్తయింది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో దాదాపు 4 రోజుల పాటు నాని (Nani), కీర్తిసురేష్ (Keerthy Suresh) కాంబినేషన్ లో ఈ సాంగ్ ను షూట్ చేశారు. ఆట సందీప్ కొరియోగ్రఫీలో మంచి జాణపద బాణీగా ఈ పాట రాబోతోంది. స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్టు అనిరుధ్, ఈ పాటను తనదైన శైలిలో రక్తికట్టించాడనే టాక్ నడుస్తోంది. ఈ విషయాలన్నీ పక్కనపెడితే, ఇప్పుడు కీర్తిసురేష్ పాటకు కంపారిజన్స్ మొదలయ్యాయి. దీనికి కారణం ‘పెద్ది’ సినిమా. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో శృతిహాసన్ ఐటెంసాంగ్ చేసింది. ఆ పాట వచ్చిన కొన్ని నెలలకే కీర్తిసురేశ్ నుంచి స్పెషల్ సాంగ్ వస్తోంది. దీంతో.. శృతిహాసన్ Vs కీర్తిసురేష్ అన్నట్టుగా చర్చ సాగుతోంది. ‘పెద్ది’ ఐటెంసాంగ్ లో చేసిందన్న మాటే తప్ప, శృతిహాసన్ కు పెద్దగా క్రేజ్ రాలేదు. ఆ పాట హిట్టయినప్పటికీ శృతిహాసన్ చుట్టూ క్రేజ్ బిల్డప్ అవ్వలేదు. మధ్యలో జాన్వి కపూర్ వచ్చి డామినేట్ చేసిందనే టాక్ కూడా నడిచింది అప్పట్లో. ఇప్పుడు షార్ట్ గ్యాప్ లోనే కీర్తిసురేష్ నుంచి సాంగ్ వస్తోంది. ఈ పాట హిట్టయితే, ఈ సెగ్మెంట్ లో శృతిహాసన్ పై కీర్తిసురేశ్ పైచేయి సాధించినట్టవుతుంది. అన్నట్టు, ‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందే కీర్తిసురేష్ చేసిన స్పెషల్ సాంగ్ కు సంబంధించి నిమిషం నిడివి క్లిప్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్